ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రుల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌కు అధ్య‌క్ష‌త వ‌హించారు. మ‌న‌ శత్రువు ఆచూకీ మ‌న‌కు తెలుసు , త‌గిన రీతిలో,త‌గిన‌ స్థాయి, మార్గదర్శక ప్రతిస్పందనతో మేం దానిని అధిగమించగల స్థితిలో ఉన్నాము. ”

Posted On: 24 APR 2020 7:42PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌త‌, ప్ర‌జారోగ్యానికి సంబంధించి తీసుకున్న చ‌ర్య‌ల‌పై
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ఆరోగ్య‌, వైద్య‌విద్యా మంత్రులు సీనియ‌ర్ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఈ స‌మావేశంలో కేంద్ర కుటుంబ సంక్షేమ‌శాఖ స‌హాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే  కూడా ఉన్నారు.
ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ ,కోవిడ్ -19 పై పోరాటంలో వైర‌స్‌ను ఎదుర్కోవ‌డం, ప‌రిస్థితిని అదుపులో ఉంచ‌డంలో మీమీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత‌ప్రాంతాల‌లో మీరు చేస్తున్న కృషికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అని అన్నారు.

ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ,మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌ఘ‌డ్‌, అస్సాం, చండీఘ‌డ్‌, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం  ఉత్తరాఖండ్ ల‌కు చెందిన ఆరోగ్య‌శాఖ మంత్రులు, సినియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ,  కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం ఇప్పుడు మూడున్నర నెలలకు పైగా సాగుతోంది.  దేశంలో కోవిడ్ -19  నివారణ, నియంత్రణ  నిర్వహణ రాష్ట్రాల సహకారంతో అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించ‌డం జ‌రుగుతోంది. అని అన్నారు. దేశంలో మరణాల రేటు 3 శాతం కాగా, రికవరీ రేటు 20 శాతం కన్నా ఎక్కువగా ఉంద‌ని  ఆయన అన్నారు. వ్యాధి వ్యాప్తిని క‌నిపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న  ప్రయత్నాల గురించి మాట్లాడుతూ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, “మన శత్రువు ఆచూకీ మాకు తెలుసు  సరైన, గ్రేడెడ్ , గైడెడ్ స్పందనతో మేము దానిని అధిగమించగల స్థితిలో ఉన్నాము అని ఆయ‌న అన్నారు.
  రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల‌లో  ప‌రిస్థితిని అంచ‌నా వేసి   వారికి గ‌ట్టి భ‌రోసా ఇచ్చేందుకు కోవిడ్ పై రోజువారీ పోరాటంలో  వారికి స‌హాయం చేసేందుకు మేం సాంకేతిక అధికారుల బృందాలను  పంపించామని ఆయ‌న చెప్పారు..యాంటీ బాడీ  పరీక్షల సమస్యపై,  మాట్లాడుతూ ఆయ‌న‌,“పరీక్ష ఫలితాలు ప్రాంతం ప్రాంతానికీ మారుతూ ఉన్నాయ‌ని అందువ‌ల్ల వాటిపై ఆధారపడలేమన్నారు. దీనికి తోడు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా వీటి ఖ‌చ్చిత‌త్వం గురించి వ్యాఖ్యానించ లేద‌ని చెప్పారు. ఐసిఎంఆర్ ఈ ప‌రీక్ష‌ల‌, కిట్ల సామ‌ర్ధ్యాన్ని త‌మ స్వంత లేబ‌రెట‌రీల‌లో స‌మీక్షిస్తున్న‌ద‌ని, త్వ‌ర‌లోనే తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ముందుకు వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు.
 అంటువ్యాధుల సమయంలో  ఆరోగ్య సేవా సిబ్బందిపై హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గుకుండా రక్షించడానికి , ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897 ను స‌వ‌రిస్తూ , రాష్ట్ర‌ప‌తి జారీచేసిన ఆర్డినెన్సు గురించి రాష్ట్రాల‌కు వివ‌రిస్తూ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌,
ఆరోగ్య సంరక్షణ సేవా సిబ్బందిపైన‌, వైద్య ఆరోగ్య సంస్థ‌ల పైన‌ ఏ రూపంలో హింస‌నూ దాడుల‌ను ఉపేక్షించేది లేద‌ని అన్నారు.
ఇలాంటి హింస‌కుపాల్ప‌డడాన్ని శిక్షించ‌ద‌గిన‌, బెయిలుకు వీలు లేని నేరంగా ఈ స‌వ‌ర‌ణ ప‌రిగ‌ణిస్తుంది. ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డం, ప్రేరేపించిన వారికి మూడు నెల‌ల నుంచి ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్ష‌, రూ 50,000 ల నుంచి రూ 2,00,000 వ‌ర‌కు జ‌రిమానా విధించ‌వ‌చ్చు.  తీవ్ర గాయాలైన సంద‌ర్భాల‌లో జైలు శిక్ష‌ను ఆరు నెల‌ల నుంచి ఏడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు, జ‌రిమానాను రూ 1,00,000ల నుంచి రూ 5,00,000 ల వ‌ర‌కూ విధించ‌వ‌చ్చు న‌ని తెలిపారు. అలాగే కోవిడ్ -19పై  ముందువ‌రుస‌లో పోరాటం చేస్తున్న‌న ఆరోగ్య సంర‌క్ష‌కులు మ‌ర‌ణిస్తే వారి కుటుంబానికి రూ 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ఇన్సూరెన్సు ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్టు మంత్రి తెలిపారు. వీరిలో డాక్ట‌ర్లు ,ఆశా వ‌ర్క‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది, న‌ర్సులు, ప్రైవేటు డాక్ట‌ర్లు , పారిశుధ్య కార్మిక‌లు ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.
ప్రతి రాష్ట్రంలో పిపిఇలు, ఎన్ 95 మాస్క్‌లు, టెస్టింగ్ కిట్లు, ఔష‌ధాలు,  వెంటిలేటర్ల అవసరాన్ని  అందుబాటును ఆయన సమీక్షించారు . ఈ కీల‌క‌ వస్తువుల సరఫరాలో కొరత లేకుండా భారత ప్రభుత్వం చూస్తుంద‌ని ఆయ‌న‌ హామీ ఇచ్చారు.
పిపిఇలు , ఎన్ 95 మాస్క్‌లు దేశంలో దిగుమతి చేసుకునే వాళ్లం, కాని ఇప్పుడు మన దగ్గర 100  త‌యారీ యూనిట్లు ఉన్నాయి, అవి మ‌న‌దేశంలోనే వీటిని తయారు చేయగలవని కేంద్ర‌ మంత్రి చెప్పారు. ” , రాష్ట్రాల కృషిని అభినందిస్తూ ఆయ‌న‌, అవి  ఒక‌రు అనుస‌రిస్తున్న  ఉత్తమ పద్ధతులను  మ‌రొక‌రు అందిపుచ్చుకోవ‌చ్చ‌ని కూడా చెప్పారు.
దేశంలో కోవిడ్ -19 ప్ర‌త్యేక  ఆస్పత్రుల స్థితిని డాక్టర్ హర్ష్ వర్ధన్  సమీక్షించారు. "దేశంలోని ప్రతి జిల్లాలో ప్ర‌త్యేక కోవిడ్ -19 ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది . వీలైనంత త్వరగా వాటిని ప్ర‌క‌టించండి, తద్వారా ప్రజలకు వాటి గురించి తెలుస్తుంది అని ఆయ‌న అన్నారు.

కోవిడ్ తో సంబంధం లేని పేషెంట్ల‌ను నిర్లక్ష్యానికి గురికాకుండా చూడాల‌ని డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ద‌న్ మంత్రులంద‌రినీ కోరారు. మ‌నం కోవిడ్ -19  రోగులకు చికిత్స , సంరక్షణను అందిస్తున్న స‌మ‌యంలోనే, శ్వాసకోశ లేదా గుండె జబ్బులు, డయాలసిస్ అవసరం ఉన్నవారు, రక్తం అవసరమయ్యే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు గ‌ర్బిణులు, కోవిడ్ -19 కాని రోగులకు చికిత్సను కూడా మ‌నం అందించాలి. . ఈ  కీల‌క‌మైన జ‌బ్బులు ఎంత‌మాత్రం వేచి ఉండ‌లేనివ‌ని అందువ‌ల్ల వారిని ఏదో ఒక సాకు చెప్పి  చికిత్స అందించ‌కుండా  తిప్పకూడద‌ని ఆయ‌న అన్నారు. ” స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం గురించి ఆయన రాష్ట్రాలు . కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు నొక్కిచెప్పారు  ప్రస్తుత పరిస్థితులలో మలేరియా, డెంగ్యూ , టిబి వంటి ఇతర వెక్టర్ వ్యాధులనూ విస్మ‌రించ‌రాద‌ని, వీటిని ఎదుర్కొనేందుకూ  తమకు  తాము సిద్ధంగా ఉండాల‌ని ఆయన కోరారు.


ఆరోగ్యాసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించుకోవాలని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కోరారు, ఎందుకంటే ప్రజలు కరోనా వైరస్  వ్యాధిన‌ప‌డే  ప్రమాదాన్ని అంచనా వేయడానికి  ఇది వీలు కల్పిస్తుంది. "స్మార్ట్ ఫోన్‌లో ఒక‌సారి ఇన్‌స్టాల్ చేసిన‌ తర్వాత, అధునాతన ప్ర‌మాణాల‌ ఆధారంగా  ఇన్‌ఫెక్ష‌న్ సోకే  ప్రమాదాన్ని ఈ యాప్  అంచనా వేయగలదు" అని ఆయన చెప్పారు.
చివర‌గా, డాక్టర్ హర్ష్ వర్ధన్ కోవిడ్ -19 పై  పోరాటంలో సామాజిక దూరాన్ని పాటించేలా చూడాల‌ని, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాలని  కోరారు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆయన రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు. "లాక్డౌన్ 2.0 ను ఇంతకుముందు అనుస‌రించిన‌ట్టుగా,  అక్ష‌రాలా, క‌ట్టుదిట్టంగా అనుసరించాలని ఆయన సలహా ఇచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలు మ‌రీ ఎక్కువ స‌డ‌లింపులు  ఇవ్వ‌వ‌ద్ద‌ని, త‌గిన‌ ప్రమాణాలను పాటించాలని ఆయన కోరారు. లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఉత్తర ప్రదేశ్  ఉదాహరణను ఆయన ప్ర‌స్తావించారు. ఇతర రాష్ట్రాలు దీనిని అనుస‌రించాలని సూచించారు.

కోవిడ్ య‌మహమ్మారిపై పోరాటంలో రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు త‌మ స్ఫూర్తిని ఉన్న‌త‌స్థాయిలో కొన‌సాగించాల‌ని త‌ద్వారా దేశం కీల‌క ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అందించ‌డంలో మ‌రింత స్వావ‌లంబ‌న సాధించ‌డానికి, సంక్షోభాన్ని త‌ట్టుకోగ‌ల శ‌క్తిని పొంద‌డానికి వీలు క‌లుగుతుంద‌ని డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్ అన్నారు. భారతదేశం విస్తారమైన దేశం అని, రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల‌ సహకారంతో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని ల‌క్షిత ముగింపుకు తీసుకువెళతామని ఆయన అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో శ్రీమతి ప్రీతి సుడాన్, కార్యదర్శి (హెచ్‌ఎఫ్‌డబ్ల్యు), డాక్టర్ బలరామ్ భార్గ‌వ ,సెక్ర‌ట‌రీ, డిహెఆర్, డిజి ఐసిఎంఆర్ ,, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఐసిఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు


 

*****

 


(Release ID: 1618085) Visitor Counter : 171