మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐఐటి ఢిల్లీ వారి అద్భుత విజయం, తక్కువ ఖర్చుతో ప్రోబ్ – ఫ్రీ కోవిడ్ -19 డిటెక్షన్ అస్సేను అభివృద్ధి చేసిన ఐఐటి, ఢిల్లీ

· ప్రోబ్ ఫ్రీ కోవిడ్ -19 డిటెక్షన్ అస్సే అభివృద్ధిలో భాగస్వాములైన ఐఐటి, ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్తల బందాన్ని సత్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

· ఈ పరీక్షా యంత్రం ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు కోవిడ్ -19 మీద ప్రభుత్వం సాగిస్తున్న పోరులో కీలక పాత్ర పోషిస్తుందన్న కేంద్ర మంత్రి

· ఈ టెస్టింగ్ కిట్, ఐ.సి.ఎం.ఆర్. చే ఆమోదించిన బడిన మొట్టమొదట ప్రోబ్ ఫ్రీ అస్సే

· ఐఐటి, ఢిల్లీ తయారు చేసిన కోవిడ్ -19 టెస్టి కిట్ మేక్ ఇన్ ఇండియా చొరవకు అనుగుణంగా ఉందన్న శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ 'నిశాంక్'

Posted On: 24 APR 2020 6:31PM by PIB Hyderabad

కోవిడ్ -19కు సంబంధించి ప్రోబ్- ఫ్రీ రియల్ టైమ్ పి.సి.ఆర్. డయాగ్నొస్టిక్ కిట్ అభివృద్ధిలో పాల్గొన్న ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తల బృందాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ సత్కరించారు. ఎం.హెచ్.ఆర్.డి. కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, అదనపు కార్యదర్శి శ్రీ రాకేష్ సర్వాల్, ఐఐటి ఢిల్లీ డైరక్టర్ శ్రీ రామ్ గోపాల్ రావు, ప్రొఫెసర్ వివేకాననాడ్ పెరుమాళ్, ప్రొఫెసర్ మనోజ్ మీనన్ నేతృత్వంలోని ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

https://twitter.com/DrRPNishank/status/1253636361896132609?s=19

https://twitter.com/DrRPNishank/status/1253656017059098625?s=19

https://twitter.com/DrRPNishank/status/1253637288019415040?s=19

https://twitter.com/DrRPNishank/status/1253637291060289538?s=19

ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ, కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి ముందుకు రావాలని శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులను మన ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారని, ఈ పిలుపునకు ప్రతిస్పందనగా, హెచ్.ఆర్.డి. మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని ప్రధాన సంస్థలు తెరపైకి వచ్చాయని, కోవిడ్ -19 విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రశంసించ దగిన పని చేశారని, ఉత్తమమైన విధంగా తోడ్పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంత బలాన్ని పెంచుకోవాలని ప్రధాని ఆశిస్తున్నారన్న శ్రీ రమేష్ ఫోఖ్రియాల్, ఐఐటీల పరిశోధన సామర్థ్యం మరియు ఉన్నత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేక ఉద్యమాన్ని వేగవంతం చేసేందుకు పరిశోధనలు మరియు ఆవిష్కరణల దిశగా సమావేశాలు జరిగాయని తెలిపారు.

శాస్త్రవేత్తల బృందాన్ని సత్కరిస్తున్న సందర్భంలో మాట్లాడిన శ్రీ ఫోఖ్రియాల్, కోవిడ్ -19 వ్యాప్తి సమస్య మొత్తం మానవాళి ఎదుర్కొంటోందని, హెచ్.ఆర్.డి. మంత్రిత్వ శాఖ తన అన్ని సంస్థలు, పరిశోధకులు, విద్యావేత్తలు, అధ్యాపక సభ్యులు మరియు పూర్తి లాక్ డౌన్ సమయంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యార్థులు, తలెత్తే సమస్యలకు పరిష్కారాన్ని తీసుకురావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.

భారత ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో టెస్టింగ్ కిట్ ను అందుబాటులోకి తీసుకు రావడంలో ఐఐటి, ఢిల్లీ చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. కిట్ ఆరోగ్య సంరక్షణ సేవలను శక్తివంతం చేయడమే కాకుండా, సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి మద్ధతు అందిస్తుందన్నారు. ఐఐటి ఢిల్లీ కుసుమ స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ (కె.ఎస్.బి.ఎస్) పరిశోధకులను ఆయన అభినందించారు. కోవిడ్ -19 కోసం డిటెక్షన్ అస్సేను అభివృద్ధి చేసిన ఐ.సి.ఎం.ఆర్. ఇప్పుడు దీనిని ఆమోందించిందని, 100 శాతం కచ్చితమైన మరియు విశిష్టతతో ఐ.సిఎం.ఆర్. వద్ద ఈ పరీక్ష ధృవీకరించబడిందని తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రియల్ టైమ్ పిసిఆర్ ఆధారిత డయాగ్నొస్టిక్ అస్సే కోసం ఐసిఎంఆర్ అనుమతి పొందిన మొదటి విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ నిలించిందని తెలిపారు.

పరిశోధన కార్యక్రమాల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తుందన్న విషయాన్ని స్పష్టం చేసిన శ్రీ పోఖ్రియాల్, మేక్ ఇన్ ఇండియా తీసుకున్న చొరవ ఇంలాంటి ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధనలను ధృవీకరించడంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) చేసిన కృషికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కు శ్రీ ఫోఖ్రియాల్ కృతజ్ఞతలు తెలిపారు.

 ఐ.సి.ఎం.ఆర్. ఆమోదించిన కోవిడ్ -19 కోసం ఇది మొదటి ప్రోబ్ ఫ్రీ అస్సే అని, ఇది నిర్ధిష్ట మరియు సరమైన అధిక నిర్గమాంశ పరీక్షకు ఉపయోగపడుతుందని శ్రీ రామ్ గోపాల రావు మంత్రికి తెలియజేశారు. ఫ్లోరోసెంట్ ప్రోబ్స్ అవసరం లేనందున ఈ పరీక్షను సులభంగా స్కేల్ చేయవచ్చని, వీలైనంత త్వరగా తగిన పారిశ్రామిక భాగస్వాములతో సరసమైన ధరలకు కిట్ ను పెద్ద ఎత్తున తయారు చేయించాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

 

 

ప్రశాంత్ ప్రధాన్ (పీహెచ్‌డీ స్కాలర్), అశుతోష్ పాండే (పీహెచ్‌డీ స్కాలర్), ప్రవీణ్ త్రిపాఠి (పీహెచ్‌డీ స్కాలర్), డాక్టర్ అఖిలేష్ మిశ్రా, డాక్టర్ పరుల్ గుప్తా, డాక్టర్ సోనమ్ ధమిజా, ప్రొఫెసర్ వివేకానందన్ పెరుమాల్, ప్రొఫెసర్ మనోజ్ బి. మీనన్, ప్రొఫెసర్ బిష్వాజిత్ కుండు, ఐఐటి ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ గోమ్స్ ఈ పరిశోధనా బృందంలో ఉన్నారు.

 

*****

 



(Release ID: 1617973) Visitor Counter : 176