పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రశంసనీయమైన సేవలను అందించినందుకు విమానయాన నిపుణులు, భాగస్వామ్య పక్షాలకు అభినందించిన హర్దీప్ సింగ్ పురి
- కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో లైఫ్‌లైన్ ఉడాన్ విమానాల ద్వారా 3,43,635 కి.మీ.ల
మేర ప్రయాణం చేసి 591 టన్నులకు పైగా సరుకు రవాణా
Posted On:
24 APR 2020 5:27PM by PIB Hyderabad
కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రశంసనీయమైన సేవలను అందించినందుకు విమానయాన నిపుణులు, భాగస్వామ్య పక్షాలకు పౌర విమానయాన శాఖ మంత్రి(స్వతంత్ర హోదా) హర్దీప్ సింగ్ పురి అభినందనలు తెలిపారు. లైఫ్‌లైన్ ఉడాన్ విమానాల ద్వారా దేశవ్యాప్తంగా పౌరులకు ప్రాణాలను రక్షించే వైద్య మరియు అవసరమైన ఇతర సామాగ్రిని అందుబాటులోకి తెచ్చేందుకు గాను వారు అందించిన సేవలను మంత్రి ప్రశంసించారు. శుక్రవారం ఇందుకు సంబంధించి మంత్రి ఒక ట్వీట్ చేస్తూ లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు ఈ రోజు వరకు 3,43,635 కి.మీ. ప్రయాణించాయని తెలిపారు. లైఫ్‌లైన్ ఉడాన్ కింద ఎయిరిండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్ మరియు ప్రైవేట్ క్యారియర్లుకు చెందిన 347 విమానాలు సేవలందించినట్టుగా ఆయన తెలిపారు. వీటిలో 206 విమానాలను ఎయిర్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్‌కు చెందినవేనని అన్నారు. ఈ రోజు వరకు విమానాలు 591.66 టన్నుల సరుకును రవాణా చేసినట్టుగా తెలిపారు. విస్తారా సంస్థకు చెందిన ఏడు కార్గో విమానాలను ఏప్రిల్ 19-23 మధ్య కాలంలో దాదాపు 8,989 కిలో మీటర్ల మేర ప్రయాణం సాగించి 20 టన్నుల సరుకును రవాణా చేసినట్టు మంత్రి వివరించారు.
మరోవైపు స్పైస్‌జెట్ సంస్థ మార్చి 24 నుండి ఏప్రిల్ 23 మధ్య కాలంలో దాదాపు 522 కార్గో విమానాలను 7,94,846 కిలోమీటర్ల మేర నడిపించి దాదాపు 3993 టన్నుల సరుకును రవాణా చేసింది. వీటిలో 178 అంతర్జాతీయ కార్గో విమానాలున్నట్టుగా తెలిపారు. బ్లూ డార్ట్ సంస్థకు చెందిన 184 కార్గో విమానాలు మార్చి 25 నుంచి 23 ఏప్రిల్ వరకు 1,87,155 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు 2957 టన్నుల సరుకులను రవాణా చేసింది. వీటిలో 06 అంతర్జాతీయ కార్గో విమానాలున్నాయి. ఇండిగో సంస్థ ఏప్రిల్ 3-23 మధ్య కాలంలో 48,344 కిలోమీటర్ల దూరంలో 37 కార్గో విమానాలను నడిపించి దాదాపు 101 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇందులో 8 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. ప్రభుత్వం అవసరాల కోసం ఈ విమానాలు వైద్య సామాగ్రిని ఉచితంగా రవాణా చేశాయి. దేశీయ కార్గో ఆపరేటర్లు వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నారు. అంతర్జాతీయ సెక్టార్‌లో, ఎయిర్ ఇండియా విమానాలు ఏప్రిల్ 23 న హాంకాంగ్ మరియు గ్వాంగ్జౌ పట్టణాల నుండి 61 టన్నుల పరిమాణంలో వైద్య సామగ్రిని తీసుకువచ్చాయి. మరోవైపు బ్లూ డార్ట్ ఏప్రిల్ 14 నుండి 23 మధ్య కాలంలో గ్వాంగ్జౌ నుండి 86 టన్నుల వైద్య సామాగ్రి రవాణా చేసింది.
(Release ID: 1617954)
Visitor Counter : 174
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada