పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పి.ఎం.యు.వై) లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ల పంపిణీని వేగవంతం చేయాలని ఓ.ఎం.సి.లకు పిలుపునిచ్చిన శ్రీ ధర్మేంద్రప్రధాన్

Posted On: 23 APR 2020 7:29PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులందరికీ ఉచిత రీఫిల్స్ పంపిణీని వేగవంతం చేసేందుకు ఎల్.పి.జి. సిలిండర్ సరఫరా గొలుసులోని వారందరూ శ్రద్ధగా మరియు క్రమపద్ధతిలో పని చేయాలని పెట్రోలియం మరియు సహజవాయువు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, రాబోయే 3 నెలల్లో 8 కోట్లకు పైగా పి.ఎం.యు.వై. లబ్ధి దారులు ఈ 3 సిలిండర్లను పొందడానికి అర్హులు.

దేశవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓ.ఎం.సి)ల జిల్లా నోడల్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన ఆయన, కోవిడ్ -19 మరియు లాక్ డౌన్ కారణంగా ఇలాంటి అపూర్వమైన సంక్షోభ సమయంలో, ప్రభుత్వ పేదలకు ఒక ప్యాకేజీని అందించిందని, ఉచిత సిలిండర్ల పంపణీ అందులో కీలకమైనదని తెలిపారు. ఏప్రిల్ ప్రారంభం నుంచి మూడు వారల్లో సుమారు 40 శాతం మంది లబ్ధిదారులకు తమ సిలిండర్ లభించిందని, లక్ష్యాన్ని చేరుకునేందుకు సిలిండర్ బుకింగ్ మరియు పంపిణీ వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలో అత్యుత్తమ పద్ధతుల్ని అవలంబించాల్సిన అవసరం ఉందని, లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళిక ప్రకారం పని చేయాలని, ఈ దిశగా ప్రయత్నాలను మరింత పెంచుకోవాలని ఆయన డి.ఎన్.ఓ.లకు పిలుపునిచ్చారు. డోర్ డెలివరీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, అదనపు చార్జీల ఫిర్యాదులు ఉండకూడదని హెచ్చరించారు. పి.ఎం.యు.వై. లబ్ధిదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దీని వల్ల సాధారణ వినియోగదారులకు చేసే సరఫరా కూడా ప్రభావితం కాదని ఆయన తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అన్ని రకాల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, లౌక్ డౌన్ సమయంలో ఎం.హెచ్.ఏ. సూచనలను పాటించాలని, ఆరోగ్యసేతు యాప్ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన డి.ఎన్.ఓ.లకు పిలుపునిచ్చారు.

డి.ఎన్.ఓ.లు కలిసి పని చేస్తూ అనేక వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. ప్రజలకు చేరుకునేందుకు, వినియోగదారులుకు వారి ఖాతాల నుంచి డబ్బును ఇవ్వడానికి, మరియు సిలిండర్లను బుక్ చేయడంలో మరింత సహకారం అందిస్తున్నాయి. పథకం మరయు దాని విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వారు వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారు. వారిలో కొందరు సౌకర్యవంతమైన సమయాలను ఎంచుకోవడంతో పాటు కిరాణా దుకాణాల సహాయం తీసుకుంటూ జిల్లా పరిపాలనా ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారు. వారిలో చాలా మంది పి.ఎం.కేర్స్ ఫండ్ కు సమిష్టిగా సహకరించారని, ఆరోగ్యసేతు యాప్ ను కూడా ప్రచారం చేస్తున్నారని సమాచారం.

బీహార్ లోని సుపాల్ లో దొంగలు దాడి చేసిన సంఘటనలో ఎల్.పి.జి. డెలివరీ బాయ్ దురదృష్టవశాత్తు మరణించిన ఘటన గురించి ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభంలో అతడి ఆత్మ శాంతి కోసం ఒక నిముషం మౌనం పాటించారు. ఆ డెలివరీ బాయ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారికి ప్రభుత్వం నుంచి అన్ని ఉపశమనాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 

 

--



(Release ID: 1617734) Visitor Counter : 137