హోం మంత్రిత్వ శాఖ

సంస్థ‌లో కోవిడ్‌-19 ఉద్యోగిని గుర్తిస్తే కంపెనీ సీఈఓపై చట్టపరమైన బాధ్యతకు సంబంధించి

పరిశ్రమ సంఘాలలోని నెల‌కొన్న త‌ప్పుడు అవ‌గాహ‌న‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన కేంద్ర హోం శాఖ‌

-కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపల ఉండే ప్రాంతాల్లో సంస్థ‌లు పనిచేయడానికి ఇప్పటికే అనుమతులిచ్చామ‌ని.. మ‌ళ్లీ అధికారుల నుండి ప్రత్యేక / తాజా అనుమతులు అవసరం
లేదని వెల్ల‌డి

Posted On: 23 APR 2020 8:47PM by PIB Hyderabad

కోవిడ్‌-19 ఏకీకృత సవరించిన మార్గదర్శకాల నుంచి కొన్ని ర‌కాల కార్యకలాపాలకు మినహాయింపును ఇస్తూ ఈ నెల 15న (15.04.2020) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హాట్ స్పాట్స్ / కంటైన్మెంట్‌ జోన్లలో చేర్చని కొన్ని ప్రాంతాలకు ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశారు.  
(Https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)

ఈ మార్గదర్శకాలతో పాటు, ప‌ని ప్ర‌దేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలు మరియు ఇతర సంస్థలను అనుసరించాల్సిన సామాజిక దూరం, పరిశుభ్రత చర్యలకు సంబంధించి కోవిడ్‌-19 నిర్వహణ మరియు ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) కోసం జాతీయ ఆదేశాలు జారీ చేయ‌డ‌మైంది. ప‌ని ప్ర‌దేశాలు, పారిశ్రామిక మరియు వాణిజ్య సంస్థలు ఈ మార్గదర్శకాలను త‌ప్ప‌క పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్‌డ‌బ్య్లు) నోటిఫై చేసిన ప్రామాణిక ఆరోగ్య ప్రోటోకాల్‌ల‌ను కూడా త‌ప్ప‌క పాటించాల్సి ఉంటుంది.
అవాస్త‌వాల‌తో కొత్త భ‌యాలు..
వివిధ మార్గదర్శకాలకు సంబంధించి కొన్ని తప్పుడు వ్యాఖ్యానాల కార‌ణంగా ప‌లు కంపెనీలు త‌యారీ సంస్థ‌లు మీడియా వివిధ ర‌కాల భ‌యాల‌ను లేవనెత్తుతున్నాయి. వీటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
- కర్మాగారంలో కోవిడ్‌-19 సంక్ర‌మించిన ఉద్యోగి ఉన్న‌ట్టుగా తేలితే స‌ద‌రు సంస్థ సీఈవోకు జైలు శిక్షతో పాటు రాష్ట్రాలు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చ‌ని, అటువంటి పరిస్థితిలో, ఫ్యాక్టరీ యొక్క ప్రాంగణం కూడా 3 నెలలు మూసివేయబడుతుంది.
- కోవిడ్ నియంత్ర‌ణ దిశ‌గా ముందు జాగ్రత్త చర్యలను పాటించకపోతే, ఫ్యాక్టరీని 2 రోజులు మూసివేయవచ్చు, ర‌క్ష‌ణ‌ చ‌ర్య‌ల‌ను పూర్తి స్థాయిలో చేప‌ట్టిన త‌రువాత తిరిగి ప్రారంభించడానికి అనుమతించవచ్చు. అయితే ఏకీకృత సవరించిన మార్గదర్శకాలలో అటువంటి నిబంధనలేవి లేవ‌ని మరియు దీనికి సంబంధించిన ఊహాజ‌నిత భయాలకు కూడా ఎటువంటి ఆధారం లేదని స‌ర్కారు స్పష్టం చేసింది. 24.03.2020వ తేదీన‌ జారీ చేసిన గ‌త మార్గదర్శకాల ప్రకారం అనుమతించబడిన మునుపటి కార్యకలాపాలన్నింటిలోని వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి  తీసుకుంటూ అదనంగా అనుమతించబడిన కొన్ని కొత్త కార్యకలాపాలతో 15.04.2020న తాజాగా ఏకీకృత సవరించిన మార్గదర్శకాలు జారీ చేయ‌డ‌మైంద‌ని తెలిపింది. అయితే ఏకీకృత సవరించిన మార్గదర్శకాలు ఇంతకుముందు అందించిన మినహాయింపులను ఏమాత్రం కుదించ‌వ‌ని తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్ పరిధిలోకి వస్తే తప్ప మినహాయింపుల‌ను కుదించ‌రు. కంటైనర్ జోన్ల  వెలుపల ఉండే వివిధ ప‌రిశ్ర‌మ‌లు ప‌ని చేసేలా 15.04.2020కి ముందే త‌గిన‌ అనుమతులు జారీ చేయ‌డ‌మైంద‌ని. ఇక  ఇప్ప‌డు దీనికి సంబంధించి అధికారుల నుండి ప్రత్యేక/ తాజా అనుమతులు అవసరం లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. సామాజిక దూరంతో పాటు క‌రోనా నివార‌ణకు సంబందించిన ఎస్ఓపికి అనుగుణంగా చ‌ర్య‌లుండాల‌ని నొక్కి చెప్పింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో అనుమతించబడిన వివిధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి తాజాగా లైసెన్స్ లేదా చట్టబద్ధమైన అనుమతి అవసరం లేదని నొక్కి చెప్పబడింది.
సంబంధితిల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి..
కోవిడ్‌-19 అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా పారిశ్రామిక క్షేత్ర సంస్థలు, క్షేత్ర కార్యాలయాలు లాక్‌డౌన్ చర్యల యొక్క మార్గదర్శకాలను వారికి తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఒక వ‌ర్త‌మానాన్ని పంపింది. ఏదైనా తయారీ / వాణిజ్య సంస్థల యాజ‌మాన్యాల‌ను వేధించేలా వీటిని ఎట్టి ప‌రి‌స్థితుల‌లోనూ దుర్వినియోగం కాకుండా చూడాల‌ని హోం శాఖ ఆదేశించింది.

 

రాష్ట్రాలకు అధికారిక కమ్యూనికేషన్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 



(Release ID: 1617713) Visitor Counter : 187