భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

వారణాసిలో ప్రత్యేక డ్రోన్ల ద్వారా కొవిడ్ రోగ క్రిమి నిర్మూలనం

Posted On: 23 APR 2020 6:41PM by PIB Hyderabad

వారణాసిలో కొవిడ్-19  రోగ క్రిమి నిర్మూలనకు ప్రత్యేకంగా ఆకృతిచేసిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. భారత దేశపు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ ఇన్వెస్ట్ ఇండియా వారు అగ్ని మిషన్ మరియు బిజినెస్ ఇండియా ఇమ్యూనిటీ ప్లాట్ఫాం(బిఐపి) వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

భారత ప్రభుత్వం కొవిడ్-19  నిర్మూలనకు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచంలో అత్యంత మెరుగైనవి:  భారతీయులకు కొవిడ్-19 సోకే అవకాశాలను కనిష్ట స్థాయికి తగ్గించడం. సాంకేతిక సహకారంతో ప్రభుత్వాధికారాన్ని వినియోగించి స్థానిక  యంత్రాంగానికి ఉండే శక్తి సామర్థ్యాలను పెంపొందించడం.

డ్రోన్ల వినియోగం: డ్రోన్లను ఉపయోగించి యంత్రాంగం ఎక్కువ మొత్తంలో మరియు ఎక్కువ సమూహాలు ఉన్న చోట, పట్టణ ప్రాంతాల్లో రోగ క్రిమి నిర్మూలినిని  పిచికారీ చేయడం, వ్యక్తులు ఒకరికి ఒకరు స్పర్శించుకోకుండా, ఈ పరిస్థితుల్లో పనిచేసే వారిని  సామాజిక దూరం పాటించేలా చేయడం ద్వారా పట్టణాల్లో నివాసముండే వారిని కొవిడ్-19 నుండి రక్షించడం.

చెన్నైకి చెందిన డ్రోన్ల అంకుర సంస్థ గరుడ ఏరోస్పేస్ సహకారంతో వారణాసిలో రోగ క్రిమి నిర్మూలినిని  పిచికారీ చేయడం:    ఈ  గరుడాస్ టెక్నాలజీస్  సంస్థకు చెందిన బృందం కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో వారణాసిలో తమ సిబ్బంది ద్వారా ఈ పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. కొవిడ్-19పై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తూ ప్రతీ దశలోనూ అవసరమైన భాగస్వామ్యాన్ని అందించింది.

వారణాసిలో డ్రోన్లతో పిచికారీ కార్యక్రమం ఇపుడే ప్రారంభం కాగా  ఈ బృందం తమ సహకారాన్ని దేశంలోని మరిన్ని పట్టణాలకూ కూడా అందించనుంది. ప్రభుత్వం-ఆవిష్కర్త భాగస్వామ్యం వినియోగించి నవసాంకేతికత కలయిక సహకారంతో కొవిడ్-19పై పోరాటాన్ని సాగిస్తున్నది భారత ప్రభుత్వ యంత్రాంగం.

 

 

 

****



(Release ID: 1617626) Visitor Counter : 205