పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగాగల గ్రామపంచాయతీలతో 24 ఏప్రిల్ 2020న మాట్లాడనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
Posted On:
22 APR 2020 7:52PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఏప్రిల్ 24, 2020 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా గల గ్రామపంచాయతీలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 24 న ప్రతిసంవత్సరం, పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నందున ప్రధానమంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ఏకీకృత ఈ - గ్రామ్‌స్వరాజ్‌పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు.
ఏకీకృత పోర్టల్ అనేది పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ కొత్త ఆలోచన. ఇది గ్రామపంచాయతీలు, ఒకే ఇంటర్‌ఫేస్‌ద్వారా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి)ని రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్వమిత్వ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం గ్రామీణ భారతదేశంలో సమీకృత ప్రాపర్టీ వాలిడేషన్ కు పరిష్కారం కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో నివాస ప్రాంతాలను విస్తారమైన సర్వే పద్ధతుల ద్వారా గుర్తిస్తారు. పంచాయతిరాజ్‌మంత్రిత్వశాఖ, రాష్ట్ర పంచాయతిరాజ్ విభాగం, రెవిన్యూ డిపార్టమెంట్, సర్వే ఆఫ్ ఇండిఆయల సంయుక్త సహకారంతో డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీనిని చేపడతారు.
ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా మంచి పనితీరు కనబరచిన పంచాయతీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు , పంచాయతీలు కనబరచిన మంచి పనితీరు, ప్రజలకు సేవల అందుబాటును మరింత మెరుగుపరచడం, ప్రజలకు మంచి పనులు చేయడం వంటి వాటికి గుర్తుగా అవార్డులు ఇస్తూ వస్తోంది. ఈ సంవత్సరం అలాంటి మూడు అవార్డులైన, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ్ సభ పురస్కార్ (ఎన్‌డిఆర్‌జిజిఎస్‌పి), బాలలకు స్నేహపూర్వకంగా ఉన్న గ్రామపంచాయతీ అవార్డు (సిఎఫ్‌జిపిఎ), గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి) అవార్డు లను ఖరారు చేశారు. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేస్తారు.
నేపథ్యం:
1993 ఏప్రిల్ 24 , అట్టడుగు స్థాయిలో అధికార వికేంద్రీకరణ చరిత్రలో చెప్పుకోదగిన రోజు. పంచాయతీ రాజ్ సంస్థలు రాజ్యాంగంలోని 73 వ సవరణ చట్టం -1992 ద్వారా వ్యవస్జీకృతమైన సందర్భం. ఆరోజు నుంచే అది అమలులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీ రాజ్‌దినోత్సవం ( రాష్ట్రీయ్ పంచాయతీ రాజ్ దివస్ )(ఎన్.పి.ఆర్.డి) జరుపుకుంటారు. 73 వ రాజ్యాంగ సవరణ ఈ తేదీ నుంచే అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గల పంచాయత్ ప్రతినిధులతో నేరుగా మాట్లాడడానికి , వారు సాధిస్తున్న విజయాలను గుర్తించడానికి , సాధికారత, మరింత ప్రేరణ కల్పించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
2. సాధారణంగా, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఢిల్లీ వెలుపల నిర్వహిస్తుంటారు చాలా సందర్భాలలో గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్బంగా ఆ కార్యక్రమానికి హాజరౌతుంటారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.ఈ జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించేందుకు గౌరవనీయ ప్రధానమంత్ఇర తమ సమ్మతి కూడా తెలిపారు. దేశవ్యాప్తంగా గల గ్రామసభలు, పంచాయతీరాజ్ సంస్థల నుద్దేశించి ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించాల్సిఉంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశంలో ఊహించని పరిస్థితులు ఏర్పడడంతో , జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని 2020 ఏప్రిల్ 24న (శుక్రవారంనాడు) డిజిటల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు.
3. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా మంచి పనితీరు కనబరచిన పంచాయతీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు , పంచాయతీలు కనబరచిన మంచి పనితీరు, ప్రజలకు సేవల అందుబాటును మరింత మెరుగుపరచడం, ప్రజలకు మంచి పనులు చేయడం వంటి వాటికి గుర్తుగా అవార్డులు ఇస్తూ వస్తోంది. ఈ సంవత్సరం అలాంటి మూడు అవార్డులైన, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ్ సభ పురస్కార్ (ఎన్‌డిఆర్‌జిజిఎస్‌పి), బాలలకు స్నేహపూర్వకంగా ఉన్న గ్రామపంచాయతీ అవార్డు (సిఎఫ్‌జిపిఎ), గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి) అవార్డు, ఈ పంచాయతి పురస్కార్ ( దీనిని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే ఇస్తారు)లను ప్రదానం చేస్తూ వస్తోంది.
ఈ సంవత్సరం లాక్‌డౌన్ కారణంగా మూడు కేటగిరీలలోని అవార్డులు అంటే నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ ((NDRGGSP), బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ అవార్డు ((CFGPA), గ్రామపంచాయతీ అభివృద్ది ప్రణాళిక (జిపిడిపి) అవార్డులను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేస్తారు. ఇతర రెండు కేటగిరీలకు చెందిన అవార్డులను ఖరారు చేసి, తగిన ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఆ సమాచారాన్ని వేరుగా రాష్ట్రాలకు , కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేస్తారు. కోవిడ్ -19 మహమ్మార కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం అయింది.
4. ఎన్.పి.ఆర్‌డి కార్యక్రమం డిడి- న్యూస్, ద్వారా టెలికాస్ట్ అవుతుంది. అలాగే ఈ- ఈవెంట్‌ను పంచాయతీరాజ్ డిపార్టమెంట్ అధికారులు, ఇతర భాగస్వాములు, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయి అధికారులు చూస్తారు.లాక్‌డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించే నిబంధనల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వారు ఇందులో పాల్గొంటారు.
(Release ID: 1617316)
Visitor Counter : 331
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada