ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పై అప్‌డేట్స్
Posted On:
22 APR 2020 4:33PM by PIB Hyderabad
రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ షర్షవర్ధన్‌లు ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సీనియర్ ప్రతినిధులు ,డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనాపై పోరాటంలో తమ భద్రతపై వైద్య బృందం వ్యక్తం చేసిన భయాలను వారు పారద్రోలుతూ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, వైద్యుల శ్రేయస్సు, వారి భద్రతకు సంబంధించి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని అన్నారు.
అలాగే, కోవిడ్ -19 కు సంబంధించిన సేవలలో ఉన్న ఆరోగ్య సిబ్బంది భద్రతకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులను ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రస్తుత సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో వారి సేవలు , నైపుణ్యం ,అందరు వృత్తిదారులకంటె వారిని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతాయి. ఇటువంటి పరిస్థితులలో మానవ వనరుల అభివృద్దికి చర్యలు, వైద్యపరమైన భద్రత, సిబ్బందికి మార్గదర్శకాలు, సకాలంలో వారికి చెల్లింపులు చేయడం, వారికి మానసిక స్థైర్యాన్ని కలిగించడం, వైరస్ నియంత్రణలో ముందుండి పోరాడుతున్న సిబ్బందికి శిక్షణ, వారికి జీవిత భీమా వంటి చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
దీనితోపాటు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు డాక్టర్ల భద్రతకు హామీ ఇస్తూ ఎపిడమిక్ డిసీజెస్ చట్టం 1897 కింద ఆర్డినెన్సు జారీకి కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసింది.
రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌ను ఉపయోగించడం కోసం ఐ.సి.ఎం.ఆర్ ఒక ప్రోటోకాల్‌ను అన్ని రాష్ట్రాలకు పంపింది. యాంటీబాడీ రాపిడ్ టెస్ట్‌లు ఎక్కువగా వైరస్ వ్యాప్తిపై నిఘా కింద ఉపయోగిస్తున్నారని పునరుద్ఘాటించింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ పరీక్ష ఉపయోగాలు గుర్తిస్తున్నారు. దీనిని ప్రస్తుతం వ్యక్తులలో యాంటీబాడీలు ఏర్పడటాన్ని గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు.. ఈ పరీక్షా ఫలితాలు క్షేత్ర స్థాయి పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి.
ఐసిఎంఆర్ ప్రస్తావించినట్టుగా , ఈ పరీక్షలు కోవిడ్ -19 కేసులను నిర్ధారించడానికి ఆర్‌టి-పిసిఆర్‌పరీక్షకు ప్రత్యామ్నాయం కాజాలవు. క్షేత్ర స్థాయి పరిస్థితులలో ఈ రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ వినియోగం పరిధిని , విస్తృతిని అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాల నుండి డేటాను సేకరించడానికి ఐసిఎంఆర్ సహాయం చేసేందుకు హామీ ఇచ్చింది. ఈ పరీక్షలకు సంబంధించి నిర్దేశిత ప్రొటోకాల్ ను పాటించేందుకు, ఐసిఎంఆర్ రాష్ట్రాలకు రోజూ తగిన సూచనలు ఇస్తోంది. వీటిని నిర్దేశిత ప్రయోజనాల కోసం ఉపయోగించాలని రాష్ట్రాలకు సూచిస్తోంది.
భారత ప్రభుత్వం ఒక టెలిఫోన్ సర్వేను నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించి మొబైల్ ఫోన్ నంబర్ 1921 నుంచి ఎన్.ఐ.సి ద్వారా పౌరులను సంప్రదిస్తారు.. ఇది నిజమైన సర్వే.కోవిడ్ -19 లక్షణాల ప్రాబల్యం, వ్యాప్తిపై సరైన అభిప్రాయాన్నిప్రభుత్వం తెలుసుకోవడంలో సహాయపడటానికి పౌరులందరూ ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం అభ్యర్థించింది. ఇలాంటి సర్వేల పేరుతో ఇంకెవరైనా మరే ఇతర నెంబర్ నుంచైనా తప్పుడు కాల్స్ చేస్తే అలాంటివాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వం నిర్వహించే సర్వే గురించి మీడియా ద్వారా తమ రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఈ సర్వే అధికారిక స్వభావం గురించి ప్రజలకు తెలియజేయాలని , ఇతరులెవరైనా ఆకతాయిలు , ఇతర నెంబర్ల నుంచి ఫిషింగ్ కి జరిపే ప్రయత్నాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సర్వే గురించిన సమాచారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ హోమ్ పేజీ , ఇతర శాఖల హోమ్‌పేజీలలో హోస్ట్ చేయనున్నారు.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3870 మంది ప్రజలకు కోవిడ్ -19 వ్యాధి నయమైంది.రికవరీ రేటు 19.36 శాతం,
నిన్నటినుంచి కొత్తగా నమోదైన కేసులు 1383. దీనితో ఇప్పటివరకు భారతదేశంలో నమోదైన కోవిడ్ -19 కేసుల సంఖ్య 19,984 కు చేరింది. గత 24 గంటలలో కొత్తగా 50 మరణాలు నమోదయ్యాయి.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1617238)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam