హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా విధించిన ఆంక్షలనుంచి పట్టణప్రాంతాలలో వయోధికులకు సేవలు అందిచేవారికి, ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి సేవలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మినహాయింపు
Posted On:
21 APR 2020 9:10PM by PIB Hyderabad
కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎంహెచ్ఎ) సవరించిన ఏకీకృత మార్గదర్శకాల ప్రకారం కొన్ని రకాల కార్యకలాపాలకు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf),
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌కు సంబంధించి ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
పైన పేర్కొన్న ఉత్తర్వుల ప్రకారం విడుదలైన మార్గదర్శకాలలో ఇటికే అనుమతించిన కేటగిరీల ప్రత్యేక సేవలు, కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ప్రభుత్వానికి అందాయి. దీనితో వివరణ జారీ చేయడం జరిగింది.-
తమ ఇళ్లలో ఉంటున్న వయోధికులకు సేవలు అందించే అటెండెంట్‌లను సామాజిక రంగం కింద క్లాజు
8(i) లో చేర్చారు.
క్లాజు 11(v) కింద ప్రజాసేవా కార్యకలాపాలలో ప్రీ పెయిడ్ మొబైల్ కనెక్షన్ల సదుపాయం కల్పించారు.
క్లాజు 13(1) కింద నిత్యావసర సరకుల సరఫరా లో పట్టణ ప్రాంతాలలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు బ్రెడ్ ఫ్యాక్టరీలు, పాల ప్రాసెసింగ్ ప్లాంటులు, పిండిమిల్లులు, పప్పుమిల్లులు వంటి వాటిని చేర్చారు.
అయితే , లాక్‌డౌన్ చర్యలలో , కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్లకు సంబంధించి ప్రమాణీకృత ఆపరేటింగ్ విధానాల పై జారీ అయిన నేషనల్ కోవిడ్ -19 ఆదేశాలు తప్పకుండా పాటించేలా చూడాలి.
ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు , జిల్లస్థాయి, క్షేత్రస్థాయి ఏ జెన్సీలకు సమాచారాన్ని చేరవేయాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా చూడాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.
రాష్ట్రాలకు పంపిన అధికారిక కమ్యూనికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(Release ID: 1616951)
Visitor Counter : 231
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada