వ్యవసాయ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ కాలంలో సమయానికి ప్రభుత్వ జోక్యం వల్ల నిత్యావసర సరుకుల నిరంతర సరఫరా

11.37 లక్షలకు పైగా ట్రక్కులు, 2. 3 లక్షల రవాణాదారులు, సంస్థలు ఈ- నామ్ తో అనుసంధానం

Posted On: 21 APR 2020 6:21PM by PIB Hyderabad

కోవిడ్ -19  మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ పాటిస్తున్న ప్రస్తుత సమయంలో సరఫరా శృంఖల తెగిపోకుండా నిరంతరం సాగేలా చూసేందుకు, టోకు మార్కెట్లలో రద్దీని తగ్గించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ  శాఖ అనేక చర్యలు తీసుకుంది.  జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఈ- నామ్ ను పునర్వ్యవస్థీకరించి మరో రెండు మాడ్యూల్ లను చేర్చారు.    మొదటిది గోదాముల ఆధార వర్తక మాడ్యూల్  మరియు రెండవది  రైతు ఉత్పత్తి  సంస్థల (ఎఫ్ పి  ఓ) మాడ్యూల్.     గోదాముల అభివృద్ధి మరియు నియంత్రణ సంస్థలో నమోదైన గోదాములకు   రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికి మొదటి మాడ్యూల్  ఉపకరిస్తుంది.   ఈ గోదాములను మార్కెట్లుగా భావిస్తారు.  రెండవ  మాడ్యూల్ ద్వారా ఆన్ లైన్ లో అమ్మకాలు చేయవచ్చు.   ఇప్పటి వరకు 12 రాష్ట్రాలు (పంజాబ్, ఒడిశా, గుజరాత్ , రాజస్థాన్ , పశ్చిమబెంగాల్ , మహారాష్ట్ర, హర్యానా , ఆంద్రప్రదేశ్ , తమిళనాడుఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్ మరియు ఝార్ఖండ్) వర్తకంలో పాల్గొన్నాయి.  

       రైతులు నేరుగా మార్కెటింగ్  జరిపేందుకు సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవలసిందిగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్ని రాష్టాలకు / కేంద్రపాలిత ప్రాంతాలకు సందేశం పంపింది.   రైతు ఉత్పత్తి  సంస్థలు తమ సమీపంలోని నగరాలు, పట్టణాలకు కూరగాయలు సరఫారా చేస్తున్నాయి.   సరుకుల రవాణాకు సంబందించిన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. ఎఫ్ పి  ఓలకు అవసరమైన పాసులు, అనుమతులను  రాష్ట్రాలు ఇదివరకే జారీచేశాయి. 

       లాక్ డౌన్ సమయంలో ఈ -నామ్  సామాజిక దూరం సాధనంగా మారింది.   దీనివల్ల మనుష్యుల మధ్య ప్రత్యక్ష సంబంధం లేకున్నా ఆన్ లైన్ ద్వారా వర్తకం సాగిపోతూ ఉంది.    జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ-నామ్ ద్వారా  వ్యవసాయ క్షేత్రం నుంచే వర్తకం సాగిస్తున్నాయి.   అదే విధంగా రైతు ఉత్పత్తి సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ఫోటోలను ఆన్ లైన్లో ఉంచి ట్రేడింగ్ సాగిస్తున్నాయి. 

      వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా శృంఖలలో వాటి రవాణా అత్యంత కీలకమైన అంశం.   రైతులు, వర్తకులు రవాణా వాహనాల కోసం ఇబ్బంది పడతుందా మంత్రిత్వ శాఖ 'కిసాన్ రథ్ ' పేరిట రైతులకు స్నేహ వారధిగా ఉండే మొబైల్ యాప్ ను పారంభించింది.  ఈ యాప్ ప్రథమ, ద్వితీయ రవాణా అవసరాలను తీరుస్తుంది.   ప్రథమ దశ అంటే వ్యవసాయ క్షేత్రం నుంచి మండీలకు, ఎఫ్ పీ  ఓ కేంద్రాలకు, గ్రామ సంతలకు, రైల్వే స్టేషన్లకు , గోదాములకు చేరవేయడం.   రెండవ దశ రవాణా అంటే మండీల నుంచి ఇతర రాష్ట్రాలకు, అంటారు - రాష్ట్ర రవాణాఅంతర్ రాష్ట్ర గోదాములతో పాటు వివిధ స్థాయిలలో ఎలాంటి అవరోధాలు లేకుండా రవాణా జరిగేలా చూడటం .  వీటివల్ల నశ్వర వస్తువులకు మంచి ధర రాబట్టేందుకు తోడ్పడుతుంది.    'కిసాన్ రథ్' యాప్ ఈ-నామ్ వాడకందార్లకు, వాడని వారికి కూడా ఉపయోగపడేలా తయారు చేశారు.   దీనివల్ల వర్తకులు తమ ఉత్పత్తులను మండీల నుంచి ఇతర చోట్లకు రవాణా చేయడానికి దగ్గరలో  రవాణాదారులు లభ్యమయ్యేందుకు యాప్ సహాయపడుతుంది.   ఇప్పటి వరకు  11.37 లక్షలకు పైగా ట్రక్కులు,  2. 3 లక్షల రవాణాదారులు, సంస్థలు ఈ- నామ్ తో అనుసంధానమయ్యారు.

     రాష్ట్రాల మధ్య కూరగాయలు , పళ్ళు రేయింబవళ్లు సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  నిత్యావసరాలు తీసుకెళ్లే వాహనాలను అంతర్ రాష్ట్ర సరిహద్దులలో ఆపరాదని కూడా అన్ని రాష్ట్రాలకు  ఆదేశాలు జారీచేశారు.  

మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాలకు ఉల్లి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.  మహారాష్ట్ర మండీ బోర్డుతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ  సంప్రదింపులు జరుపుతోంది.  ప్రస్తుతం నాసిక్ జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు రోజూ సగటున 300 ట్రక్కుల ఉల్లిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నాయి.  క్రమం తప్పకుండా సరుకుల రవాణా జరుగుతున్న రాష్ట్రాలలో ఢిల్లీ , హర్యానా , బీహార్, తమిళనాడు , పంజాబ్ , కోల్కతా , జమ్మూ -కాశ్మీర్ , కర్నాటకఒడిశా , గుజరాత్ , ఉత్తరప్రదేశ్ , అస్సాం , రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉన్నాయి. 

    ఈశాన్య ప్రాంతానికి నిత్యావసర సరుకులు, కూరగాయలు మరియు పళ్ళ సరఫరా ధరల నియంత్రణకు మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

  

     


(Release ID: 1616903) Visitor Counter : 265