సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

“జెహానాబాద్ లో ఆకలితో పిల్లలు కప్పలు తింటున్నారు” అని వదంతులు వ్యాపింపచేస్తున్న ఐదు సందేశాలకు చెందిన అధికారిక వెర్షన్లు పట్టుకున్నట్టు పిఐబి ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ సందేశం

వివరణ : వాట్సప్ గ్రూప్ లకు యుపి పోలీసులు ఎలాంటి నిబంధనలు, నియంత్రణలు నిర్దేశించలేదు

Posted On: 20 APR 2020 8:56PM by PIB Hyderabad

సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశకత్వం మేరకు సామాజిక మాధ్యమాల్లో వదంతులు, నిరాధారమైన వార్తలు వ్యాపింపచేయడాన్ని అరికట్టడానికి పిఐబి ఒక ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ విభాగం సామాజిక మాధ్యమాల్లో అమితవేగంగా వ్యాపిస్తున్న వదంతులను గుర్తించి వాటిలోని నిజానిజాలను వెలికి తీస్తుంది. “పిఐబి ఫ్యాక్ట్ చెక్”  పేరిట ట్విట్టర్ లో ఏర్పాటైన ఈ హ్యాండిల్ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రెండింగ్ సందేశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వాటిలో నిరాధారమైన వార్తలను గుర్తించడంతో పాటు ఆ సందేశాల్లోని అంశాలను సమగ్రంగా సమీక్షిస్తూ ఉంటుంది. పిఐబి_ఇండియా హ్యాండిల్ తో పాటు పిఐబికి చెందిన వివిధ ప్రాంతీయ విభాగాల హ్యాండిళ్లు ఆయా వార్తల వాస్తవ, అధికారిక వెర్షన్లను ట్విట్టర్ వినియోగదారుల కోసం #పిఐబిఫ్యాక్ట్ చెక్ హ్యాష్ టాగ్ తో ప్రచురిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన టెక్ట్స్ సందేశం, ఆడియో, వీడియోల్లో వచ్చిన అంశాల్లో నిజానిజాలను పరిశీలించేందుకు పౌరులెవరైనా వాటిని పిఐబిఫ్యాక్ట్ చెక్ కు పంపవచ్చు. https://factcheck.pib.gov.in/  లింక్  ద్వారా ఆన్ లైన్ లోనే వాటిని పరిశీలనకు పంపవచ్చు. లేదా +918799711259 నంబర్ కు వాట్సప్ చేయవచ్చు. లేదా pibfactcheck[at]gmail[dot]com కు సందేశం పంపవచ్చు. అలాంటి వార్తల్లోని నిజానిజాలన్నీ పిఐబి వెబ్ సైట్   https://pib.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి.

పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ రోజున అలాంటి ఐదు నకిలీ వార్తలకు అధికారిక వెర్షన్లు ట్విట్టర్ లో ప్రచురించింది. ఒక మీడియా పోర్టల్ లో ప్రముఖంగా వచ్చినట్టు తెలియచేస్తూ “బీహార్ లోని జెహానాబాద్ లో ఇళ్ల వద్ద ఆహారం లేక కప్పలను తింటున్న బాలలు” అనే శీర్షికతో సామాజిక మాధ్యమాల ద్వారా విశేషంగా ప్రచారంలోకి వచ్చిన ఒక నిరాధారమైన వార్తను గుర్తించింది. అందులో వారు చెప్పింది పూర్తిగా అబద్ధం అని పరిశీలనలో తేలింది. బాలలకు ఇళ్లలో తగినంత ఆహారం ఉంది అని జెహానాబాద్ డిఎం ప్రకటించారు.

అలాగే పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రజలపై సోడియం హైపోక్లోరైడ్ కీటకనాశిని ద్రావణాన్ని స్ప్రే చేయవచ్చునని సూచిస్తూ ప్రచారంలోకి వచ్చిన మరో నకిలీ వార్తను కూడా తనంత తానుగా గుర్తించి వాస్తవాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. ప్రజలు తరచుగా తాకే వస్తువులను మాత్రమే క్రిమి రహితం అయ్యేలా శుద్ధి చేసేందుకు ఈ కీటక ద్రావణాన్ని స్ర్పే చేయవలసి ఉంటుందని, అది మానవులపై స్ప్రే చేయడం ఆరోగ్యానికి హానికరమని తెలియచేసే ట్వీట్ ను హిందీలో ప్రచురించింది. పిఐబి ముంబై విభాగం కూడా ఇదే వివరణతో కూడిన ట్వీట్ ను ఇంగ్లీషులో ప్రచురించింది.

యుపి పోలీసులు, యుపి డయల్ 112, వాట్సప్ గ్రూప్ లను నిర్వహించేందుకు నిబంధనలు, నియంత్రణలు నిర్దేశించినట్టు ప్రచారంలోకి వచ్చిన మరో వదంతికి పిఐబి లక్నో విభాగం గుర్తించింది. అలాంటి అడ్వైజరీ ఏదీ వారు ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. అంబేద్కర్ నగర్ కు చెందిన యువకుడు రిజ్వాన్ పోలీసులు కొట్టిన దెబ్బలతో ఏర్పడిన గాయాల వల్ల మరణించాడంటూ మీడియాలో వచ్చిన మరో నకిలీ వార్తను కూడా పిఐబి లక్నో గుర్తించింది. ఆ యువకుడు పెరీకార్డియల్ ఎఫ్యూజన్ (గుండెకు, గుండె చుట్టుపక్కల ప్రదేశానికి మధ్యన ఏర్పడిన అదనపు ద్రవపదార్ధం) వల్లనే మరణించినట్టు పోస్ట్ మార్టం నివేదిక సూచిస్తున్నదంటూ 4 పేజీల పోస్ట్ మార్టం నివేదికను కూడా దానితో జత చేసి ఆ విభాగం వివరణ ఇచ్చింది.

*** 
 



(Release ID: 1616650) Visitor Counter : 211