సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇంత వరకు గత 20 రోజుల్లో కోవిడ్-19 కి సంబంధించి పోర్టల్ ద్వారా స్వీకరించిన 25,000 కు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

Posted On: 20 APR 2020 8:05PM by PIB Hyderabad

ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇంత వరకు  గత 20 రోజుల్లో కోవిడ్-19 కి సంబంధించి పోర్టల్ ద్వారా స్వీకరించిన 25,000 కు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి (డి.ఓ.ఎం.ఈ.ఆర్.); ఎమ్.ఓ.ఎస్. పి.ఎమ్.ఓ., సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు,  అణుశక్తి, అంతరిక్ష శాఖల కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు వెల్లడించారు.  

కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో సిబ్బంది మంత్రిత్వశాఖ కింద డి.ఏ.ఆర్.పి.జి. (పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం) ఈ ఏడాది 1వ తేదీన నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డును  ప్రారంభించింది. ప్రస్తుత స్థితి గమనించినట్లయితే,  ఫిర్యాదుల పోర్టల్ కు గత మూడు వారాలలో దేశవ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఫలితంగా ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రజల నుండి కోవిడ్ సంబంధమైన ఫిర్యాదులు 332 నమోదు కాగా, 15 రోజుల తర్వాత, ఏప్రిల్ 16వ తేదీన ఆ సంఖ్య 5,566 కు పెరిగింది. 

 

నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డు నిర్వాహకులు 24 గంటలూ పనిచేస్తూ, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తూ, సరాసరి పరిష్కార సమయాన్ని 1.57 రోజులకు పరిమితం చేసినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని అభినందించారు. 

నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డు (https://darpg.gov.in)  లోని ఫిర్యాదుల విభాగంలో, కోవిడ్ సంబంధమైన ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేకమైన విండో ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ఫలితంగా,  కోవిడ్ సంబంధమైన ఫిర్యాదులను నేరుగా నమోదు చేసి, తదనుగుణంగా వాటిని అనుసరించి, సంబంధిత వ్యక్తులు వాటిని వేగంగా పరిష్కరించడానికి అవకాశం కలిగింది.  

ఇలా ఉండగా, కోవిడ్ కు సంబంధించిన 14,982 ఫిర్యాదులను పరిష్కారం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయగా, మిగిలిన ఫిర్యాదులను వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలకు బదిలీ చేయడం జరిగింది.  వలస కార్మికులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలూ, క్వారంటైన్, ఆహారం, పౌర సరఫరాలకు సంబంధించిన సమస్యలతో పాటు, బ్యాంకింగ్, ఆర్ధిక రంగ సమస్యలు, వేతనాలు, ఉద్యోగుల సమస్యలు, పాఠశాల, ఉన్నత విద్యా సంబంధమైన సమస్యలు మొదలైన వాటిపై విడివిడిగా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోంది. 

<><><><><> 



(Release ID: 1616561) Visitor Counter : 195