పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర వైద్య సామగ్రి రవాణా చేయడానికి 3 లక్షలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించిన లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు.

Posted On: 20 APR 2020 3:16PM by PIB Hyderabad

లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 3 లక్షలకు పైగా వాయు మార్గంలో ప్రయాణించి సుమారు 507.85 టన్నుల అత్యవసర వైద్య సామాగ్రి ని రవాణా చేశాయి.  ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐ.ఏ.ఎఫ్. తో పాటు ప్రయివేటు సంస్థలు లైఫ్ లైన్ ఉడాన్ కింద 301 విమానాలు నడిపాయి.  వీటిలో ఎయిర్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్ సంస్థలకు చెందినవి 184 విమానాలు ఉన్నాయికోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం జరుపుతున్న పోరుకు మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సామగ్రి తరలించడానికి ఎమ్.ఓ.సి.ఏ. ఈ "లైఫ్ లైన్ ఉడాన్విమానాలను నడిపింది 

జమ్మూ & కశ్మీర్, లడఖ్, దీవులు, ఈశాన్య ప్రాంతాలకు క్లిష్టమైన వైద్య సామాగ్రి తో పాటు రోగులను కూడా రవాణా చేయడానికి పవన్ హన్స్ లిమిటెడ్ తో సహా హెలికాప్టర్ సేవలను కూడా వినియోగించారు.  2020 ఏప్రిల్ 19వ తేదీ వరకు పవన్ హన్స్ సంస్థ 6,537 కిలోమీటర్లు ప్రయాణించి 1.90 టన్నుల సరుకు రవాణా చేసింది. కోవిడ్-19 కు సంబంధించిన కారకాలుఎంజైములు, వైద్య పరికరాలు, టెస్టింగ్ కిట్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.), మాస్కులు , గ్లోవ్ లు, హెచ్.ఎల్.ఎల్. మరియు ఐ.సి.ఎం.ఆర్. కు చెందిన ఇతర సామాగ్రి, రాష్ట్ర . కేంద్ర పాలిట ప్రాంత ప్రభుత్వాలు కోరుకున్న వస్తువులు, తపాలా ప్యాకెట్లు మొదలైనవి దేశీయ లైఫ్ లైన్ ఉడాన్ కార్గో కిందకి వస్తాయి

ఈశాన్య ప్రాంతాలు, దీవులు, పర్వత ప్రాంతాలకు ప్రత్యేక దృష్టి పెట్టారు.  జమ్మూ&కశ్మీర్, లడఖ్, ఈశాన్య ప్రాంతాలు మరియు ఇతర ద్వీప ప్రాంతాల అవసరాల కోసం ప్రధానంగా ఎయిర్ ఇండియా మరియు ఐ.ఏ.ఎఫ్. కలిసి పనిచేస్తున్నాయి. తక్కువ బరువుతో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించే మాస్కులు, గ్లోవ్ లు మరియు ఇతర వినియోగ వస్తువులు ఎక్కువగా ఉండడంతో వీటిని ప్రత్యేక అనుమతితో ప్రయాణీకులు కూర్చునే ప్రదేశంలోనూ,  తగిన జాగ్రత్తలతో సీట్ల పైన ఉండే క్యాబిన్ల లోనూ అమర్చారు. 

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి.) మరియు ఎమ్.ఓ.సి.ఏ. వివిధ భాగస్వాముల మధ్య లైఫ్ లైన్ ఉడాన్ విమానాల సమన్వయము కోసం ఒక పోర్టల్ ను అభివృద్ధి చేసింది. 

లైఫ్ లైన్ ఉడాన్ విమానాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రజలు ఈ పోర్టల్ నుండి పొందవచ్చు. 

           https://esahaj.gov.in/lifeline_udan/public_info.

దేశీయ కార్గో ఆపరేటర్లైన స్పైస్ జెట్, బ్లూ డార్ట్ మరియు ఇండిగో సంస్థలు వాణిజ్య పరంగా సరకు రవాణా చేశాయి2020 మార్చి 24వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు 427 స్పైస్ జెట్ కార్గో విమానాలు 6,29,325 కిలోమీటర్లు ప్రయాణించి, 3,414 టన్నుల సామాగ్రి రవాణా చేశాయి.  ఇందులో 135 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి2020 మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు 141 బ్లూ డార్ట్ దేశీయ కార్గో విమానాలు 1,39,179 కిలోమీటర్లు ప్రయాణించి, 2,241 టన్నుల సామాగ్రి రవాణా చేశాయి. 2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఇండిగో సంస్థకు చెందిన 33 కార్గో విమానాలు 37,160 కిలోమీటర్లు ప్రయాణించి, 66 టన్నుల సామాగ్రి రవాణా చేశాయి.   ఇందులో ప్రభుత్వానికి ఉచితంగా రవాణా చేసిన వైద్య సామాగ్రి కూడా ఉంది

ఔషధాలు, వైద్య పరికరాలుకోవిడ్-19 సహాయ సామాగ్రి రవాణా చేయడానికి తూర్పు ఆసియా తో ఒక కార్గో ఎయిర్-బ్రిడ్జి     ని ఏర్పాటుచేసుకోవడం జరిగింది

రోజువారీ రవాణా చేసిన వైద్య సామాగ్రి పరిమాణం వివరాలు ఇలా ఉన్నాయి : 

 

 క్రమ సంఖ్య 

 తేదీ 

నుండి 

  పరిమాణం   (టన్నుల్లో)

 

1

04.4.2020

షాంగై 

21

2

07.4.2020

హాంగ్ కాంగ్ 

06

3

09.4.2020

 షాంఘై 

22

4

10.4.2020

షాంఘై 

18

5

11.4.2020

షాంఘై 

18

6

12.4.2020

షాంఘై 

 

24

7

14.4.2020

హాంగ్ కాంగ్

11

8

14.4.2020

షాంఘై 

22

9

16.4.2020

షాంఘై 

22

10

16.4.2020

హాంగ్ కాంగ్

17

11

16.4.2020

సియోల్ 

05

12

17.4.2020

షాంఘై 

21

13

18.4.2020

షాంఘై 

17

14

18.4.2020

సియోల్

14

15

18.4.2020

గుయాంగ్జ్

04

16

19.4.2020

షాంఘై 

 

19

   

మొత్తం 

261

  

ఇతర దేశాలకు, వారి అవసరాల మేరకు, క్లిష్టమైన వైద్య సామాగ్రి రవాణా చేయడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా కార్గో విమానాలు కేటాయిస్తుంది.  

****


(Release ID: 1616441) Visitor Counter : 264