వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పొలాల నుండి పోరాటం : కరోనాపై పోరులో నిజమైన యోధులు

లాక్ డౌన్ ఉన్నా పంట కోత, వేసవి విత్తులో అంతరాయం అంతంత మాత్రమే



రబీ పంటలలో, దేశవ్యాప్తంగా 310 లక్షల హెక్టార్లలో 67% వరకు గోధుమ పంట



ఏప్రిల్ 17 నాటికి వేసవి పంట విత్తు గత ఏడాది కన్నా 14% అధికం



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సకాలంలో జోక్యం చేసుకోవడం; నిశ్శబ్దంగా రైతుల వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడం; చెమటోడ్చి, శ్రమించే వ్యవసాయ కార్మికులు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంతో అనుకూల ఫలితాలు

Posted On: 19 APR 2020 3:28PM by PIB Hyderabad

నేటి అనిశ్చితి పరిస్థితుల మధ్య వ్యవసాయ కార్యకలాపాలే దేశానికి ఆశాజ్యోతిగా మారాయి. ఇది ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. భారతదేశం అంతటా అనేక మంది రైతులువ్యవసాయ కార్మికులు అన్ని కష్టాలకు ఓర్చి చెమటోడ్చిశ్రమిస్తున్నారు. నిశ్శబ్దంగా వారు చేస్తున్న ప్రయత్నాలుకేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమయానుకూల జోక్యంతోపంటకోత కార్యకలాపాలకు పెద్దగా అంతరాయం లేకుండానే వేసవి పంటలను వేశారు. కోవిడ్-19 ని నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేయగావ్యవసాయ కార్యకలాపాల సజావుగా పనిచేయడానికి కూడా ఇది దోహదపడింది. సకాలంలో జోక్యం చేసుకోవడంమినహాయింపులు ఇవ్వడంతో వ్యవసాయంలో ఆశాజనకమైన ఫలితాలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలను చేపట్టేటప్పుడు వారి భద్రతసామాజిక దూరాన్ని పాటించడం వంటి చర్యలపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) రైతులకు వివరించారు. తీసుకున్న చురుకైన చర్యల ఫలితంగారబీ కాలం పంట కోత పనులువేసవి పంటల విత్తు నాటే పనులు ...  రెండూ ఒక క్రమపద్ధతిలో జరుగుతున్నాయి.

రబీలో కోతకు వచ్చిన పంట చూస్తే, 310 లక్షల హెక్టార్లలో నాటిన గోధుమలలో ఇప్పటికే  63-67% పంట చేతికి వచ్చింది. అనేక రాష్ట్రాలలో కూడా పంట నూర్పిళ్ళు ఈ సారి బాగానే పెరిగాయి. మధ్యప్రదేశ్‌లో 90-95%, రాజస్థాన్‌లో 80-85%, ఉత్తర ప్రదేశ్‌లో 60-65%, హర్యానాలో 30-35%, పంజాబ్‌లో 10-15% వరకు చేరుకుంది. హర్యానాపంజాబ్యుపిలో పంట కోత గరిష్ట స్థాయిలో ఉందిఈ పని ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.  

161 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలను నాటితే వాటిలో కాయధాన్యాలుమినపపెసరబఠానీల కోత పూర్తయింది. చెరకు కోసం, 54.29 లక్షల హెక్టార్లలో విత్తిన వాటిలోమహారాష్ట్రకర్ణాటకగుజరాత్ఆంధ్రప్రదేశ్తెలంగాణపంజాబ్ లో కోత పూర్తయింది. తమిళనాడుబీహార్హర్యానాఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 92-98% కోత పూర్తయింది. ఉత్తర ప్రదేశ్‌లో 75-80% పూర్తయింది. ఈ కోత పనులు మేనెల మధ్య వరకు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్అస్సాంఛత్తీస్‌ఘడ్గుజరాత్కర్ణాటకకేరళఒడిశాతమిళనాడుతెలంగాణత్రిపురపశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 28 లక్షల హెక్టార్లలో నాటిన రబీ బియ్యం పంట కోత ప్రారంభ దశలో ఉంది. దశ మరియు కోత సమయం ఆయా ప్రాంతాల పరిస్థితులబట్టి  మారుతూ ఉంటుంది.
 

నూనెగింజల పంటలవిషయానికి వస్తే, 69 లక్షల హెక్టార్లలో ఆవాలు నాటగా రాజస్థాన్యుపిఎంపిహర్యానాపశ్చిమ బెంగాల్జార్ఖండ్గుజరాత్ఛత్తీస్ఘడ్ , బీహార్పంజాబ్అస్సాంఅరుణాచల్ ప్రదేశ్జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పంట చేతికి వచ్చింది. 4.7 లక్షల హెక్టార్లలో నాటిన వేరుశనగలో  85-90% వరకు పంట ఇప్పటి వరకు చేతికి వచ్చింది. 
 

వేసవి పంటలను పండించడం భారతదేశంలో పాత కాలపు సంప్రదాయం. ముఖ్యంగా ఆహార ధాన్యాల అదనపు దేశీయ అవసరాలను తీర్చడంపశువులకు ఆహారం ఇవ్వడం దీనిలో ప్రధానమైంది. అయితే పప్పుధాన్యాలుముతక తృణధాన్యాలుపోషక-తృణధాన్యాలునూనెగింజలు వంటి వేసవి పంటలను శాస్త్రీయంగా సాగు చేయడానికి వ్యవసాయరైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త కార్యక్రమాలు చేపట్టింది. ఇది కాకుండారైతులు నీటి లభ్యత ఆధారంగా తూర్పు భారతదేశంమధ్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేసవి వరి పంటలను సాగు చేస్తారు.
 

ఈ ఏప్రిల్ 17 నాటికిదేశంలో వేసవి విత్తులు గత సంవత్సరంతో పోలిస్తే 14% అధికం. వేసవి పంటలను విత్తడానికి అనుకూలంగా ఉన్న గత కాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో వర్షపాతం కూడా 14% ఎక్కువ. నేటి తేదీకి మొత్తం వేసవి పంట విస్తీర్ణం 38.64 లక్షల హెక్టార్ల నుండి 52.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. పప్పుధాన్యాలుముతక తృణధాన్యాలుపోషక-తృణధాన్యాలునూనెగింజల విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 14.79 లక్షల హెక్టార్ల నుండి 20.05 లక్షల హెక్టార్లకు పెరిగింది.

image.png
సీడ్ డ్రిల్తో విత్తడానికి వేసవి మూంగ్ విత్తనాన్ని చికిత్స చేస్తుంది

పశ్చిమ బెంగాల్తెలంగాణఒడిశాఅస్సాంగుజరాత్కర్ణాటకఛత్తీస్గఢ్తమిళనాడుబీహార్మహారాష్ట్రమధ్యప్రదేశ్కేరళ రాష్ట్రాల్లో సుమారు 33 లక్షల హెక్టార్లలో వేసవి బియ్యం నాటారు. తమిళనాడుఉత్తర ప్రదేశ్పశ్చిమ బెంగాల్గుజరాత్ఛత్తీస్గఢ్బీహార్పంజాబ్కర్ణాటకమహారాష్ట్రమధ్యప్రదేశ్జార్ఖండ్తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు నాటారు. 

 

image.png

 

విత్తన డ్రిల్ నాటిన వేసవి ముంగ్ పంట

 

పశ్చిమ బెంగాల్కర్ణాటకగుజరాత్ఉత్తర ప్రదేశ్మహారాష్ట్రతమిళనాడుతెలంగాణఛత్తీస్గఢ్మధ్యప్రదేశ్పంజాబ్బీహార్ రాష్ట్రాల్లో సుమారు 7.4 లక్షల హెక్టార్లలో నూనె గింజలను నాటారు. పశ్చిమ బెంగాల్‌లో జనపనార విత్తు కూడా ప్రారంభమైంది. ఇక్కడి వర్షపాతం నుండి కూడా ఈ పంట ప్రయోజనం పొందింది. వేసవి పంట అదనపు ఆదాయాన్ని అందించడమే కాకరబీఖరీఫ్ కాలాల మధ్య రైతులకు చాలా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. వేసవి పంటనుముఖ్యంగా పప్పుధాన్యాల పంటను పండించడం ద్వారా భూసారం కూడా మెరుగుపడుతుంది. యాంత్రికంగా విత్తనాలు నాటడం కూడా వేసవి పంటలకు ఎంతో మేలు చేశాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శనంపంటకోత కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేయడంరైతుల కృషి వల్ల వేసవి పంటలకు ఎక్కువ విస్తీర్ణం లభిస్తుంది.

                                    **** 



(Release ID: 1616119) Visitor Counter : 233