హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వివిధ ప్రాంతాలలో చిక్కుబడిపోయిన వలస కూలీలను ప్రస్తుతం వారు ఉంటున్న రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో తిరగడానికి సంబంధించి న సవివర ప్రక్రియను తెలిపే స్పెషల్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు (ఎస్.ఒ.పిలు)
Posted On:
19 APR 2020 3:37PM by PIB Hyderabad
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి కారణంగా, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ ఇతర రంగాలలో పనిచేసే ఎందరో కార్మికులు వారి పని ప్రదేశాలను వదలి వచ్చారు. వీరు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏప్రిల్ 20,2020 కంటైన్ మెంట్ జోన్లకు వెలుపల అదనపు కొత్త కార్యకలాపాలను అనుమతిస్తూ సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసినందున వీరిని పారిశ్రామిక, తయారీ రంగం , నిర్మాణ రంగం, వ్యవసాయం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులలో వీరిని ఉపయోగించుకోవచ్చు.
2020 మార్చి 29, 2020, నాటి హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులకు కొనసాగింపుగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతలలో చిక్కుబడిపొయిన కార్మికుల కదలిక కోసం ఒక ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్(ఎస్.ఒ.పి)ను ,ఆయా మంత్రిత్వ శాఖలు ,విభాగాలు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు జారీ చేశారు.దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వీరి కదలికలకు వీలుగా కింది మార్గదర్శకాలను అనుసరించవచ్చు:
ప్రస్తుతం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో సహాయ ,వసతి శిబిరాల్లో నివసిస్తున్న వలస కూలీలు సంబంధిత స్థానిక అథారిటీ వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వివిధ రకాల పనులు చేయడానికి వారికి గల నైపుణ్యం,అనుకూలతలకు సంబంధించిన వివరాలను సేకరించాలి.
ఒక వేళ వలస కూలీల బృందం తమ పని ప్రదేశాలకు తిరిగి వెళ్లాలని కోరుకుంటే, వారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్ వ్యాప్తి లక్షణం లేని వారిని వారి పని ప్రదేశాలకు తరలిస్తారు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్రం , కేంద్రపాలిత ప్రాంతం వెలుపల వలసకూలీలు తిరగడానికి ఉండదు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి వారు తమ పని ప్రదేశానికి బస్సులో వెళుతుంటే ఆ బస్సులో సురక్షితమైన రీతిలో సామాజిక దూరం పాటించే విధంగా చూడాలి. వీరిని పంపేందుకు వాడే బస్సులను ఆరోగ్య శాఖ సూచించిన రీతిలో క్రిమిరహితంగా శుభ్రం చేయాలి.
కోవిడ్ -19 నిర్వహణకు సంబంధించి 2020 ఏప్రిల్ 15న జారీచేసిన సవరించిన ఉమ్మడి మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. వలస కూలీలు తమ పని ప్రదేశానికి వెళ్లే క్రమంలో వారికి ఆహారం, మంచినీటిని స్థానిక యంత్రాంగం సమకూర్చాలి.
(Release ID: 1616085)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam