రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19తో అలుపెరుగని పోరాటంలో భాగంగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో 1150 టన్నుల వైద్య పరికరాలను రవాణా చేసిన రైల్వే శాఖ
లాక్ డౌన్ సందర్భంగా అత్యవసరమైన వైద్య సామగ్రిని భారతీయ రైల్వే సజావుగా రవాణా చేస్తోంది.
జోనల్ రైల్వేలు సమయానుకూలంగా నడుపుతున్న పార్సిల్ రైళ్ళ ద్వారా లాక్ డౌన్ సమయంలో అవసరమైన మందులు, ఇతర వైద్య సామగ్రి రవాణాలకు ప్రోత్సాహం
Posted On:
19 APR 2020 3:27PM by PIB Hyderabad
కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య సామగ్రి రవాణా విషయంలో భారతీయ రైల్వే అవిశ్రాంతగా పని చేస్తోంది. వైరస్ ప్రతికూల ప్రభావానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చేస్తున్న యుద్ధానికి ఔషదాలు, మాస్క్ లు, ఇతర ఆసుపత్రి సామగ్రిని సమయానుకూలంగా పంపిణీ చేస్తూ మద్ధతును అందిస్తోంది.
18 ఏప్రిల్ 2020 నాటికి భారతీయ రైల్వే 1150 టన్నుల వైద్య సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా చేసింది. వైద్య వస్తువుల రవాణాకు సంబంధించి జోన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
క్ర.సం.
|
జోన్
|
బరువు (టన్నుల్లో)
|
1
|
దక్షిణ రైల్వే
|
83.13
|
2
|
సౌత్ ఈస్ట్ రైల్వే
|
15.10
|
3
|
తూర్పు మధ్య రైల్వే
|
1.28
|
4
|
ఈశాన్య రైల్వే
|
2.88
|
5
|
ఈస్ట్ కోస్ట్ రైల్వే
|
1.06
|
6
|
దక్షిణ మధ్య రైల్వే
|
47.22
|
7
|
సెంట్రల్ రైల్వే
|
135.64
|
8
|
ఉత్తర మధ్య రైల్వే
|
74.32
|
9
|
పడమర సెంట్రల్ రైల్వే
|
27.17
|
10
|
సౌత్ ఈస్టర్న్ రైల్వే
|
2.82
|
11
|
సౌత్ వెస్టర్న్ రైల్వే
|
12.10
|
12
|
తూర్పు రైల్వే
|
8.52
|
13
|
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే
|
2.16
|
14
|
నార్త్ వెస్ట్రన్ రైల్వే
|
8.22
|
15
|
వెస్ట్రన్ రైల్వే
|
328.84
|
16
|
నార్తర్న్ రైల్వే
|
399.71
|
మొత్తం
|
1150.17 టన్నులు
|
ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ భారతీయ రైల్వే ప్రజల అత్యవసరాలను తీరుస్తోంది. ఈ మధ్య ఆటిస్టిక్ పిల్లల కోసం, తల్లిదండ్రులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా సహాయం కోసం ఆశ్రయించగా, అజ్మీర్ నుంచి ముంబైకి పార్సిల్ రైలు ద్వారా స్కిమ్డ్ ఒంటె పాలను రవాణా చేశారు. అదే విధంగా అజ్మీర్ మరో పిల్లవాడు తీవ్రమైన ఆటిస్టిక్ అనారోగ్యంతో బాధపడుతూ, మందులు లేని నేపథ్యంలో రైల్వే అధికారులను సంప్రదించి, మందుల పార్శిల్ ను రైలు ద్వారా అహ్మదాబాద్ నుంచి అజ్మీర్ కు రవాణా చేశారు.
(Release ID: 1616077)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada