హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాటానికి కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ప‌నితీరును స‌మీక్షించిన శ్రీ అమిత్‌షా

Posted On: 18 APR 2020 8:21PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో, కోవిడ్ -19 మ‌హ‌మ్మారి పై పోరాటానికి కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూం కార్య‌క‌లాపాల‌పై ఈరోజు న్యూఢిల్లీలో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశానికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్య‌క్ష‌త వ‌హించారు.

 

COVID19 Control Room Review 18.04..2020.jpeg
వివిధ రాష్ట్రాల‌లో కోవిడ్ -19 ప‌రిస్థితిపై కంట్రోల్ రూం లోని అధికారుల‌తో హోంమంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారి అభిప్రాయాల‌ను తెలుసుకుని వారు చేస్తున్న అద్భుత కృషిని ప్ర‌శంసించారు. కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ కంట్రోలు రూమ్ 24 గంట‌లూ ప‌నిచేస్తోంది. ఇది రాష్ట్రాల‌తో మాత్ర‌మే కాకుండా , కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తున్న వివిధ కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వశాఖ‌ల‌తో నూ స‌మ‌న్వ‌యం చేస్తోంది.

 (Release ID: 1615919) Visitor Counter : 102