గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నాన్ కంటైన్‌మెంట్ ప్రాంతాల‌లో 2020 ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన కేంద్ర పంచాయ‌తిరాజ్‌, వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌

పిఎంఎవై(జి), పిఎంజిఎస్‌వై,ఎన్ఆర్ ఎల్ ఎం, ఎంజిఎన్ ఆర్ ఇ జిఎస్ ప‌థ‌కాల కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేసే క్ర‌మంలో అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ చేప‌ట్టాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పిన మంత్రి శ్రీ న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌
ఎన్‌.ఆర్.ఎల్‌.ఎం కింద ముఖానికి ఉప‌యోగించే మాస్క్ లు, శానిటైజ‌ర్లు, స‌బ్బులు, పెద్ద సంఖ్య‌లో క‌మ్యూనిటీ వంట‌శాల‌ల నిర్వ‌హ‌ణ చేప‌డుతున్న స్వ‌యం స‌హాయక‌బృందాల మ‌హిళ‌ల‌ను అభినందించిన మంత్రి

Posted On: 18 APR 2020 7:45PM by PIB Hyderabad

 

గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ , వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు గ్రామీణాభివృద్ధి మంత్రులు , రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల సంబంధిత అధికారులతో రెండు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 20 ఏప్రిల్ 2020 నుండి, నాన్ కంటైన్‌మెంట్ ప్రాంతాల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తుండ‌డం,  మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్‌ (PMAY-G), ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) , జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) ప‌థ‌కాల‌ను నాన్-కంటైన్మెంట్ ప్రాంతాలలో చేప‌ట్ట‌నుండ‌డంతో ఈ సమావేశం నిర్వ‌హించారు.

 కోవిడ్‌-19 వైర‌స్ విధించిన స‌వాలు చాలా తీవ్ర‌మైన‌ది అయిన‌ప్ప‌టికీ, ఈ స‌వాలును అన్ని రాష్ట్రాలూ, కేంద్ర‌పాలిత ప్రాంతాలూ  ఒక అవ‌కాశంగా తీసుకుని , గ్రామీణ మౌలిక‌స‌దుపాయాలను బ‌లోపేతం చేయాల‌ని , గ్రామీణ ప్రాంతాల‌లో ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించాల‌ని, గ్రామీణ జీవ‌నోపాధి వైవిద్యీక‌ర‌ణ‌ను సుల‌భ‌త‌రం చేయాల‌ని శ్రీ న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ సూచించారు.

ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్ కింద జల‌ శక్తి మంత్రిత్వ శాఖ, భూ వనరుల శాఖ పథకాలకు అనుగుణంగా నీటి సంరక్షణ, నీటి రీఛార్జ్, నీటిపారుదల పనులపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు..

ఎన్‌.ఆర్‌.ఎల్‌.ఎం పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలు రక్షిత మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు తయారు చేస్తున్నాయని, కమ్యూనిటీ కిచెన్‌లను పెద్ద సంఖ్యలో నడుపుతున్నాయని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ ఇ-మార్కెట్ (జిఎం) పోర్టల్‌లో గరిష్ట సంఖ్యలో స్వయం సహాయక సంఘాలు  వాటి ఉత్పత్తులను ఆన్‌బోర్డ్‌లో ఉంచాలని, ఎస్‌హెచ్‌జి సంస్థలను విస్తరించి బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

పిఎంఎవై (జి)కింద, లబ్ధిదారులకు 3 వ 4 వ విడతలలో ఇచ్చిన 48 లక్షల హౌసింగ్ యూనిట్లను పూర్తి చేయడానికి ప్రాధాన్యత  ఇవ్వాల్సి  ఉంటుంది. పిఎమ్‌జిఎస్‌వై కింద, మంజూరు చేసిన రహదారి ప్రాజెక్టులలో త్వరగా టెండర్లు మంజూరు చేయ‌డం, పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులను ప్రారంభించడం పై ప్ర‌ధాన దృష్టి పెట్టాల్సి ఉంద‌న్నారు.
 
పిఎమ్‌ఎవై (జి), పిఎమ్‌జిఎస్‌వై, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ల కింద పనులు చేసేటప్పుడు అన్ని భద్రతా జాగ్రత్తలు పాటించాలని త‌మ‌ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సూచ‌న‌లు  జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.   కార్మికుల భద్రత , శ్రేయస్సుకు సంబంధించి  అన్ని పని ప్రదేశాలలో అవసరమైన  జాగ్రత్తలూ తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు తగిన ఆర్థిక వనరులు వారికి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్టు ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల సూచనలతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు పూర్తిగా ఏకీభ‌వించాయి. బీహార్, కర్ణాటక, హర్యానా, ఒడిశా, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద పెండింగ్‌లో ఉన్న 100 శాతం వేతన, వస్తు బకాయిలను విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్, ఉత్తర ప్రదేశ్  హర్యానా పిఎంఎవై (జి) కింద అదనపు టార్గెట్‌ల‌ను  కోరింది. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద వ్యవసాయ, వ్యవసాయేతర సంస్థలను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఒడిశా నొక్కి చెప్పింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, గ్రామీణాభివృద్ధి పథకాలు సమర్థవంతంగా  అమలు చేయడానికి గ్రామీణాభివృద్ధి క్షేత్ర సిబ్బంది, పంచాయతీ రాజ్ సంస్థల కార్యకర్తలు , ఇతర సమాజ స్థాయి కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు తెలిపాయి.

***


(Release ID: 1615883) Visitor Counter : 198