వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో భారతీయ కంపెనీల అవకాశవాద స్వాధీనం / సముపార్జనలను అరికట్టేందుకు ప్రస్తుతం ఎఫ్.డి.ఐ. విధానాన్ని సవరించిన భారత ప్రభుత్వం

Posted On: 18 APR 2020 3:58PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భారతీయ కంపెనీల అవకాశవాద స్వాధీనం / సముపార్జనలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ) విధానాన్ని భారత ప్రభుత్వం సమీక్షించింది. కన్సాలిడేటెడ్ ఎఫ్.డి.ఐ. పాలసీ -2017లోని 3.1.1. పేరాను సవరించింది. పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించే విభాగం, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రెస్ నోట్ నంబర్ 3 (2020 సిరీస్)ను విడుదల చేసింది. ఈ విషయాల్లో ప్రస్తుతం అంశాలు, సవరించిన అంశాలు కింది విధంగా ఉంటాయి.

ప్రస్తుత అంశాలు...

పేరా. 3.1.1. నిషేధానికి గురైన రంగాలు / కార్యకలాపాలు మినహా ఎఫ్.డి.ఐ. విధానానికి లోబడి ఒక ప్రవాస సంస్థ భారతదేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏదేమైనా బంగ్లాదేశ్ పౌరుడు లేదా బంగ్లాదేశ్ లో విలీనం చేయబడిన ఓ సంస్థ ప్రభుత్వ మార్గంలో మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఇంకా, పాకిస్తాన్ పౌరుడు లేదా పాకిస్థాన్ లో విలీనం చేయబడిన ఓ సంస్థ ప్రభుత్వ మార్గంలోనే రక్షణ, అంతరిక్షం, అణుశక్తి మరియు విదేశీ పెట్టుబడులకు నిషేధించబడిన రంగాలు / కార్యకలాపాలు మినహా ఇతర రంగాలలో / కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

 

సవరించిన స్థానం

పేరా 3.1.1:

3.1.1 (ఎ) నిషేధించబడిన ఆయా రంగాలు / కార్యకలాపాలు మినహా ఎఫ్‌డిఐ విధానానికి లోబడి ఒక ప్రవాస సంస్థ భారతదేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏదేమైనా భారతదేశ భూ సరిహద్దును పంచుకుంటున్న ఏదైనా దేశంలోని ఒక సంస్థ, ప్రయోజనకరమైన యజమాని ఉన్న చోట లేదా అలాంటి దేశ పౌరుడు ఉన్నట్లయితే, ప్రభుత్వ మార్గంలోనే పెట్టుబడి పెట్టవచ్చు. ఇంకా, పాకిస్థాన్ పౌరుడు లేదా పాకిస్థాన్ లో విలీనం చేయబడిన ఓ సంస్థ ప్రభుత్వ మార్గంలోనే రక్షణ, అంతరిక్షం, అణుశక్తి మరియు విదేశీ పెట్టుబడులకు నిషేధించబడిన రంగాలు / కార్యకలాపాలు మినహా ఇతర రంగాలలో / కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

3.1.1 (బి) భారతదేశంలో ఒక సంస్థలో ఇప్పటికే ఉన్న లేదా భవిష్యత్తులో ఎఫ్‌డిఐల యాజమాన్యాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బదిలీ చేసిన సందర్భంలో, ప్రయోజనకరమైన యాజమాన్యం పారా 3.1.1 (ఎ) యొక్క పరిమితి / పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ప్రయోజనకరమైన యాజమాన్య మార్పులకు ప్రభుత్వ అనుమతి కూడా అవసరం.

పై నిర్ణయం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి అమలులోకి వస్తుంది.



(Release ID: 1615753) Visitor Counter : 307