హోం మంత్రిత్వ శాఖ
మే 3వ తేదీ వరకు విదేశీయులకు మంజూరు చేసిన అన్ని రకలా వీసాల సస్పెన్షన్
- దౌత్య, అధికారిక, యుఎన్/ అంతర్జాతీయ సంస్థలు, ఉపాధి మరియు ప్రాజెక్టు క్యాటగిరీలకు మాత్రం మినహాయింపు
- ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా భారతదేశంలోకి వచ్చే అన్ని ప్రయాణిక రద్దీలను మే 3 వరకు నిలిపివేత
Posted On:
17 APR 2020 9:03PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో దౌత్య, అధికారిక, ఐక్యరాజ్య సమితి/ అంతర్జాతీయ సంస్థలు, ఉపాధి మరియు ప్రాజెక్టు క్యాటగిరీలకు చెందిన వారికి జారీ చేసిన వీసాల మినహా.. విదేశీయులకు మంజూరు చేసిన అన్ని ఇతర వీసాల సస్పెన్షన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించాలని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నిర్ణయించింది. దీనికి తోడు భారతదేశంలోకి వచ్చేందుకు వీలున్న 107 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల నుంచి ప్రయాణాల రద్దీని 2020 మే 3 వరకు నిలిపివేయాలని కూడా ఎంహెచ్ఏ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అత్యవసర లేదా అంతగా అత్యవసరం కాని వస్తువులు ఇతర సామగ్రిని తీసుకువెళ్ళే వాహనాలు, విమానాలు, నౌకలు, రవాణా వాహనాలు, రైళ్లు మొదలైన వాటికి వర్తించవు. వీటి సిబ్బంది, నావికుడు, డ్రైవర్, సహాయకుడు, క్లీనర్ మొదలైనవారికి అనుమతి కూడా
కోవిడ్-19 పూర్తి వైద్య పరీక్షల నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని ఎంహెచ్ఏ స్పష్టం చేసింది.
(Release ID: 1615546)
Visitor Counter : 216