ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుని కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌

Posted On: 17 APR 2020 8:56PM by PIB Hyderabad

రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు మాన్య శ్రీ సిరిల్ రామఫోసా తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.

కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్త వ్యాధి విసరుతున్న దేశీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ సవాళ్ల ను గురించి ఇరువురు నేత లు ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి తెలియజేసుకొన్నారు.  తమ దేశ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం, అలాగే ఈ మహమ్మారి తాలూకు ఆర్థిక ప్రభావాల ను తగ్గించడం కోసం తమ తమ ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యల ను గురించి కూడా వారు ఈ సందర్భం లో చ‌ర్చించారు.

సవాళ్లతో కూడుకొన్న ఈ కాలం లో అత్యవసర  ఔషధాలు దక్షిణ ఆఫ్రికా కు అందేటట్టు చూడడం లో భారతదేశం శాయశక్తుల తోడ్పాటు ను అందిస్తుందని ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.
                                                  
ప్రపంచ వ్యాప్త వ్యాధి ని ఖండం అంతటా దీటు గా ఎదుర్కొనే కృషి ని సమన్వయపరచడం లో అధ్యక్షుడు  శ్రీ రామఫోసా ప్రస్తుతం ఆఫ్రికన్ యూనియన్ కు అధ్యక్ష పదవి లో సకారాత్మక భూమిక ను పోషిస్తుండటాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.
  
ఆఫ్రికా కు మరియు భారతదేశాని కి మధ్య శతాబ్దాల నాటి నుండి మైత్రీసంబంధాలతో పాటు ఉభయ దేశాల ప్రజల మధ్య ఆదాన ప్రదానాలు కొనసాగుతూ వస్తున్నాయని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, వైరస్ పై ఆఫ్రికా జరుపుతున్న ఉమ్మడి ప్రయత్నాల కు భారతదేశం వైపు నుండి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.


**


(Release ID: 1615521) Visitor Counter : 204