రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు పి.పి.ఈ.లు మరియు ఇతర ఉత్పత్తుల తయారీ పై వెబ్ నార్

Posted On: 17 APR 2020 7:13PM by PIB Hyderabad

కోవిడ్ -19పై పోరాటం చేసేందుకు అవసరమయ్యే ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా   ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగాలు ఉత్పత్తి, తయారీ సామర్థ్యాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్స్ (ఎస్.ఐ.డి.ఎం) ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఓ) చైర్మన్ మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ (డిడి ఆర్ అండ్ డి) సెక్రలటరీ  శ్రీ జి.సతీష్ రెడ్డి నేతృత్వంలో పలువురు స్టేక్ హోల్డర్స్ తో కలిసి వెబ్ నార్ ను నిర్వహించింది.

ప్లీనరీ సెషన్ లో ప్రసంగించిన శ్రీ సతీష్ రెడ్డి, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనేందుకు వైద్య పరికరాలను తయారు చేయడానికి మందుకు వచ్చిన పరిశ్రమలను ప్రశంసించారు. పిపిఈల కోసం డి.ఆర్.డి.ఓ. రూపకల్పన చేసిన నూతన మోడల్ ను ఆయన వివరించారు. పరిశ్రమలతో ఈ వివరాలు పూర్తిగా పంచుకుంటామని హామీ ఇచ్చారు. పి.పి.ఈ. బట్ట పునర్వినియోగం పై ఆర్ అండి డి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కళ్ళ అద్దాలు, టెస్ట్ కిట్లు, శుభ్రపరిచే మరియు వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియంస్ (వి.టి.ఎం)లను స్వదేశంలో తయారు చేసుకోవడం కోసం ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం 15 నుంచి 20 ఉత్పత్తులను డి.ఆర్.డి.ఓ. అభివృద్ధి చేస్తోందని తెలిపిన ఆయన, కొత్తగా అభివృద్ధి చేసిన యు.వి. శానిటైజేషన్ బాక్స్, హ్యాండ్ హెల్డ్ యు.వి. డివైజ్, కోవ్ సాక్ (కోవిడ్ శాంపిల్ కలెక్షన్ కియోస్క్) ఫుట్ ఆపరేటెడ్ ఫ్యూమిగేషన్ డివైజ్, టచ్ ఫ్రీ శానిటైజర్స్, కోవిడ్ -19 నుంచి నివారణ కోసం ఫేస్ షీల్డ్ వంటి వాటి గురించి వివరించారు.

ఇంటరాక్టివ్ సెషన్ లో మెటీరియల్, సోర్సింగ్, టెస్టింగ్, సీలాంట్స్ మరియు డి.ఆర్.డి.ఓ.కు సంబంధించిన అనేక ప్రశ్నలను పరిశ్రమలు లేవనెత్తాయి. వీటికి డి.ఆర్.డి.ఓ, సౌత్ ఇండియా టెక్స్ టైల్స్ రీసెర్చ్ అసోషియేషన్ (సిట్రా) మరియు ఇతర సంస్థలకు చెందిన ప్యానలిస్టులు సమాధానాలు అందించారు. ఈ పరికరాలకు సంబంధించిన అన్ని సాంకేతిక వివరాలు పరిశ్రమలకు డి.ఆర్.డి.ఓ నుంచి ఉచితంగా ఉత్పత్తికి అందుబాటులో ఉన్నాయి.

వెబ్ నార్ విజయవంతం కావాలని ఆకాంక్షించిన ఆయన, పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో డి.ఆర్.డి.ఓ. మరియు పరిశ్రమల మధ్య సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం అవుతుందని శ్రీ సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

--



(Release ID: 1615468) Visitor Counter : 184