ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల ఐటీ కంపెనీలకు 4 నెలల అద్దె రద్దు
Posted On:
16 APR 2020 6:20PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం పలు రంగాలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సాప్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల ( ఎస్ టి పిఐ ) లో కార్యాలయాలు నెలకొల్పుకొని పని చేస్తున్న ఐటీ కంపెనీలకు సంబంధించి నాలుగు నెలలపాటు అద్దె రద్దు చేశారు. వీటిలో చాలా వరకు టెక్నాలజీకి చెందిన ఎంఎస్ ఎంఈలు, స్టార్టప్ లు వున్నాయి.
ఎస్టీ పిఐ ఆవరణలో ఆఫీసులు నెలకొల్పుకొని పని చేస్తున్న ఐటీ యూనిట్లకు మార్చి 1నుంచి జూన్ 30 వరకూ అంటే నాలుగు నెలలపాటు అద్దె వుండదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎస్ టి పిఐ అనేది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న స్వయంప్రతిపత్తిగల శాఖ. దీనికి దేశవ్యాప్తంగా 60 కేంద్రాలున్నాయి. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా వున్న పలు ఐటీ కంపెనీలకు ఊరట లభించినట్లయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వారి అద్దె రద్దు చేయడంవల్ల రెండు వందల ఐటీ , ఐటీ ఆధారిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది.
ఈ నిర్ణయం కారణంగా ఆయా యూనిట్లు రూ. 5 కోట్ల రూపాయల్ని చెల్లించాల్సిన అవసరముండదు. దాదాపు 3 వేల మంది ఐటీ, ఐటిఇఎస్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
(Release ID: 1615169)
Visitor Counter : 196