పర్యటక మంత్రిత్వ శాఖ

"దేఖో అప్నా దేశ్" వెబినార్ సీరీస్ - రేపు - రెండో భాగంలో - కోల్కతా ఘన చరిత్ర, సంస్కృతి.

లాక్ డౌన్ సమయంలో భారతదేశ విభిన్న చరిత్ర, సంస్కృతిని తెలియజేసే విధంగా వెబినార్ సీరీస్ ను ప్రారంభించిన - కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ

Posted On: 15 APR 2020 4:58PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన "దేఖో అప్నా దేశ్వెబినార్ సీరీస్ కు విశేష స్పందన లభిస్తోంది.  మన అద్భుతమైన భారతదేశం లోని వివిధ ప్రాంతాల సమాచారం, సంస్కృతి, వారసత్వం గురించి ఈ వెబినార్ సీరీస్ లో పొందుపరిచారు.  నిన్న నిర్వహించిన మొదటి వెబినార్ లో ఢిల్లీ సుదీర్ఘ చరిత్ర గురించిన విశేషాలను తెలియజేశారు.  ఈ వెబినార్ కి " సిటీ అఫ్ సిటీస్ - ఢిల్లీ పర్సనల్ డైరీ" అనే శీర్షిక పెట్టారు. ఈ కార్యక్రమానికి 5,700 మంది నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.  పర్యాటక అవగాహన మరియు సామాజిక చరిత్ర పై ఈ భాగం ప్రధానంగా ఆధారపడింది. 

దిగువన ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఈ వెబినార్ పూర్తి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.  

https://youtu.be/LWlBc8F_Us4

 

 

ఢిల్లీ పై కార్యక్రమం విజయవంతమైన తర్వాత, "దేఖో అప్నా దేశ్" వెబినార్ సీరీస్ రెండవ భాగం రేపు (ఏప్రిల్ 16వ తేదీ) ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్షంగా ప్రసారమౌతుంది.  ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు " కలకత్తా - ఒక సంస్కృతీ సంగమం" గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కోల్కతా నగరం చరిత్ర, సంస్కృతి తో నిండి ఉంది; దేశ, విదేశీ ప్రభావాలు అధికంగా ఉన్న నగరం; ఆ గొప్పతనం ఇప్పటికీ పటిష్టంగా ఉందిఆ వైవిధ్యం ఇప్పటికీ ఇంకా ఎలా కొనసాగుతోందీ, పర్యాటక విధానం ద్వారా దీనిపై ఎలా అవగాహన కల్పించాలీ అనే విషయాలను ఈ వెబినార్ లో చర్చించడం జరుగుతుంది.  ఈ వెబినార్ లో  ఇఫ్తేఖార్ అహ్సన్రామానుజ ఘోష్రిత్విక్ ఘోష్అనిర్బన్ దత్తా ప్రధానంగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని అద్భుతమైన కోల్కత నగరానికి తీసుకునివెళ్తారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు దిగువన ఉన్న లింక్ ను క్లిక్ చేసి తమ పేరు నమోదు చేసుకోవచ్చు.  

 https://bit.ly/WebinarCalcutta

కోవిడ్-19 భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితాలపై భారీ ప్రభావం చూపుతోంది.  పర్యాటక రంగం కూడా సహజంగానే దేశ, విదేశాల్లో రాకపోకలు లేక భారీగా ప్రభావితమైంది.  ఇటువంటి అసాధారణమైన పరిస్థితుల్లో, మానవ సంబంధాలను కొనసాగించడానికీ, మళ్ళీ ప్రయాణాలు ప్రారంభించటానికి మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని కలిగించడానికీ సాంకేతికత ఉపయోగపడుతుందని కేంద్ర  పర్యాటక శాఖ విశ్వసిస్తోంది.  ఇది దృష్టిలో పెట్టుకునే, కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ "దేఖో అప్నా దేశ్వెబినార్ సీరీస్ ను ప్రారంభించింది. 

 *******(Release ID: 1614779) Visitor Counter : 94