నీతి ఆయోగ్

కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఏడాది పాటు త‌మ జీతంలో 30 శాతం సొమ్మును పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇవ్వ‌నున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌, స‌భ్యులు మ‌రియు ఈఏసీ-పీఎం చైర్మ‌న్‌

Posted On: 15 APR 2020 5:03PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎదుర‌వుతున్న జాతీయ సంక్షోభంపై పోరాడటానికి ప్రభుత్వం విభిన్న ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌య‌త్నాల‌కు భారీగా ఆర్థిక వ‌న‌రులు కావాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మరియు ఇతర‌ సభ్యులు, ఈఏసీ-పీఎం చైర్మ‌న్‌లు స్వచ్ఛందంగా ఏడాది పాటు త‌మ జీతంలో 30 శాతం కోతకు ముందుకు వ‌చ్చారు. ఈ డబ్బును పీఎం సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ (పీఎం కేర్స్) నిధికి విరాళంగా అందించనున్నారు.(Release ID: 1614750) Visitor Counter : 70