రైల్వే మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 లాక్డౌన్ 3 మే 2020 వరకు పొడిగించిన కారణంగా అన్ని ప్రయాణ రైళ్ళు రద్దు

యుటిఎస్ మరియు పిఆర్ఎస్లతోపాటు అన్ని టికెట్ల బుకింగ్ కౌంటర్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వనిలిపివేయబడతాయి

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆన్లైన్లో టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇ-టికెట్లతోపాటు, రైళ్ళలో ముందస్తు రిజర్వేషన్లు రద్దు

రద్దు చేసిన రైళ్ళలో టికెట్లు రిజర్వు చేసుకున్నవారికి మొత్తం నగదు తిరిగి చెల్లింపు

ఇంకా రద్దు చేయని రైళ్ళలో ముందస్తు బుకింగ్ టికెట్లను రద్దు చేసుకున్న వారికి కూడా మొత్తం నగదు తిరిగి చెల్లింపు

Posted On: 14 APR 2020 1:58PM by PIB Hyderabad


కొవిడ్-19 నిరోధక చర్యల్లో భాగంగా  తీసుకున్న లాక్డౌన్ కొనసాగింపు మూలంగా భారతీయ రైల్వే ప్రీమియం రైళ్ళు, మెయిలు/ఎక్సుప్రెస్ రైళ్ళు, ప్యాసింజరు, సబర్బన్ రైళ్ళు, కోల్కత్తా మెట్రో రైలు, కొంకణ్ రైల్వే వంటి అన్ని రైళ్ళను 3 మే 2020 వరకు రద్దు చేసింది.

దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు అందించడం కోసం గూడ్సు మరియు పార్శిల్ రైళ్ళు యథావిధంగా నడుపబడుతాయి.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆన్లైన్లో టికెట్ల రద్దు సౌకర్యం కొనసాగుతున్నప్పటికీ ఇ-టికెట్లతోపాటు ఎటువంటి టికెట్ల బుకింగు జరుపబడదు. యుటిఎస్ మరియు పిఆర్ఎస్ టికెట్ బుకింగులతోపాటు అన్ని టికెట్ కౌంటర్లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రద్దుచేయడమైనది. రద్దు చేసిన అన్ని రైళ్ళ టికెట్లకు నగదు మొత్తాన్ని తిరిగి చెల్లించబడుతుంది, ఇంకా రద్దు చేయని రైళ్ళలో ముందస్తుగా రిజర్వు చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నవారికి కూడా పూర్తి నగదు చెల్లింపబడుతుంది.

3 మే 2020 వరకు లాక్డౌన్ పొడిగించిన కారణంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు వాటంతట అవే నగదు వారికి తిరిగి చెల్లించబడుతుంది, కాగా రైల్వే కౌంటర్లలో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు 31 జులై 2020 వరకు తిరిగి చెల్లింపులు తీసుకొనవచ్చును.



(Release ID: 1614340) Visitor Counter : 206