రైల్వే మంత్రిత్వ శాఖ
ఇళ్లల్లో వంటగదులు నడవాలన్నా, రైతులు సహాయం పొందాలన్నా, రైల్వేల కృషి ప్రధానంగా ఉండాలి.
2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 ఏప్రిల్ 12వ తేదీ వరకు రైల్వేలు 36,724 వ్యాగన్ల ఆహారధాన్యాలు; 861 వ్యాగన్ల చక్కెర; 1753 వ్యాగన్ల ఉప్పు; 606 వ్యాగన్ల /ట్యాంకర్ల వంట నూనెలు మరియు 14317 వ్యాగన్ల ఎరువులు రవాణా చేశాయి.
పండ్లు, కూరగాయలు, పాలు, పాల పదార్ధాల వంటి పాడైపోయే వస్తువులతో పాటు వ్యవసాయం కోసం విత్తనాలను నిర్ణీత 63 మార్గాల్లో, 171 రైళ్లు రవాణా చేశాయి.
ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, వంట నూనెలతో పాటు రైతులకు తగినంత పరిమాణంలో ఎరువులను సకాలంలో సేకరించి, సకాలంలో సరఫరా చేయడంలో భారతీయ రైల్వేలు అన్ని విధాలా కృషి చేశాయి.
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2020 6:50PM by PIB Hyderabad
భారతీయుల అందరి ఇళ్లల్లో వంటశాలలు సాధారణంగా కొనసాగడానికీ, వ్యవసాయ రంగంలో రైతులు సాగుకు కావలసిన అన్ని వస్తువులు నిరంతరాయంగా పొందడానికి భారతీయ రైల్వేలు 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు అకుంఠిత దీక్షతో పనిచేసాయి. ఈ సమయంలో రైల్వేలు 36,724 వ్యాగన్ల ఆహారధాన్యాలు; 861 వ్యాగన్ల చక్కెర; 1753 వ్యాగన్ల ఉప్పు; 606 వ్యాగన్ల /ట్యాంకర్ల వంట నూనెలు మరియు 14317 వ్యాగన్ల ఎరువులు రవాణా చేశాయి. (ఒక్కొక్క వ్యాగన్ లో 58-60 టన్నుల సరుకులు రవాణా అయ్యాయి).
కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, వంట నూనెలతో పాటు రైతులకు తగినంత పరిమాణంలో ఎరువులను సకాలంలో సేకరించి, సకాలంలో సరఫరా చేయడంలో భారతీయ రైల్వేలు అన్ని విధాలా కృషి చేశాయి. 2020 ఏప్రిల్ నెల మొదటి 12 రోజుల్లో ఈ నిత్యావసర వస్తువుల లోడింగు, రవాణా, అన్-లోడింగ్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగాయి.
రానున్న ఖరీఫ్ పంట కాలానికి అవసరమైన ఎరువుల లభ్యత, రవాణా విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తో సన్నిహిత సమన్వయంతో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆహారధ్యాన్యాల లోడింగ్ విషయంలో కేంద్ర వ్యవసాయశాఖ తో కలిసి పనిచేయడం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి:
|
క్రమ సంఖ్య
|
తేదీ
|
ఆహార
ధాన్యాల
వ్యాగన్ల
సంఖ్య
|
చక్కెర
వ్యాగన్ల
సంఖ్య
|
ఉప్పు
వ్యాగన్ల
సంఖ్య
|
వంట నూనెల
వ్యాగన్ల
సంఖ్య
|
ఎరువుల
వ్యాగన్ల
సంఖ్య
|
|
1.
|
01.04.2020
|
2343
|
210
|
-
|
-
|
761
|
|
2.
|
02.04.2020
|
2582
|
-
|
133
|
64
|
1047
|
|
3.
|
03.04.2020
|
3285
|
41
|
103
|
122
|
1123
|
|
4.
|
04.04.2020
|
3151
|
42
|
84
|
50
|
996
|
|
5.
|
05.04.2020
|
2810
|
42
|
165
|
42
|
996
|
|
6.
|
06.04.2020
|
2730
|
42
|
170
|
14
|
960
|
|
7.
|
07.04.2020
|
3211
|
105
|
168
|
-
|
1504
|
|
8.
|
08.04.2020
|
3478
|
84
|
236
|
50
|
1225
|
|
9.
|
09.04.2020
|
4061
|
64
|
41
|
50
|
1434
|
|
10.
|
10.04.2020
|
3192
|
63
|
275
|
69
|
1518
|
|
11.
|
11.04.2020
|
2973
|
42
|
168
|
70
|
1324
|
|
12.
|
12.04.2020
|
2908
|
126
|
210
|
75
|
1429
|
|
|
Total
|
36724
|
861
|
1753
|
606
|
14317
|
దేశంలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటినుండీ, భారతీయ రైల్వలు పండ్లు, కూరగాయలు, పాలు, పాల పదార్ధాలు వంటి పాడైపోయే వస్తువులతో పాటు వ్యవసాయానికి పనికి వచ్చే విత్తనాలు వంటివి పార్సెల్ ప్రత్యేక రైళ్ల ద్వారా రవాణా చేయడానికి 63 మార్గాలను గుర్తించాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ 63 మార్గాల్లోనూ ముందుగా నిర్ణయించిన సమయాలకు ఈ రైళ్లు నడిచాయి.
ఈ పార్సెల్ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, ముంబాయి, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుస్తాయి. వీటికి అదనంగా ఈశాన్య ప్రాంతానికి సరుకుల రవాణా చేయాలనే ఉద్దేశ్యంతో గువాహటి కి కూడా రైలు మార్గం కలపడం జరిగింది. ఈ రైలు మార్గాల్లో కలిసే ఇతర ముఖ్యమైన నగరాల్లో భోపాల్, అలాహాబాద్, డెహ్రాడూన్, వారణాసి, అహ్మదాబాద్, వదోదర, రాంచీ, గోరఖ్ పూర్, తిరువనంతపురం, సేలం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రూర్కెలా, బిలాస్ పూర్, భుసావల్, టాటానగర్, జైపూర్, ఆగ్రా, నాసిక్, నాగపూర్, అకోలా, జల్గావ్, సూరత్, పూణే, రాయపూర్, పాట్నా, అసన్ సోల్, కాన్పూర్, జైపూర్, బికనేర్, అజ్మీర్, గ్వాలియర్, మథుర, నెల్లూరు, జబల్ పూర్ మొదలైనవి ఉన్నాయి.
ముందుగా నిర్ణయించిన మార్గాలలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ రైళ్లు తిరుగుతాయి. తద్వారా దేశంలోని ఏ భాగాన్ని అనుసంధానం చేయకుండా విడిచేది లేదు. నిర్ణీత మార్గంలో అవకాశం ఉన్న చోటల్లా ట్రైన్ ఆగుతుంది. తద్వారా ఎక్కువ సంఖ్యలో పార్సిళ్లు తీసుకోడానికి అవకాశం ఉంటుంది.
రైల్వేలు నడుపుతున్న ఈ రైళ్ల ప్రయోజనాన్ని పొందవలసిందిగా అన్ని రాష్ట్రాలకు చెందిన మిషన్ డైరెక్టర్లు, సంబంధిత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులను కోరడం జరిగింది. కొత్త మార్గాలు లేదా ఎక్కడైనా రైలు ప్రత్యేకంగా ఆపవలసి ఉన్నా రాష్ట్రాలు తెలియజేస్తే వారి అవసరానికి తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు అదనపు సభ్యుడు (వాణిజ్యం) తెలియజేశారు .
వివిధ జోన్లకు చెందిన అందరు పార్సెల్ సి.సి.ఎం.లు / చీఫ్ కమర్షియల్ మేనేజర్ల జాబితాతో పాటు బుకింగ్ విధానము, ప్రత్యేక రైళ్లు బయలుదేరు సమయాలు, రవాణా చార్జీల వివరాలను అందరికీ తెలియజేసి, ప్రచారం చేయడానికి వీలుగా అధికారులందరికీ అందజేయడం జరిగింది.
భారతీయ రైల్వే నుండి అందుబాటులో ఉన్న పార్సెల్ ప్రత్యేక రైళ్ల వివరాలను దిగువ వెబ్ సైట్ లింక్ ద్వారా పొందవచ్చు :
indianrailways.gov.in
పార్సెల్ ప్రత్యేక రైళ్ల వివరాలు దిగువ డైరెక్ట్ లింక్ ద్వారా పొందవచ్చు.
https://enquiry.indianrail.gov.in/mntes/q?opt=TrainRunning&subOpt=splTrnDtl
(రిలీజ్ ఐడి: 1614202)
సందర్శకుల సూచీ సంఖ్య : : 176