శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వైర‌స్‌పై అవ‌గాహ‌న‌కు సైన్స్ ఆధారిత వెబ్‌సైట్‌ ప్రారంభం

- `కోవిడ్ జ్ఞాన్’ పేరుతో పూర్తి విశ్వ‌స‌నీయ‌ స‌మాచారంతో అందుబాటులోకి
- బహు భాష‌, బహుళ సంస్థాగత సైన్స్ కమ్యూనికేటివ్ చ‌ర్య‌గా ఏర్పాటు
- క్యాంపస్ ఈ-మెయిల్ హెల్ప్‌డెస్క్, క్యాంపస్ మెసేజింగ్ సర్వీస్, ఫోన్ హెల్ప్‌లైన్ మరియు పీర్ సపోర్ట్ లైన్ సేవ‌లు కూడా

Posted On: 13 APR 2020 6:40PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఈ మహమ్మారికి సంబంధించి అన్ని అంశాలను కూలంక‌షంగా అర్థం చేసుకోవడానికి అసమాన స్థాయిలో జ‌ట్టుక‌డుతూ వివిధ చ‌ర్య‌లతో ముందుకు వ‌స్తున్నారు. న‌వ్య‌ కరోనా వైరస్ (సార్స్‌-సీవోవీ-2) క‌చ్చిత‌మైన ప్ర‌వ‌ర్త‌న తీరు, కరోనా ఫ్లూ సంక్ర‌మ‌ణ‌లోని డైనమిక్స్ దాని విశ్లేషణలు వైర‌స్‌పై పోరాటాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న వివిధ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక దూరంను ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న వివిధ మేటి సాధనాలు మరియు విమర్శనాత్మక అంచనాల గురించి సమాచారంపై దేశంలోని వివిధ వ‌ర్గాల వారు ఎక్క‌వగా ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి గురించి శాస్త్రీయ,వాస్తవిక అంశాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకురావడానికి `కోవిడ్ జ్ఞాన్’ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. బహుళ సంస్థాగత, బహుభాషా విధానంలో ఈ సైన్స్ కమ్యూనికేషన్ను అందుబాటులోకి తెచ్చారు.
ప‌లు పేరెన్నిక గ‌ల సంస్థ‌ల భాగ‌స్వామ్యం..
ఈ వెబ్‌సైట్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) ఆలోచ‌న‌తో ఈ కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి తేవ‌డం జ‌రిగింది. ఈ గొప్ప ప్ర‌య‌త్నంలో విజ్ఞాన్ ప్ర‌సార్‌, ఇండియా బ‌యోసైన్స్‌, బెంగ‌ళూరు లైప్ సైన్స్ క్ల‌స్ట‌రులోని (బీఎల్ఐఎస్‌సీ) ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్(ఇన్‌స్టెమ్), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ ప్లాట్ఫాం (సి-క్యాంప్ ), నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్‌) సంస్థ‌లు ఈ వెబ్‌సైట్‌లో ఇత‌ర ప్ర‌ముఖ భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉన్నాయి.
ప్రామాణిక స‌మాచార వ‌న‌రుగా..
ఈ నెల 3వ తేదీ నుంచి లైవ్‌గా అందుబాటులోకి వ‌చ్చిన ఈ వెబ్‌సైట్ను https://covid-gyan.in వెబ్ అడ్ర‌స్ ద్వారా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఈ వెబ్‌సైట్‌లో కోవిడ్-19 మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా, వైర‌స్ వ్యాప్తి నివారించేలా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు సంబంధించిన స‌మాచార స‌మాహారాన్ని ఇందులో అందుబాటులో ఉంచుతున్నారు. భార‌త్‌లో ప్ర‌జా బాహుళ్యం క‌లిగిన పరిశోధనా సంస్థలు మరియు వాటి అనుబంధ కార్యక్రమాల వారు ఈ వెబ్‌సైట్‌లో విష‌య సంగ్ర‌హ‌ణ‌ను అందిస్తున్నారు. కోవిడ్‌-19 వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను అర్థం చేసుకొనేందుకు, అది సంక్ర‌మించే విధానాల‌కు సంబంధించి ఉత్తమమైన శాస్త్రీయ అవగాహన కోసం అందుబాటులో ఉన్న ప‌లు స‌మాచారాల్లో మేటి విష‌యాల‌ను ఈ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. కోవిడ్‌-19కు సంబంధించి సమాచార ప్రామాణికమైన వనరుగా కాకుండా, ఈ వైర‌స్ వ్యాప్తి గురించి ప్ర‌జ‌ల్లో
అవగాహన కల్పించడం ద్వారా దానిని నివారించ‌డ‌మే స‌రైన సంభావ్య మార్గ‌మ‌నే ప్రాథ‌మిక లక్ష్యంగా ఈ వెబ్‌సైట్ రూపొందించ‌డం జ‌రిగింది.
స‌మ‌గ్ర స‌మాచార‌పు రిపాజిట‌రీగా..
కోవిడ్‌-19కు సంబంధించిన పూర్తి స‌మాచార కేంద్రంగా ఉండేలా దీనిని రూపొందించారు. ప్రముఖ శాస్త్రవేత్తల చర్చల ద్వారా స‌మీక‌రించిన ‘సరైన సమాచారం’ను ఆడియో/ ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్లు, వీడియోలు, పోడ్‌కాస్ట్, తరచుగా అడిగే ప్రశ్నలు వాటి స‌మాధానాలు, మిత్‌బస్టర్‌ల‌ను ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనికి తోడు శాస్త్రీయ పత్రాలకు లింక్‌ల‌ను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. ఈ కొత్త ఇన్ఫర్మేటివ్ వెబ్‌సైట్ యూజర్ ఫ్రెండ్లీగా మాత్రమే కాకుండా ప్రామాణికమైన, నమ్మదగిన స‌మాచార వెబ్‌సైట్‌గా మ‌న్న‌న‌ల్ని అందుకొంటోంది. ఇది
ప్రారంభించినప్పటి నుంచి శాస్త్రీయ సమాజం దీనిలోని అంశాలను ఫేస్‌బుక్‌ మరియు ట్విట్టర్ వంటి వివిధ సోషల్ మీడియా వేదిక‌ల‌పై విస్తృతంగా పంచుకుంటోంది. వివిధ ర‌కాల‌ భారతీయ భాషలలోని విషయాలను మరింత బహుముఖంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంతర్గత కమ్యూనికేషన్ మార్గంగా...
బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్(ఇన్‌స్టెమ్), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ ప్లాట్ఫాం(సి- క్యాంప్ ), నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్కు (ఎన్‌సీబీఎస్‌) చెందిన విద్యార్థి వాలంటీర్లు వివిధ కార్య‌క‌లాపాలను అందుబాటులోకి తెచ్చారు. త‌మ క్యాంప‌స్ క‌మ్యూనిటీల వారికి కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిపై క‌లుగుతున్న ప‌లు భ‌యాందోళ‌న‌లను దూరం చేసేందుకు, ఆసక్తి క‌లిగిన వారికి స‌మాచారం అందించేందుకు వీలుగా అంతర్గత కమ్యూనికేషన్ ఛానెళ్లను మరియు సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. క్యాంప‌స్ ఈ-మెయిల్ హెల్ప్‌డెస్క్‌, క్యాంప‌స్ మెసేజింగ్ సేవ‌లు, ఫోన్ హెల్ప్‌లైన్ వంటి చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు. దీనికి తోడు లాక్‌డౌన్ స‌మ‌యంలో విద్యార్థుల అవ‌స‌రాల‌ను తెలుసుకొనేందుకు వీలుగా కొంద‌రు వాలెంట‌రీ గ్రూపుల‌ను కూడా ఏర్పాటు చేశారు. 



(Release ID: 1614175) Visitor Counter : 200