నీతి ఆయోగ్

ఏటిఎల్ పాఠశాలల్లో 'కొల్లాబ్‌క్యాడ్'ని సంయుక్తంగా ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ సొసైటీ, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి)

విద్యార్థులు 3డి కంప్యూటర్ ఆధారిత డిజైన్ చేయడానికి 'కొల్లాబ్‌క్యాడ్'

Posted On: 13 APR 2020 3:56PM by PIB Hyderabad

అటల్ ఇన్నోవేషన్ మిషన్నీతి ఆయోగ్నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) ఈ రోజు సంయుక్తంగా కొల్లాబ్‌క్యాడ్ అనే సహకార నెట్‌వర్క్కంప్యూటర్ ఎనేబుల్డ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ప్రారంభించాయి. 2డి డ్రాఫ్టింగ్-డిటైలింగ్ నుండి 3డి ప్రొడక్ట్ డిజైన్‌కు మొత్తం ఇంజనీరింగ్ పరిష్కారాన్ని అందిస్తున్నాయి.

సృజనాత్మకతకల్పనా శక్తిని  స్వేచ్ఛగా వినియోగించి 3డి డిజైన్లను రూపొందించడానికిసవరించడానికి దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఎటిఎల్) విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పించడమే దీని లక్ష్యం. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా విద్యార్థులకు నెట్‌వర్క్‌లో డేటాను సమీకరించడానికినిల్వవిజువలైజేషన్ కోసం ఒకే డిజైన్ డేటాను యాక్సెస్ చేయడానికి కూడా మార్గాన్ని సూచిస్తుంది.

భారతదేశం అంతటా స్థాపించిన ఏటిఎల్ లుపిల్లలకు వారి వినూత్న ఆలోచనలుసృజనాత్మకతను మెరుగుపర్చడానికి ప్రేరణ ఇచ్చేలా టింకరింగ్ ప్రదేశాలను కల్పిస్తాయి. 3డి  ప్రింటింగ్‌ను ఉపయోగించడానికి, 3డి మోడలింగ్ / స్లైసింగ్ కోసం స్వదేశీఅత్యాధునిక మేడ్-ఇన్-ఇండియా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవడానికే ఈ ప్రయత్నం. దీని ద్వారా విద్యార్థులకు ఎన్ఐసి కొల్లాబ్‌క్యాడ్ తో అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారం అందించడం ఒక గొప్ప అవకాశం.

తమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అద్దం పట్టేలా కొల్లాబ్‌క్యాడ్ రూపొందించుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ఆలోచనలను ఆచరణ రూపంలో పెట్టవచ్చు. నీతి ఆయోగ్- అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ శ్రీ ఆర్.రమణన్  కొల్లాబ్‌క్యాడ్ ను సామజిక మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ లో ప్రారంభిస్తూ. 21వ శతాబ్దపు ఆవిష్కరణలలో 3డి ప్రింటింగ్ అనేది విడదీయరాని భాగంగా రూపొందుతుందని అన్నారు.  ఈ ఆవిష్కరణలో ఏఐఎంనీతి ఆయోగ్ భాగస్వామ్యం కావడం గర్వాంగా ఉందని ఆయన తెలిపారు. 5000 అటల్ టింకెరింగ్ లాబ్స్ లో 2.5 మిలియన్ల విద్యార్థులకు ఈ డిజైన్కొల్లాబ్‌క్యాడ్ ద్వారా అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.  కొల్లాబ్‌క్యాడ్ డిజైన్ మాడ్యూల్ సృజనాత్మక విద్యార్థులకు గొప్ప వరమనివాటిని తమ ఇళ్ల నుండి కానీపాఠశాలలు తెరిచాక అటల్ టింకెరింగ్ ల్యాబ్ల నుండి కానీ ఆచరణలో పెట్టేలా ప్రయోగాలు చేయవచ్చని ఆయన తెలిపారు. క్యాడ్ సిస్టం సాఫ్ట్ వేర్ ద్వారా విద్యార్థులకు భారీ ఎత్తున డేటా వనరులను ఆన్ లైన్ మాడ్యూల్ ద్వారా ఎన్ఐసి అందిస్తుందని శ్రీ రమణన్ చెప్పారు.

ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానంతో అందుబాటులోకి వస్తున్న ఈ 3డి కంప్యూటర్ ఆధారిత డిజైన్ ద్వారా ఇంజినీరింగ్ డ్రాయింగ్ లో కొత్త ఒరవడి సృషించవచ్చని అన్నారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు వికసించడానికి ఇదొక చక్కటి మార్గమని ఆమె తెలిపారు.

డెల్ టెక్నాలజీస్లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యమై అటల్ ఇన్నోవేషన్ మిషన్ గేమ్ డెవలప్మెంట్ మాడ్యూల్ ని కూడా రూపొందించింది. దీనిలో విద్యార్థులు అభ్యాసాన్ని  ఇంటి నుండే ప్రారంభించవచ్చు. దీనిలో సొంతగానే గేమ్స్ ని రూపొందించవచ్చు. ఈ వేదిక విద్యార్థులను ఆటలు ఆడేవాని నుండి ఆటలు సృష్టించే వారిలా మారుస్తుంది.

ఏఐఎం గురించి:

నీతి ఆయోగ్ గొడుగు కింద పనిచేసే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన ఒక చొరవ. సృజనాత్మకతవినూత్న ఆలోచనల ఆవిష్కరణలో ఇదొక సంస్కృతిని అలవరుస్తుంది. విద్యార్థులకు చిన్న వయసు నుండే కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా ప్రేరణ ఇస్తుంది. ఈ మిషన్ ద్వారా ఏటిఎల్ లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 14,916 స్కూళ్లను ఎంపిక చేసి వాటిలో ఈ టింకెరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. 

***


(Release ID: 1614080)