గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు, ఆకలితో అలమటిస్తున్న వారికి ఎస్.హెచ్.జి. మహిళలు నిర్వహిస్తున్న సామాజిక వంటశాలల ద్వారా ఆహారం సరఫరా.

అత్యవసర సేవలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న దేశంలోని స్వయం సహాయ బృందాలు;


చిన్న పిల్లలు, కౌమారులు, తల్లుల ఆరోగ్యం, పౌష్టికాహారం మొదలైన సేవలను ముందు వరుసలో అందజేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు కూడా తగిన సహాయం అందిస్తున్న స్వయం సేవా బృందాల మహిళలు.

Posted On: 13 APR 2020 1:11PM by PIB Hyderabad

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన జాతీయ లాక్ డౌన్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.  ఈ కోవిడ్-19 హమ్మారి మరియు లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలువలసదారులు, నిరాశ్రయులు, పేదలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   అవసరమున్న వారికి ఆహారం సమకూర్చడానికి సామాజిక వంటశాలల నిర్వహణ ఒక ఆచరణీయ పరిష్కారం.  తక్కువ ధరకు, పౌష్టికాహారం, భరించలేనివారికి తరచుగా ఉచితంగా ఆహారం అందించడమే ఈ సామాజిక వంటశాలల ప్రధాన ఉద్దేశ్యం. 

స్థానిక స్వపరిపాలన తో అనుసంధానమై ప్రతి గ్రామ పంచాయితీ లో ఉన్న స్వయం సహాయ బృందాలు (ఎస్.హెచ్.జి.) నెట్ వర్క్ లు సామాజిక వంటశాలలు / దీదీ ల హోటళ్ళ నిర్వహణకు  ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.  ఉదాహరణకు బీహార్, ఝార్ఖండ్, కేరళ, మధ్య ప్రదేశ్, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో సుమారు పది వేల సామాజిక వంటశాలలు పనిచేస్తున్నాయి.  75 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ వంటశాలలు ఆకలితో అలమటిస్తున్న సుమారు 70,000 మంది పేద ప్రజలకు రోజుకు రెండు సార్లు భోజనం అందిస్తున్నాయి.  ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 

కేరళ రాష్ట్రం లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వలస కూలీలు, పేదరికంతో అలమటిస్తున్న కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో స్థానిక ప్రభుత్వం సహకారంతో ఎస్.హెచ్.జి. కుడుంబశ్రీ ఈ సామాజిక వంటశాలలను నిర్వహిస్తోంది. వీరికి అందజేసే భోజనంలో నెయ్యితో కలిపిన అన్నం మరియు కోడి కూర ఇస్తున్నారుఈసామాజిక వంటశాలలలో ఆహరం తయారు చేసిన అనంతరం చిన్న పొట్లాలుగా కట్టి వాటిని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.  ఈ ఆహార పొట్లాలను స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న చాలా మంది ప్రజలకు కూడా అందిస్తున్నారు. 

 

                          

త్రిపుర లో సామాజిక వంటశాలల కాంట్రాక్టు ను త్రిపుర ప్రభుత్వం సంబంధిత రంగంలో అనుభవం ఉన్న   ఎస్.హెచ్.జి. లకు అప్పగించింది.  అరుణాచల్ ప్రదేశ్ లోని ఎస్.హెచ్.జి. మహిళలు నగదు విరాళంగా అందజేశారు.  కోవిడ్-19 విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి టిఫిన్లు, భోజనం, టీ తో పాటు ఇతర తినుబండారాలను సరఫరా చేస్తున్నారు.  మాస్కులు, బియ్యం, కూరగాయలు మొదలైనవి కూడా ఉచితంగా అందజేస్తున్నారు. 

 Description: Community kitchens being run under Mission Shakti

 

ఒడిశా లో ఆరు లక్షల మిషన్ శక్తి ఎస్.హెచ్.జి.లకు చెందిన సుమారు 70 లక్షల మంది మహిళా సభ్యులు అందరూ కలిసి అవసరమైనవారికి సహాయం అందజేస్తున్నారు.  వారికి నిత్యావసర వస్తువులతో పాటు సామాజిక వంటశాలల నుండి భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు.  సామాజిక వంటశాలలనుండి మిషన్ శక్తి ద్వారా సుమారు 45,000 మందికి ఆహారం సరఫరా చేశారు. 

ఝార్ఖండ్ లో ముఖ్యమంత్రి దీదీ వంటశాల (ఎమ్.ఎమ్.డి.కే.) ద్వారా గ్రామాల్లో అవసరమైనవారికి, వికలాంగులకు, పిల్లలకు, నిరుపేద ప్రజలకు  ఉంచితంగా ఆహారం అందజేస్తున్నారు.  రాష్ట్రంలోని అత్యధిక పంచాయతీలలో ప్రస్తుతం సుమారు 4,185 సామాజిక వంటశాలలు పనిచేస్తున్నాయి. 

 

 

జమ్మూ & కశ్మీర్ లో, చిక్కుకుపోయిన వలస కార్మికులతో ఎస్.హెచ్.జి.లు నిరంతరం సన్నిహితంగా ఉంటూ, వారి అవసరాలను తీరుస్తున్నాయి. 

 

 

లాక్ డౌన్ మధ్య ప్రజలకు అవసరమైన పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఎస్.హెచ్.జి. మహిళలు కృషి చేస్తున్నారు. 

 

" ఇంటిదగ్గరే ఉండు, ఆరోగ్యంగా ఉండు" అనే నియమాన్ని పాటిస్తున్నవారికి నిత్యావసర వస్తువులను, ఇతర సేవలను వారి గుమ్మం దగ్గరకే అందిస్తున్నారు.  దీనిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ బృందాలు సామాజిక దూరం  నియమాన్ని పాటిస్తూనే, అత్యవసర సేవలను అందిస్తున్నాయి.  వీరు వెంటనే భుజించడానికి అనువైన ఆహార పదార్ధాలను, రేషన్ సామానులు, తాజా కూరగాయలు వంటి వస్తువులతో పాటు, పరిశుభ్రతకు సంబంధించిన సేవలను కూడా అందిస్తున్నారు.  మొబైల్ వాహనాలపై కూరగాయలు,  సూపర్ మార్కెట్ వస్తువులు కూడా అందుబాటులోకి తెస్తున్నారు.  ఒడిశా, ఛత్తీస్ గఢ్ లలో రేషన్ సరుకులతో పాటు కోడి గుడ్డు లను కూడా పంపిణీ చేస్తున్నారు.  వీటిని ఐదేళ్లలోపు పిల్లలకు, గర్భిణీలకు, చంటి పిల్లల తల్లులకు, నిరుపేదలకు అందే విధంగా జాగ్రత్త పడుతున్నారు. 

పి.డి.ఎస్. దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూసేందుకు, ఎస్.హెచ్.జి. సభ్యులు, ప్రజల రేషన్ కార్డుల ద్వారా లభించే వస్తువులను వారి తరఫున సేకరించి, వారి ఇళ్లవద్ద అందజేస్తున్నారు.  ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ. నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో వి.ఆర్.ఎఫ్. ని ఉపయోగించి, ముఖ్యమైన సరుకులతో పాటు, వంట నూనె, బట్టలు ఉతికే సబ్బు వంటి నిత్యావసర వస్తువులతో ఒక ఆహార కిట్ ను తయారుచేసి గ్రామాలలో ప్రజలకు అందజేస్తున్నారు.  ఒడిశా, ఛత్తీస్ గఢ్ లలో ఈ నిధులను వినియోగించి, కౌమార దశలో అమ్మాయిలకు క్లీన్ ప్యాడ్ లు సరఫరా చేస్తున్నారు. \

 చిన్న పిల్లలు, కౌమారులు, తల్లుల ఆరోగ్యం, పౌష్టికాహారం మొదలైన సేవలను ముందు వరుసలో అందజేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు బీహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లలోని ఎస్.ఆర్.ఎల్.ఎం. లకు చెందిన మహిళలు తగిన సహాయం అందజేస్తున్నారు.   ప్రసవానికి ముందూ, ఆతర్వాత మహిళలకు అవసరమైన సేవలతో పాటు, ఐ.ఎఫ్.ఏ. మాత్రల ద్వారా సూక్ష్మ పోషకాలను కూడా అందజేస్తున్నారు.  ఈ రాష్ట్రాలలోని 2,118 ఎస్.హెచ్.జి. లకు చెందిన మహిళా సభ్యులు పోషకాహారం లోపం ఉన్న 4,310 మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లుల అవసరాలు తీర్చారు.   

ఆయా సమాజాల్లో,  సురక్షితమైన, పరిశుభ్రత పద్ధతులను ప్రోత్సహిస్తూ, సామాజికంగా ప్రతిస్పందించే సహకారం ద్వారా వారి జీవనోపాధిని కొనసాగిస్తూ, ఈ మహిళలు, ఎంతో అంకితభావంతో, శ్రద్దతో కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో కూడా పాల్గొంటున్నారు. 

*****



(Release ID: 1614073) Visitor Counter : 252