రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఘాట్కోపర్ ముంబైలోని నావికా క్వారంటైన్ శిబిరం నుండి 44 మంది శరణార్థులు తిరిగి ఇళ్లకు

Posted On: 13 APR 2020 11:52AM by PIB Hyderabad

ఇరాన్ నుండి వచ్చిన 44 మందిని (24 మంది మహిళలతో సహా) చడీ చప్పుడు లేకుండావిజయవంతంగా ముంబై ఘట్కోపర్ లోని తన మెటీరియల్ ఆర్గనైజేషన్ ప్రాంగణం నుండి  క్వారెంటైన్ చేసి తిరిగి వారిని వెనక్కి పంపింది భారత నావికా దళం. మర్చి 13వ తేదీన ఈ 44 మందిని క్వారంటైన్ కి తరలించారు. మర్చి 28వ తేదీ వరకు క్వారెంటైన్ పూర్తయ్యాక ఆరోగ్య పరీక్షల్లో  కోవిడ్-19 నెగటివ్ నిర్ధారణ కావడంతో వారందరిని అక్కడ నుండి పంపి వేయడానికి నిర్ణయించారు. అయితే రవాణా సదుపాయాలు లేక పోవడం తో వారిని అక్కడే ఉంచారు. శరణార్ధుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్య బృందం పనిచేసింది. వారి సౌకర్యాలకు కానీవారి ఆహార విషయాలలో కానీ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. వారికి లైబ్రరీటీవీ గదిఇండోర్ ఆటలుచిన్న జిమ్ము వంటి సౌకర్యాలను సమకూర్చారు. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండడంతో ఉన్న పరిమిత సౌకర్యాలని వారికి అనువుగా మార్చారు నావికా దళం సిబ్బంది. వారి నివాసాలు ఉన్న శ్రీనగర్ , లడఖ్ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు లేకపోవడంతో కొద్దీ రోజులు క్వారంటైన్ పొడిగించారు.  చివరకు ఈ నెల 12వ తేదీన వైమానిక దళానికి చెందిన సి-130 విమానాల్లో 44 మందిని శ్రీనగర్ కు తరలించారు. ప్రతి శరణార్థికి ప్యాక్ చేసిన ఆహారాన్నిచేతితో కుట్టిన రెండు మాస్కులు ఇచ్చారు. 

కోవిడ్-19పై దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అవుతున్న అనేక మందితో తో పాటు భారత నావికా దళం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. పౌరులకు గానిస్థానిక ప్రభుత్వ యంత్రాంగాలకు కానీ సహాయం చేయడానికి భారత నావికాదళం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది.

                                                ****


(Release ID: 1613912) Visitor Counter : 156