శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా హ్యాండ్ సానిటైజర్, ఇళ్లలో తయారుచేసే మాస్కులు వంటి ఉత్పత్తులను తయారుచేస్తున్న అస్సాం గ్రామీణ మహిళలు.
Posted On:
13 APR 2020 11:16AM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సమీప ప్రాంతంలోని గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్ద్యేశ్యంతో శాస్త్ర సాంకేతిక శాఖ (డి.ఎస్.టి.) కి చెందిన సీడ్ విభాగం సహాయంతో జోర్హాట్ లోని సి.ఎస్.ఐ.ఆర్.-శాస్త్ర సాంకేతిక ఈశాన్య సంస్థ కింద గ్రామీణ మహిళల టెక్నాలజీ పార్క్ (ఆర్.డబ్ల్యూ. టి.పి.) ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలు హ్యాండ్ సానిటైజర్, ఇంట్లో తయారుచేసే మాస్కులు, ద్రవ క్రిమి సంహారకాలు వంటి వివిధ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు.
"కోవిడ్-19 వంటి సవాళ్ళను ఎదుర్కోడానికి పటిష్టమైన సమాజ భాగస్వామ్యం, సహకారం చాలా అవసరం. అవగాహన కల్పించడం, సంబంధిత పరిష్కారాలను సూచించడం, పెద్దగా సాంకేతికత అవసరం లేని మాస్కులు, క్రిమి సంహారకాలవంటివి తయారుచేయడం మొదలైన విషయాలలో స్వయం సహాయ బృందాలు, అంకిత భావంతో పనిచేసే ప్రభుత్వేతర సంస్థల సేవలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో సమర్ధంగా ఉపయోగపడతాయి." అని డి.ఎస్.టి., కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు.
సాంప్రదాయ "గామోచ" (ఒక సాంప్రదాయ నూలు తువ్వాలు) నుండి ఇంట్లో తయారుచేసే మాస్కులు తయారుచేసే విధానంపై ఈ ప్రాంతంలోని గ్రామీణ మహిళలకు జోర్హాట్ లోని ఆర్.డబ్ల్యూ.టి.పి. ద్వారా శిక్షణ ఇచ్చారు. ఇంట్లో తయారుచేసే మాస్క్ డిజైన్ ను ఖరారు చేశారు. సుమారు 150 గామోచాలు, రెండు కుట్టు మిషన్లు ఇచ్చారు. (ఒక గామోచ నుండి ఆరు ఇంట్లో తయారుచేసే మాస్కులను ఉత్పత్తి చేయవచ్చు).
మహిళలకు ఒక్కొక్క మాస్క్ కు 15 రూపాయల చొప్పున ధర ఇవ్వాలని ప్రతిపాదించారు. దీని అదనంగా, రెండు వందల ద్రవ క్రిమి సంహారకాలను కూడా తయారుచేస్తారు. ద్రవ క్రిమి సంహారకాలు తయారుచేయడానికి అవసరమైన డెట్టాల్, ఇథనాల్, గ్లిజరిన్, అవసరమైన నూనె సమకూర్చారు. ఈ క్రిమి సంహారకాలను కూడా సమీప గ్రామాల్లోని ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తారు.
మర్చి 24వ తేదీన లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఆర్.డబ్ల్యూ.టి.పి. కి చెందిన మహిళలలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణా కాలంలో తయారుచేసిన సుమారు 50 లీటర్ల హ్యాండ్ సానిటైజర్, 160 లీటర్ల ద్రవ క్రిమి సంహారకాలను శిక్షణలో పాల్గొన్న 60 మంది మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గురించీ, చేపట్టవలసిన ముందు జాగ్రత్త చర్యలతో పాటు, కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో చేయవలసిన, చేయకూడని పనులను వివరిస్తూ ఆర్.డబ్ల్యూ.టి.పి. అస్సామీ భాషలో పోస్టర్లు, కరపత్రాలు కూడా రూపొందించింది.
మరిన్ని వివరాల కోసం :
· శ్రీ జతిన్ కలిత,
ప్రధాన శాస్త్రవేత్త,
సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఈ.ఐ.ఎస్.టి.,
జోర్హాట్,
ఈ-మెయిల్ : kalitajk74[at]gmail[dot]com,
మొబైల్ నెంబర్ : +91-9435557824
· డాక్టర్ ఇందు పురీ ,
శాస్త్రవేత్త "ఎఫ్", డి.ఎస్.టి.,
ఈ-మెయిల్ : indub.puri[at]nic[dot]in,
మొబైల్ నెంబర్ : 9810557964
****
(Release ID: 1613880)
Visitor Counter : 212
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada