సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

డబుల్ లేయల్డ్ ఖాదీ మాస్క్ లను అభివృద్ధి చేయనున్న ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ కమిషన్ (కె.వి.ఐ.సి) ; భారీ పరిమాణంలో వెల్లువెత్తిన ఆర్డర్లు

త్వరలో జమ్మూ కశ్మీర్ కు 7.5 లక్షల మాస్కులు సరఫరా చేయనున్న కె.వి.ఐ.సి.

జిల్లా కలెక్టర్లకు 500 మాస్క్ లు ఉచితంగా అందించాలని కె.వి.ఐ.సి. సెంటర్లకు విజ్ఞప్తి చేసిన కె.వి.ఐ.సి. ఛైర్మన్

Posted On: 12 APR 2020 5:31PM by PIB Hyderabad

ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.విఐ.సి) డబుల్ లేయర్డ్ ఖాదీ మాస్కులను విజయవంతగా అభివృద్ధి చేసింది. అంతే కాదు పెద్ద మొత్తంలో సరఫరా కోసం ఆర్డర్లను కూడా అందిపుచ్చుకుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి 7.5 లక్షల ఖాదీ మాస్క్ ల సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ఇందులో జమ్మూ జిల్లాకు 5 లక్షలు, పుల్వామా జిల్లాకు 1.4 లక్షలు, ఉదంపూర్ కు లక్ష, కుప్వారాకు 10 వేల మాస్కులు ఏప్రిల్ 20 లోగా సరఫరా చేయనున్నారు. పునర్వినియోగించే సామర్థ్యమున్న ఈ మాస్కు 7 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పుతో మూడు ప్లీట్లతో, మూలల్లో నాలుగు వైపుల కట్టే దారాలతో తయారు చేశారు.

ఈ మాస్కుల తయారీకి ప్రత్యేకంగా డబుల్ ట్విస్టెడ్ ఖాదీ వాడుతున్నట్లు కె.వి.ఐ.సి. ఛైర్మన్ శ్రీ వి.కె.సక్సేనా తెలిపారు. ఇది 70 శాతం తేమను నిలుపుకోవడంతో పాటు గాలి సులభంగా వెళ్ళడానికి వీలు కల్పిస్తుందని, అందువల్ల సులభంగా లభించడంతో పాటు, జేబులో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. అంతే కాకుండా ఇవి చేతితో నేసిన ఖాదీతో తయారు అయ్యాయని, వాడకంతో సులభమే కాకుండా, ఉతకడం ద్వారా చక్కగా శుభ్రం చేసుకుని వాడవచ్చని తెలిపారు.

ప్రస్తుతం జమ్మూ సమీపంలోని నాగ్రోటలోని ఖాదీ కేంద్రాన్ని మాస్క్ తయారీ కేంద్రంగా మార్చారు. ఇది రోజుకు 10 వేల మాస్క్ లను ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన ఆర్డర్లు వివిధ స్వయం సహాయక బృందాలు మరియు ఖాదీ సంస్థలలో మరియు శ్రీనగర్ చుట్టుపక్కల పంపిణీ చేయబడుతున్నాయి.

 ఒక మీటర్ ఖాదీ గుడ్డతో 10 డబుల్ లేయర్ మాస్క్ లు తయారు అవుతాయి. 7.5 లక్షల మాస్క్ ల తయారీకి సుమారు 75 వేల మీటర్ల ఖాదీ గుడ్డను వినియోగిస్తారు. దీని వల్ల ఖాదీ చేతివృత్తుల వారికి జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగు అవుతాయి. జమ్మూ కాశ్మీర్ ఖాదీ సంస్థలు కేవలం ఉన్ని బట్టను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నందున, మాస్క్ ల కోసం ఖాదీని హర్యానా నుంచి, ఉత్తప ప్రదేశ్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందు కోసం జిల్లా అధికారులు ప్రత్యేక అనుమతిని సైతం అందించారు.

దేశ వ్యాప్తంగా స్థానిక పరిపాలనకు మద్దతుగా, జిల్లా కలెక్టర్లకు 500 మాస్క్ ల చొప్పున ఉచితంగా అందజేయాలని కె.వి.ఐ.సి. ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థలో 2400 క్రియాశీల ఖాదీ సంస్థలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా 12 లక్షల మాస్క్ లు అవసరం అవుతాయి. ఈ నిర్ణయం తర్వాత అనేక ఖాదీ సంస్థలు జిల్లా కలెక్టర్లకు 500 మాస్క్ లు ఇవ్వడం ప్రారంభించాయి. కరోనా మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో మాస్క్ లు అత్యంత కీలకమైనవన్న శ్రీ సక్సేనా, డి.టి ఫ్యాబ్రిక్ నుంచి తయారు చేసిన ఈ మాస్క్ లు  డిమాండ్ కు తగిన విధంగా అందించడంతో పాటు మంచి నాణ్యమైనవని తెలిపారు.



(Release ID: 1613723) Visitor Counter : 217