రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కరొనపై పోరాట యోధుల్లా పనిచేస్తున్న పీఎం జనఔషధి కేంద్ర సిబ్బంది : మాండవీయ
Posted On:
12 APR 2020 5:21PM by PIB Hyderabad
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానమంత్రి జనఔషధి కేంద్ర (పీఎంజేకే) సిబ్బంది కరోనా పోరాట యోధుల్లా పనిచేస్తున్నారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మనసుఖ్ మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా 6,300 జనఔషధి కేంద్రాల్లో సరసమైన అందుబాటు ధరలలో మందులు లభ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి ట్వీట్ చేసారు. ఇందుకు సంబంధించిన గిడ్డంగులు కూడా పగలు రాత్రి యుద్ధప్రాతిపదికన సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాలలో ఫార్మాసిస్టులు సామాన్య ప్రజలకు జనరిక్ మందులను అందుబాటు ధరల్లో అందజేస్తున్నారని తెలిపారు. గురుగ్రామ్ కేంద్ర గిడ్డంగితో పాటు గువాహటి, చెన్నైలో చెరో ప్రాంతీయ గిడ్డంగి, 50 మంది డిస్ట్రిబ్యూటర్లు పూర్తి సామర్థ్యంతో ఔషధాలను అందుబాటులో ఉంచారని కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనితో పాటు దగ్గరలో ఉన్న జనఔషధీ కేంద్రాల వివరాలు, మందుల జాబితా, వాటి ధరలు అందరికి తెలిసేలా ‘జన్ ఔషధి సుగమ్’ అనే యాప్ కూడా ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పారు. ఈ యాప్ ని గూగుల్ ప్లేస్టోర్, ఐ-ఫోన్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జనఔషధి కేంద్రం కోవిడ్-10 పై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. .
****
(Release ID: 1613694)
Visitor Counter : 196
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam