పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 2020 లో 85 లక్షల ఎల్.పి.జి సిలిండర్లు అందుకున్న పిఎంయువై లబ్ధిదారులు
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా అత్యవసర సేవలైన
ఎల్.పి.జి సిలిండర్ల సరఫరాలో అవిశ్రాంతంగా కృషిచేస్తున్న సిబ్బంది
Posted On:
12 APR 2020 1:50PM by PIB Hyderabad
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు , ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు అనుకూలమైన పలు నిర్ణయాలను ప్రకటించింది.కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులనుంచి పేదలను బయటపడేసేందుకు దీనిని ఉద్దేశించారు.
ఈ పథకం కింద ఉజ్వల లబ్ధిదారులకు మూడు నెలలపాటు ఏప్రిల్ నుంచి జూన్ 2020 వరకు ఎల్.పి.జి సిలిండర్ ను ఉచితంగా అందజేస్తారు.
ఇప్పటివరకూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పి.ఎం.జి.కె.వై పథకం కింద ఉచిత ఎల్‌పిజి సిలిండర్‌ను అందుకునేందుకు 7.5 కోట్ల పిఎంయువై లబ్దిదారుల ఖాతాలకు రూ 5,606 కోట్ల రూపాయల బదిలీ ప్రారంభించాయి. లబ్ధిదారులు ఈ నెలలో 1.26 కోట్ల సిలిండర్లను బుక్ చేసుకున్నారు ఇందులో 85 లక్షల సిలిండర్లను పిఎంయువై లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
దేశంలో 27.87 కోట్ల క్రియాశీల ఎల్.పి.జి వినియోగదారులు ఉన్నారు. ఇందులో పిపియువై లబ్ధిదారుల సంఖ్య 8 కోట్లు. లాక్ డౌన్ అనంతరం దేశంలో 50 నుంచి 60 లక్షల సిలిండర్లను రోజూ సరఫరా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నందువల్ల , ప్రజలుసురక్షితంగా ఇళ్లకే పరిమితం కావడంతో ఎల్‌పిజి సరఫరా వ్యవస్థలోని సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తూ పరిశుభ్రమైన ఇంధనాన్ని ప్రజల ఇంటివద్దకే నేరుగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నారు.
కోండ ప్రాంతాలు, ముంపుప్రాంతాలు, మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతంలోని పల్లెలు, ఎడారి ప్రాంతంలోని గ్రామాల వంటి వాటికి సైతం సకాలంలో సిలిండర్లు అందేలా వీరు చర్యలుతీసుకుంటున్నారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలోకూడా సిలిండర్లు పొందడానికి వేచి ఉండే సమయం కేవలం రెండు రోజులకంటే తక్కువగానే ఉంది. విధినిర్వహణలో భాగంగా , కోవిడ్ -19 వైరస్ ఇన్‌ఫెక్షన్ కు గురై ,గోడౌన్ కీపర్లు, మెకానిక్‌లు, డెలివరీ బాయ్‌ల వంటి వారు అకాల మరణం పాలైతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ను ఏక కాలంలో చెల్లించనున్నట్టు చమురు కంపెనీలైన ఐఒసిఎల్, హెచ్‌పిసిఎల్‌లు ప్రకటించాయి.
ప్రధాన్ మంత్రి ఉజ్వలయోజన కింద 31.03.2020 నాటికి ఎల్‌పిజి కనెక్షన్‌ను పెట్టించుకున్న వినియోగదారులందరూ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాలను పొందటానికి అర్హులు. ఈ పథకం 2020 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది . ఇది 2020 జూన్ 30 వరకు కొనసాగుతుంది.
ఈ పథకం కింద, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల రీఫిల్ ఆర్‌ఎస్‌పికి సమానమైన అడ్వాన్స్‌ను లేదా ఒక 5 కిలోల రీఫిల్ మొత్తాన్ని పిఎంయువై ఖాతాదారు బ్యాంక్ ఖాతాకు వారి వారి ప్యాకేజీ రకాన్ని బట్టి బదిలీ చేస్తున్నాయి. కస్టమర్ ఈ ముందస్తు డబ్బును ఎల్‌పిజి రీఫిల్ తీసుకోవడానికి ఉపయోగించవచ్చు
*******
(Release ID: 1613584)
Visitor Counter : 291
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam