రైల్వే మంత్రిత్వ శాఖ
10లక్షల మందికిపైగా పేదలకు వండిన వేడి భోజన పదార్థాలను ఉచితంగా పంపిణీ చేసిన భారతీయ రైల్వే
లాక్ డౌన్ సమయంలో 313 ప్రాంతాలలో ఆహారపొట్లాలు పంపిణీ చేసిన రైల్వే
జోనల్ రైల్వేలు, జిఆర్‌పి,ఎన్‌జిఒల సహాయంతో ఉచిత భోజనం పంపిణీ సవాలును ఎదుర్కొనేందుకు
ఐఆర్‌సిటిసి, ఆర్‌పిఎఫ్ సిద్ధం.
Posted On:
11 APR 2020 2:59PM by PIB Hyderabad
కోవిడ్ -19 కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వారికి వండిన వేడి ఆహార పదార్థాలనునిశ్వార్థంగా, స్వచ్ఛందంగా పంచేందుకు భారతతీయ రైల్వేకి చెందిన ఐఆర్‌సిటిసి, ఆర్‌పిఎఫ్, జోనల్ రైల్వేలు ఇతర సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. రైల్వేలు ఐఆర్‌సిటిసి కిచెన్ల ద్వారా రైల్వేలు పెద్ద మొత్తంలో వండిన ఆహారాన్ని మధ్యాహ్న భోజనం కింద పేపర్‌ప్లేట్లలో, రాత్రి భోజనాన్ని పాకెట్లలో అందజేస్తోంది. 2020 మార్చి 28 నుంచి ఆర్‌పిఎప్ సిబ్బంది సేవలను, ఎన్‌జిఒ ల సేవలను ఇందుకు వినియోగిస్తున్నారు.
భోజనాల పంపిణీ ఈరోజుతో పది లక్షల సంఖ్యను దాటి సుమారు 10.2 లక్షలకు చేరుకుంది. ఈ ఆహార పదార్థాలను పేదలు పిల్లు, కూలీలు, వలసకార్మికులు, వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారికి , భోజన సదుపాయాలు లేక అవస్థలు పడుతూ రైల్వే స్టేషన్ల కనిపించే వారికి , రైల్వే స్టేషన్లకు కాస్త దూరంలోనూ భోజనం కోసం ఇబ్బంది పడుతున్న వారికి వీటిని చేరవేస్తున్నారు. ఆహారాన్ని పంపిణీ చేసే సమయంలో పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడానికి పెద్ద పీట వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు, దక్షిణ, దక్షిణ మధ్య, జోన్లలో గల న్యూఢిల్లీ, బెంగళూరు, హుబ్లి, ముంబాయి సెంట్రల్, అహ్మదాబాద్, బుసావల్, హౌరా,పాట్నా, గయ, రాంచి, కతిహార్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్, బాలసోర్, విజయవాడ, ఖుద్రా, కాట్పాడి, తిరుచినాపల్లి, ధన్ బాద్, గౌహతి, సమస్తిపూర్, ప్రయాగ్‌రాజ్, ఇటార్సి, విశాఖపట్ననం, చెంగల్పట్టు, పూణె, హాజిపూర్, రాయ్‌పూర్, టాటానగర్, లకు చెందిన ఐఆర్‌సిటిసి బేస్ కిచేన్‌ల సహకారంతో లాక్‌డౌన్ నుంచి 10 ఏప్రిల్ 2020 వరకూ 10.2 లక్షల భోజనాలను పేదలు, అవసరమైన వారికి పంపిణీ చేశారు. ఇందులో 60 శాతంపైగా భోజనాన్ని ఐఆర్‌సిటిసి సమకూర్చగా, మరో 2.3 లక్షల భోజనాలను ఆర్‌పిఎప్ తన స్వంత వనరుల నుంచి సమకూర్చింది. మరో 2 లోల భోజనాలను రైల్వే సంస్థలతొ కలసి పనిచేస్తున్న ఎన్.జి.ఒలు సమకూర్చాయి.
ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సిబ్బంది, ఆయాజోన్ల వాణిజ్య విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆహార పంపిణీ జరుగుతోంది. సంబంధిత జోన్ల , డివిజన్ల జిఎంలు, డిఆర్ ఎంలు ఐఆర్ సిటిసి అధికారుల సహాయంతో , రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేద ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి, స్టేషన్ పరిసరాలకు దూరంగా కూడా ఐఆర్‌సిటిసి సేవలను విస్తరించడానికి జిల్లా పాలనాయంత్రాంగం, ఎన్.జి.ఒ లతో కలసి నిరంతరం శ్రమిస్తున్నారు.
ఐఆర్‌సిటిసి, ఎన్‌జిఓలు ఆర్‌పిఎప్ స్వంత వంటశాలల నుండి తయారుచేసిన ఆహారాన్ని పేదలకు పంపిణీచేయడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2020 మార్చి 20న 74 ప్రాంతాలలో 5419 మంది పేదలకు ఆహారం పంపిణీ చేయడం మొదలుపెట్టి, ఈ సంఖ్య రోజువారీగా పెంచుతూ వచ్చింది. నిన్నటి వరకు ( మార్చి 10, 2020) వరకు సుమారు 6.5 లక్షల మందికి 313 స్థానాల్లో ఆర్‌పిఎఫ్ సిబ్బంది భోజనం పంపిణీ చేశారు. ఐఆర్‌సిటిసి తయారుచేసిన భోజనంలో ఎక్కువ భాగాన్ని ఆర్‌పిఎఫ్ పంపిణీ చేసింది.
అవసరమైన వారికి ఆహారం ఇతర సహాయం అందించడంలో రైల్వేలు చేస్తున్న కృషిని మరింత విస్తృతం చేయాలని రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ రైల్వే సిబ్బందిని ప్రోత్సహించిన విషయం గమనార్హం.
ఫలితంగా, ఐఆర్‌సిటిసి సిబ్బంది పిఎమ్‌కేర్స్ ఫండ్‌లో రూ .20 కోట్లు - 2019-20 సిఎస్‌ఆర్ ఫండ్ నుంచి రూ .1.5 కోట్లు, 2020-21 సిఎస్‌ఆర్ ఫండ్ నుంచి రూ .6.5 కోట్లు, మరో రూ .12 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ సహకారానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రశంసించారు, "కరోనావైరస్‌ను ఓడించడానికి @IRCTC అధికార యంత్రాంగం కంట్రిబ్యూషన్ ను నేను అభినందిస్తున్నాను. అని ప్రదానమంత్రి తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.
(Release ID: 1613316)
Visitor Counter : 230
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada