హోం మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ నిబంధనలనుంచి సముద్రంలో చేపల పట్టివేత/ ఆక్వా పరిశ్రమకు మినహాయింపు
Posted On:
10 APR 2020 10:38PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని నిరోధించడానికిగాను దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌కు మరికొన్ని మినహాయింపులను ఇస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఆయా మంత్రిత్వశాఖలకు విభాగాలకు పంపారు. 5వ అనుబంధం ప్రకారం సముద్రంలో చేపలుపట్టుకునేవారికి, ఆక్వాపరిశ్రమలో పని చేసేవారికి లాక్ డౌన్ నిబంధనలనుంచి మినహాయింపునిచ్చారు. ఆక్వా పరిశ్రమ దాణా, నిర్వహణ, చేపల పట్టివేత, ప్రాసెసింగ్, ప్యాకేజీ చేయడం, శీతల గృహాలు, అమ్మకాలు, మార్కెట్, హ్యాచరీలు, చేపలు, రొయ్యలు ఇంకా చేప ఉత్పత్తులు, విత్తన చేపల తరలింపు, ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్మికులకు, సంబంధిత కార్యకలాపాలన్నిటినీ లాక్ డౌన్ నిబంధనలనుంచి మినహాయింపునిచ్చారు.
(Release ID: 1613177)
Visitor Counter : 242