మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారతదేశ ఆన్ లైన్ విద్యా మార్గాన్ని మెరుగు పరిచేందుకు నూతన ఆలోచనలను స్వాగతిస్తూ వారం రోజుల పాటు భారత్ పఢే ఆన్ లైన్ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్

16 ఏప్రిల్ 2020 వరకు ఆలోచనలను ట్విట్టర్‌లో #BharatPadheOnline ని ఉపయోగించి మరియు @HRDMinistry & rDrRPNishank మరియు bharatpadheonline.mhrd@gmail.com లో పంచుకోవడం ద్వారా తెలియజేయవచ్చు.

అందుబాటులో ఉన్న డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫాంలను ప్రోత్సహించేటప్పుడు ఆన్ లైన్ విద్య అడ్డంకులను అధిగమించేందుకు భారతదేశంలోని ఉత్తమ ఆలోచనలను నేరుగా ఆహ్వానించడమే హెచ్.ఆర్.డి. మంత్రిత్వ శాఖ లక్ష్యం – శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్

Posted On: 10 APR 2020 2:43PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ భారత దేశ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ను మెరుగు పరచేందుకు వినూత్న ఆలోచనల క్రౌడ్ సోర్సింగ్ కోసం వారం రోజుల ఆన్ లైన్ ప్రచారాన్ని  ప్రారంభించారు. భారత్ పఢే ఆన్ లైన్ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆన్ లైన్ విద్యా విధానంలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్ లను ప్రోత్సహించడంతో భాగంగా, దేశ ప్రజల నుంచి వినూత్నమైన ఉత్తమ ఆలోచనలను నేరుగా ఆహ్వానించడమే హెచ్.ఆర్.డి. మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రచారంలోని ప్రదాన ఉద్దేశం అని తెలిపారు.  bharatpadheonline.mhrd[at]gmail[dot]com మరియు ట్విట్టర్‌లో # ఏప్రిల్ 16, 2020 వరకు # భారత్ పఢే ఆన్ లైన్ ను ఉపయోగించడం ద్వారా వ్యక్తిగతంగా సలహాలు ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు.

मेरा आप सभी से निवेदन है कि आप सब मंत्रालय को ऑनलाइन शिक्षा पद्धति को और अधिक प्रभावशाली और रचनात्मक बनाने हेतु अपने सुझाव दें। आप सभी अपने सुझाव #BharatPadheonline का उपयोग करते हुए मेरे @DRPNishank व मंत्रालय के @HRDMinistry टि्वटर अकाउंट में भेज सकतें हैं। #IndiaFightsCorona pic.twitter.com/kdmoZj4mm5

— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 10, 2020

 

ఆన్ లైన్ విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మరియు సృజనాత్మకంగా మార్చేందుకు మీ సలహాలను మంత్రిత్వ శాఖకు ఇవ్వాలను నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీరందరూ

#BharatPadheonline ఉపయోగించి మంత్రిత్వ శాఖ యొక్క నా @DrRPNishank మరియు @HRDMinistry ట్విట్టర్ ఖాతాకు మీ సూచనలను పంపవచ్చు. #IndiaFightsCorona pic.twitter.com/kdmoZj4mm5

- డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (@DrRPNishank) ఏప్రిల్ 10, 2020

 

విద్యార్థులు, ఉపాధ్యాయులే తమ ప్రధాన లక్ష్యమని తెలిపిన శ్రీ ఫోఖ్రియాల్, ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పద్ధతుల్ని మెరుగు పరిచేందుకు వారు ఈ ప్రచారంలో మనస్ఫూర్తిగా పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇందులో నిమగ్నమై ఉన్నారని, వారు కూడా తమ ఆలోచనలు పంచుకోవచ్చని, వాటిని ఆకర్షణీయంగా ఎలా మార్చవచ్చనే విషయాన్ని తెలియజేయమని ఆయన కోరారు.

విద్యావేత్తలు నిపుణులు సైతం తమ అనుభవంతో సహకరించవచ్చని, సంప్రదాయ విద్య విధానాన్ని ఆన్ లైన్ విద్యగా మార్చడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ప్రస్తుత సవాళ్ళను ఎలా అధిగమించాలో తెలియజేయాలని కోరారు. భారతీయ ఆన్ లైన్ విద్యను మెరుగు పరిచే ఈ కార్యక్రమంలో భారతీయులంతా పాల్గొనాలని శ్రీ నిశాంక్ పిలుపునిచ్చారు.


(Release ID: 1613033) Visitor Counter : 171