రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

స్థానిక సంస్థలు/ ప్రభుత్వాలకు రూ. 85.5 లక్షల విరాళం ఇచ్చిన సిపెట్ సంస్థలు / కేంద్రాలు

ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిధి “పి ఎం కేరెస్ నిధి”కి ఒక రోజు వేతనం రూ. 18.25 లక్షలు విరాళం ఇచ్చిన సీపెట్ ఉద్యోగులు

Posted On: 10 APR 2020 2:00PM by PIB Hyderabad

వివిధ స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ – 19 మహమ్మారిని ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా భారత ప్రభుత్వ రసాయనాలు మరియు పెట్రో రసాయనాల మంత్రిత్వ శాఖ  పరిధిలోని కేంద్ర ప్లాస్టిక్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ (CIPET) రూ. 85.50 విరాళం ఇచ్చింది. ఇదికాకుండా సీపెట్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.18.25 ప్రధానమంత్రి అత్యవసర సహాయనిధి “పిఎం కేరెస్” కు విరాళంగా ఇచ్చారు. 

 

కోవిడ్ – 19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపధ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, బలహీనవర్గాలు, వలస కార్మికులను ఆదుకునేందుకు వారికి ఆశ్రయం, ఆహారం కల్పించేందుకు సీపెట్ ఇచ్చిన విరాళాన్ని వినియోగిస్తారు. 

సిపెట్ సంస్థలు / కేంద్రాలు ఇచ్చిన మొత్తం విరాళం రూ. 85.5 లక్షలలో సీపెట్, సి ఎస్ టి ఎస్, హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాలు రూ. 2 లక్షల వంతున ఇచ్చిన విరాళం కూడా ఉంది. 

కాగా కోవిడ్ -19 సహాయ చర్యలలో భాగంగా సీపెట్ కేంద్రాలు సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.  ఈ కృషిలో భాగంగా  గ్వాలియర్ లోని సీపెట్, సి ఎస్ టి ఎస్ కేంద్రం తమ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని జిల్లా మేజిస్ట్రేట్ /కలెక్టర్ కు అప్పగించింది.  పారా మెడికల్ సిబ్బంది సేవలకు తోడుగా సీపెట్ సిబ్బందిని మరియు అధికారులను 24x7 సేవలు అందించడానికి నియమించడం ద్వారా 72 పడకలున్న క్వారెంటైన్ కేంద్రాన్ని సృష్టించారు.


(Release ID: 1613031) Visitor Counter : 201