కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 బాధితులు దాఖలుచేసిన 1.37 లక్షల ఈ.పి.ఎఫ్. అడ్వాన్స్ దరఖాస్తులను 10 రోజులలో పరిష్కరించిన ఈ.పి.ఎఫ్.ఓ.

Posted On: 10 APR 2020 1:17PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం లోని కార్మిక మరియు ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ కింద చట్టబద్ధమైన సంస్థగా ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈ.పి.ఎఫ్.ఓ.), కోవిడ్-19 తో పోరాడుతున్న చందాదారులకు సహాయ పడాలనే ఉద్దేశ్యంతో ఈ.పి.ఎఫ్. పధకాన్ని సవరించి ప్రత్యేకంగా రూపొందించిన కొత్త నిబంధన ప్రకారం దేశవ్యాప్తంగా లక్షా 37 వేల దరఖాస్తులను పరిష్కరించి 279.65 కోట్ల రూపాయల మొత్తాన్ని పంపిణీ చేస్తోంది.   ఈ మొత్తాలు ఇప్పటికే వారి ఖాతాల్లో జమ కావడం ప్రారంభమయ్యింది.  కే.వై.సి. తో పూర్తిగా అనుసాధనమైన ఈ ప్రక్రియ ద్వారా దరఖాస్తులన్నీ కేవలం 72 గంటల్లో పరిష్కరించబడుతున్నాయి.  కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి దాఖలు చేసిన దరఖాస్తులతో పాటు ఇతర దరఖాస్తులను కూడా కే.వై.సి. తో అనుసంధానమైన ప్రక్రియ ద్వారా సాధ్యమైనంత తొందరగా పరిష్కరించడం జరుగుతోంది. 

 

 

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోడానికి చేపట్టిన పి.ఎం.జి.కే.వై. పధకంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఈ.పి.ఎఫ్. పధకం పారా 68 ఎల్ (3) ని 2020 మర్చి 28వ తేదీన ప్రవేశ పెట్టడం జరిగింది. దీని ప్రకారం ఈ.పి.ఎఫ్. పధకం నుండి ప్రత్యేకంగా డబ్బు ను విత్  డ్రా చేసుకోడానికి అనుమతి ఇచ్చారు.  ఈ నిబంధన కింద ఒక సభ్యుడు తన ఈ.పి.ఎఫ్. ఖాతాలో ఉన్న నిల్వలో 75 శాతం మూడునెలల బేసిక్ మరియు డి.ఏ, కి సరిపడా (ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటె అది) తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్స్ గా తీసుకోవచ్చుసభ్యుడు అంత కంటే తక్కువ మొత్తానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కేవలం అడ్వాన్స్ కాబట్టి, దీనిపై ఆదాయపన్ను చెల్లించనవసరం లేదు.   

 

 

డిమాండ్ బాగా పెరుగుతుందని ఊహించి, ఈ.ఫై.ఎఫ్.ఓ. ఒక పూర్తిగా నూతనమైన ఒక సాఫ్ట్ వేర్ ను అభివృధి చేసింది. దరఖాస్తులకు ఆన్ లైన్ లోనే రసీదులు ఇచ్చే విధానాన్ని 2020 మర్చి 29వ తేదీన 24 గంటల్లో అమలుచేసింది.  సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రస్తుత తరుణంలో భౌతిక కదలికలను తగ్గించే విధంగా దరఖాసులను, పేపర్ అక్కరలేకుండా పరిష్కరించాలి.  కే.వై.సి. కి అవసరమైన పూర్తి సమాచారాన్ని అందజేసిన సభ్యులందరికీ ఈ విధానం అందుబాటులో ఉంటుంది

 

 

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అనేక  సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల ఈ కారణంగా పి.ఈఫ్. అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని నిర్ణయించారు. 

 

 

ఈమహమ్మారిని ఎదుర్కోడానికి వీలుగా అడ్వాన్స్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఈ.పి.ఎఫ్. ఖాతాలన్నీ కే.వై.సి. తో అనుసంధానమై ఉండాలి.  ఈ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా పుట్టిన రోజు తేదీని సవరించడానికి అవసరమైన కే.వై.సి. తో కూడిన  ప్రమాణ పత్రాల నిబంధనలను సడలించింది.  పి.ఎఫ్. రికార్డుల్లో పుట్టిన రోజు తేదీ దిద్దుబాటుకు ఖాతాదారుల ఆధార్ కార్డును రుజువుగా స్వీకరించడానికి ఈ.పి.ఎఫ్.ఓ.  అంగీకరించింది. పుట్టినరోజు తేదీలో మూడు సంవత్సరాల వరకు తేడా ఉన్న అన్ని కేసులను ఇప్పుడు ఈ.పి.ఎఫ్.ఓ. ఆమోదిస్తుంది. 

 

*****


(Release ID: 1613029) Visitor Counter : 269