శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై పోరాటంలో సూక్ష్మజీవులను నిర్జీవం చేసే గేట్ వే, ముఖ తొడుగులను సురక్షితంగా పారవేసే బుట్టలను అభివృద్ధి చేసిన ఎస్సీటిఐఎంఎస్టి శాస్త్రజ్ఞులు

వైరస్ గొలుసును విచ్చిన్నం చేయడానికి ప్రజలు, దుస్తులు, ఉపరితలాలపై క్రిమిసంహారం; విసర్జించిన వస్తువుల నుండి సురక్షితంగా ఉండే పరికరాల అవసరం ఇపుడు కీలకం: డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ స్పష్టీకరణ

Posted On: 10 APR 2020 12:04PM by PIB Hyderabad

కేరళలోని  త్రివేండ్రంలో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్సీటిఐఎంఎస్టి) లోని శాస్త్రవేత్తలు కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి రెండు సాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించారు. వివిధ ప్రదేశాల్లోకి ప్రవేశించిన వ్యక్తులను  పరిశుభ్రం చేసేందుకు మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి చెందిన ఎస్సీటిఐఎంఎస్టి శాస్త్రవేత్తలు జితిన్ క్రిషన్ మరియు సుబాష్ వి.వి 'చిత్ర క్రిమిసంహారక గేట్వేని రూపొందించారు. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ మంచు పొగనుఅతినీలలోహిత (యూవి)ఆధారిత సుక్ష్మ క్రిముల నిర్ములన సదుపాయాన్ని కలిగి ఉన్న  పోర్టబుల్ వ్యవస్థ.

హైడ్రోజన్ పెరాక్సైడ్ పొగలు వ్యక్తి  శరీరంచేతులుదుస్తులను కాలుష్య రహితం చేస్తాయి. యూవి  వ్యవస్థ గదిని కాలుష్య రహితంగా శుద్ధి చేస్తుంది. మొత్తం వ్యవస్థ ఎలక్ట్రానిక్ నియంత్రణలో ఉంటుంది. గదిలో అమర్చిన సెన్సార్లు ఒక వ్యక్తి ప్రవేశాన్ని గుర్తించిహైడ్రోజన్ పెరాక్సైడ్ పొగను వదిలే ప్రక్రియను ప్రారంభిస్తాయి. వ్యక్తి గది గుండా దాని చివరి వరకు నడవాలి. వ్యక్తి బయటకు వచ్చినపుడుఈ వ్యవస్థ హైడ్రోజన్ పెరాక్సైడ్ పొగను వదలడం ఆపివేస్తుంది. గది లోపల యూవి లైట్ ను  ఆన్ చేస్తుంది. నిర్దేశించిన సమయం తరువాత ఆ  లైట్ ఆ‌టోమాటిక్‌గా ఆగిపోయిన తరువాతగది తదుపరి వ్యక్తి కోసం సిద్ధంగా ఉంటుంది. మొత్తం ఈ ప్రక్రియకు 40 సెకన్లు పడుతుంది. ఈ వ్యవస్థ పక్క గోడలను పారదర్శకంగా ఉండే గ్లాస్ తో అమర్చారు. గదిలో మనుషుల గమనాన్ని పరిశీలించడానికి తగు విధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసారు. ఈ డిజైన్ కి సంబంధించిన వివరాలన్నింటినీ ఎర్నాకుళంలోని హెచ్ఎంటి మెషిన్ టూల్స్ కి బదిలీ చేశారు. 
 

image.png
image.png

 

ఇక రెండవ సాంకేతికత, 'చిత్ర యూవి ఆధారిత  ఫేస్‌మాస్క్ డిస్పోజల్ బిన్'. దీనిని ఎస్సిటిఎమ్ఎస్టి కి చెందిన  సుబాష్ వివి రూపొందించారు. ఇన్‌ఫెక్షన్ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ఆసుపత్రులుబహిరంగ ప్రదేశాల్లో తమ శరీర భాగాలను వ్యాధి కారకాల నుండి సురక్షితంగా  కప్పుకునేలా వినియోగించిన వివిధ రకాల తొడుగులు వాడాక విసర్జించడానికి  ‘యూవి ఆధారిత ఫేస్‌మాస్క్ డిస్పోజల్ బిన్’ ఎంతో ఉపకరిస్తుంది. దీనిని  ఆరోగ్య కార్యకర్తలు ఉపయోగించవచ్చు.

ముఖాలకు వేసుకునే తొడుగులు ప్రస్తుత కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరి అయింది. అయితే ఒక సారి వాడిన ఈ వస్తువులు ప్రమాదకారకాలుగా కూడా పరిణమిస్తాయి. ఈ వ్యర్థాలను సేకరించేవారికి వారి విధులను నిర్వర్తిస్తున్నపుడు  కోవిడ్-19 వైరస్ ప్రమాదహేతువు కావచ్చు. కాబట్టి ఒక సారి వినియోగించిన తొడుగులను కేవలం చెత్త బుట్టలో పడేయడం కాకుండావాటిని సూక్ష్మక్రిములు నిర్జీవ వస్తువులుగా చేయడం చాలా ముఖ్యం. 

ప్రజల శరీరాలపైనాదుస్తులుఉపరితలాలపైనా,  అలాగే విడిచిపెట్టిన తొడుగులు పూర్తిగా క్రిమిసంహారం జరగాలని  తద్వారా వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేయాలని డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ స్పష్టం చేసారు. ఈ పోరాటంలో హైడ్రోజన్ పెరాక్సైడ్అతినీలలోహిత కాంతి పరిమిత డోస్ లలో వినియోగించడమే పెద్ద అస్త్రాలని ఆయన అన్నారు. 

 

(ఇతర వివరాలకు సంప్రదించండి: స్వప్న వామదేవన్పీఆర్ఓ,  ఎస్సీటిఐఎంఎస్టి మొబైల్: 9656815943, ఇమెయిల్:  pro@sctimst.ac.in ) 

                                        ****


(Release ID: 1612905) Visitor Counter : 162