ప్రధాన మంత్రి కార్యాలయం

మహమ్మారికి వ్యతిరేకంగా పోరులో మన స్నేహితులకు అవసరమైన సహాయం అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 APR 2020 12:50PM by PIB Hyderabad
మహమ్మారికి వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటంలో మన స్నేహితులకు సాధ్యమైన ఏ సహాయం అందించడానికైనా భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. 

ఇజ్రాయెల్ కు క్లోరోక్విన్ సరఫరా చేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్పందిస్తూ ఈ హామీ ఇచ్చారు.  

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేస్తూ, " ఈ మహమ్మారిని మనం కలిసి కట్టుగా తరిమి కొట్టాలి. మన స్నేహితులకు సాధ్యమైన ఏ సహాయం చేయడానికైనా భారతదేశం సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్ధిస్తున్నాము. " అని సమాధానం ఇచ్చారు

*****


(रिलीज़ आईडी: 1612886) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam