కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సహాయ కార్యక్రమాల కోసం అనేక చర్యలు చేపట్టిన - ఈ.ఎస్.ఐ.సి.

1,042 ఐసోలేషన్ పడకలతో ఎనిమిది ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులను కోవిడ్-19 ఆసుపత్రులుగా ప్రకటన.

Posted On: 09 APR 2020 5:02PM by PIB Hyderabad

కోవిడ్-19 విజృంభణతో దేశం చాలా సవాళ్ళను ఎదుర్కుంటోంది.   సామాజిక దూరాన్ని పాటించడం కోసం దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు.  ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి, ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఈ.ఎస్.ఐ.సి.) తమ భాగస్వాములు మరియు ప్రజానీకానికి అవసరమైన సహాయం అందించడానికి అనేక చర్యలు చేపట్టింది.   

1,042 ఐసోలేషన్ పడకలతో దిగువన పేర్కొన్న ఎనిమిది ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులను కేవలం కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకించిన ఆసుపత్రులుగా ప్రకటించడం జరిగింది :  

ఏ.   ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, అంకలేశ్వర్, గుజరాత్  :           100 పడకలు 

             బి.   ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, గురుగ్రామ్, హర్యానా      :             80 పడకలు 

             సి.   ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, వాపి, గుజరాత్                :           100 పడకలు 

 

            డి.    ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, ఉదయపూర్, రాజస్థాన్  :           100 పడకలు 

           ఈ.    ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, జమ్మూ                             :             50 పడకలు 

 

         ఎఫ్.    ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, బడ్డీ, హిమాచల్ ప్రదేశ్   :           100 పడకలు 

 

            జి.    ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, ఆదిత్యపూర్, ఝార్ఖండ్  :             42 పడకలు 

 

      హెచ్.    ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, జోకా, పశ్చిమ బెంగాల్     :           470 పడకలు 

 

వీటికి అదనంగా, దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన అనేక ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రుల్లో సుమారు 1,112 ఐసోలేషన్ పథకాలను అందుబాటులో ఉంచారు.  ఇంకా, ఏ ఆసుపత్రుల్లో, 197 వెంటిలేటర్లతో మొత్తం 555 ఐ.సి.యు. / హెచ్.డి.యు. పడకలను కూడా అందుబాటులో ఉంచారు.  హర్యానా లోని ఫరీదాబాద్ ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రిలో కోవిడ్-19 పరీక్ష సదుపాయం కల్పించారు.  దిగువ పేర్కొన్న ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రుల్లో క్వారంటైన్ సదుపాయంతో మొత్తం 1,184 పడకలు అందుబాటులో ఉన్నాయి. 

ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, అల్వార్, రాజస్థాన్          :       444 పడకలు 

ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, బిహతా, పాట్నా, బీహార్  :       400 పడకలు 

                  ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, గుల్బర్గా, కర్ణాటక             :       240 పడకలు 

                  ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి, కోర్బా, ఛత్తీస్ గఢ్             :      100 పడకలు 

ప్రస్తుత క్లిష్టమైన సమయంలో ఈ.ఎస్.ఐ. లబ్ధిదారుల కష్టాలను తగ్గించడానికి వీలుగా, లబ్ధిదారులు తమకు అవసరమైన మందులను ప్రైవేట్ దుకాణముల నుండి కొనుగోలు చేసుకోడానికి అనుమతి నివ్వడం జరిగింది.  లాక్ డౌన్ సమయంలో కొనుగోలు చేసిన మందులకు ఖర్చు అయిన మొత్తాన్ని ఆతర్వాత తిరిగి చెల్లిస్తారు. 

ఏదైనా ఒక ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రిని కరోనా అనుమానిత / ధృవీకరించిన కేసుల కోసం ప్రత్యేకంగా కోవిడ్-19 ఆసుపత్రిగా కేటాయించడం జరిగితే, ఈ.ఎస్.ఐ. లబ్ధిదారులు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది.    సంబంధిత ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి కోవిడ్-19 ఆసుపత్రిగా పనిచేస్తున్నంత కాలం, ఈ.ఎస్.ఐ. లబ్ధిదారులను తదుపరి / ఎస్.ఎస్.టి. కన్సల్టేషన్ / అడ్మిషన్ / పరీక్షల కోసం  అనుబంధ ఆసుపత్రులకు సిఫార్సు చేయవచ్చు.  ఈ.ఎస్.ఐ. లబ్ధిదారులు తమ అర్హతలకు అనుగుణంగా ఎటువంటి సిఫార్సు లేకుండా నేరుగా అనుబంధ ఆసుపత్రి నుండి అత్యవసర సేవలు / అత్యవసరం కాని సేవలు కూడా  పొందవచ్చు.  కరోనా వైరస్ కు సంబంధించిన కేసుల విషయంలో రాష్ట్ర / కేంద్ర ఆరోగ్య అధికారులతో సమర్ధవంతమైన సమన్వయం కోసం ప్రతి ఈ.ఎస్.ఐ. ఆసుపత్రికీ నోడల్ అధికారులను నియమించడం జరిగింది. 

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలన్నింటినీ ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులు అమలుచేస్తున్నాయి.    వీటి అమలును, దేశవ్యాప్తంగా ఉన్న ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులతో ఈ.ఎస్.ఐ.సి. ప్రధాన కార్యాలయం నిరంతరం సమీక్షిస్తోంది. 

మాస్కులు మరియు వ్యక్తిగత రక్షణ పరికరాల (పి.పి.ఈ) కిట్లు మొదలైనవి తగినంత సంఖ్యలో నిల్వ ఉండేవిధంగా కృషి జరుగుతోంది.  ఈ.ఎస్.ఐ.సి. ఆరోగ్య సంస్థల ప్రాంగణాల్లో వైరస్ సోకకుండా తగిన పరిశుభ్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. 

 కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై వైద్య / పారామెడికల్ సిబ్బందికి పునశ్చరణ తరగతులు తీసుకోవడం జరుగుతోంది.  కరోనా వైరస్ మహమ్మారి నిర్వహణ విషయాల్లో ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులు సంబంధిత రాష్ట్ర అధికార యంత్రాంగం తో సమన్వయంతో పనిచేస్తున్నాయి. 

లాక్ డౌన్ కారణంగా నిర్ణీత సమయంలో చందాలు చెల్లించలేకపోయిన లబ్ధిదారులకు కూడా 2020 జూన్ 30వ తేదీ వరకు యధావిధిగా వైద్య సేవలు పొందడానికి అనుమతించారు. 

 శాశ్వతంగా అంగవైకల్యం కలిగిన లబ్ది దారుల ప్రయోజనాన్ని ( 2020 మార్చి నెలకు సంబంధించి సుమారు 4 లక్షల రూపాయలను) వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 

 యాజమాన్యాలు చెల్లించవలసిన చందా విషయంలో ఫిబ్రవరి నెల చందా ఏప్రిల్ 15వ తేదీ వరకు; మార్చి చందా మే నెల 15వ తేదీ వరకు ఎటువంటి వడ్డీ / జరిమానా చెల్లించనవరసరం లేకుండా గడవు పొడిగించారు. 

 అదేవిధంగా యజమానులు దాఖలు చేయవలసిన ఈ.ఎస్.ఐ. చందా వివరాల గడువు తేదీని 2020 మే నెల 15వ తేదీ వరకు పొడిగించారు. 

 *****



(Release ID: 1612723) Visitor Counter : 250