ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్ నెస్ ప్యాకేజి కింద రూ. 15,000 కోట్లు మంజూరు చేసిన భారత ప్రభుత్వం

Posted On: 09 APR 2020 4:52PM by PIB Hyderabad

కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపరేషన్ ప్యాకేజీ కోసం భారత ప్రభుత్వం రూ.15,000 కోట్ల గణనీయమైన పెట్టుబడులను ప్రకటించింది. ఈ నిధులను కోవిడ్ -19 అత్యవసర ప్రతిస్పందన కింద (రూ.7774 కోట్లు) తక్షణం కొంత భాగాన్ని, మిగిలినది మధ్యస్థ కాలం మద్ధతు (1-4 సంవత్సరాలు) కింద మిషన్ మోడ్ విధానంలో అందించే విధంగా విడుదల చేయనుంది.

కోవిడ్ పరీక్షలు మరియు కోవిడ్ -19 కు సంబంధించిన చికిత్సా సౌకర్యాల అభివృద్ది, భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించడానికి అత్యవసర ప్రతిస్పందనను పెంచడం, అవసరమైన వైద్య పరికరాల కేంద్రీకృత సేకరణ మరియు కోవిడ్ సోకిన రోగుల చికిత్సకు అవసరమైన మందులు, భవిష్యత్తులో కోవిడ్ వ్యాప్తి నివారణ మరియు సంసిద్ధత కోసం ప్రయోగ శాలల ఏర్పాటు, నిఘా కార్యకలాపాలు ప్రోత్సహించేందుకు, బయో సెక్యూరిటీ సంసిద్ధత, మహమ్మారి వ్యాధుల పరిశోధన మరియు సంఘాలను ముందస్తుగా నిమగ్నం చేయడం, రిస్క్ కమ్యూనికేషన్ కార్యకలాపాలను నిర్వహించడం వంటి స్థితి స్థాపక జాతీయ మరియు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలు లాంటి అనేక కార్యక్రమాలు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేయబడతాయి.

2020 మార్చి 24న గౌరవ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ”కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి మరియు దేశీయ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది వేగంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. కరోనా పరీక్షా సదుపాయాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి (పి.పి.ఈ), ఐసోలేషన్ బెడ్స్, ఐసియూ పడకలు, వెంటిలేటర్లు మరియు ఇతర అవసరమైన పరికరాలు, అదే సమయంలో వైద్య మరియు పారామెడికల్ మానవ శక్తి శిక్షణ కూడా చేపట్టడం జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రాధాన్యత ఇచ్చేలా నేను ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలను అభ్యర్థించాను. వారి అగ్ర ప్రాధాన్యత ఆరోగ్యంగానే పరిగణించబడుతుంది. అని ప్రస్తావించారు.

ఖర్చులో ప్రధాన వాటా బలమైన అత్యవసర ప్రతిస్పందనను పెంచేందుకు జాతీయ మరియు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు మరియు తర్వాత ఈ మహమ్మారికి సంబంధించిన పరిశోధన మరియు బహుళ రంగా జాతీయ సంస్థలు మరియు వన్ హెల్త్, కమ్యూనిటీ ఎంగేజ్ మరియు రిస్క్ కమ్యూనికేషన్ అమలు, నిర్వహణ సామర్థ్యం పెంపొందించడానికి వేదికలను బలోపేతం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ మొత్తాన్ని వివిధ అమలు సంస్థల్లో (నేషనల్ హెల్త్ మిషన్, సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్, రైల్వేస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, ఐ.సి.ఎం.ఆర్. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) పరిస్థితులను ఈ వనరులను తిరిగి పొందేందుకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు అధికారం ఉంది.

ఆరోగ్య రంగంలో ఎదురౌతున్న సవాళ్ళ నియంత్రణ మరియు వ్యూహాల అమలులో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నేటికి, 157 ప్రభుత్వ మరియు 66 ప్రైవేట్ ప్రయోగశాలల నెట్ వర్క్ తో కూడిన మొత్తం 223 ల్యాబ్ లలో కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఇంకా ఈ మంత్రిత్వం ఇప్పటికే అత్యవసరంగా కోవిడ్ సమస్యను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 4,113 కోట్లు  అందజేయడం జరిగింది.



(Release ID: 1612720) Visitor Counter : 340