రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ముంబైలో వలస కార్మికల కోసం రేషన్ కల్పిస్తున్న భారతీయ నౌకాదళం

Posted On: 09 APR 2020 6:31PM by PIB Hyderabad

కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా ముంబైలో నిత్యావసరాల కోసం అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడం కోసం వారికి సరఫరా చేయడాని కోసం  04 మరియు 08 ఏప్రిల్ తేదీల్లో ఆహార నిత్యావసరాల పొట్లాలను భారతీయ నౌకాదళం మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి రేషన్ను అందజేసింది.

 పెద్ద ఎత్తున లాక్డౌన్లో చిక్కుకున్నవలస కార్మికుల సహాయార్థం ముంబై పట్టణ జిల్లా కలెక్టర్ 03 ఏప్రిల్ 2020న భారతీయ నౌకాదళం వారి సహాయాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు పశ్చిమ నావల్ కమాండ్ 250  ఆహార నిత్యావసరాలు కలిగిన రేషన్ పొట్లాలను 04 ఏప్రిల్ 2020న ముసాఫిర్ ఖానా మరియు ఏసియాటిక్ లైబ్రరీ దగ్గరలోని కలెక్టర్ కార్యాలయం స్థానిక అధికార యంత్రాంగానికి అందజేసింది. కఫే పరేడ్ మరియు కల్బాదేవి వద్ద సరాఫరా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. 08 ఏప్రిల్ 2020న అదనంగా మరో 500 రేషన్ పొట్లాలను స్థానిక యంత్రాంగానికి అందజేయగా కమాటిపురా ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మికులకు వాటిని అందజేయడం జరిగింది.



(Release ID: 1612679) Visitor Counter : 93