శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వైద్యపరికరాల ఉత్పత్తి కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బి.ఈ.ఎల్.) తో కలిసి పనిచేస్తున్న సి.ఎస్.ఐ.ఆర్.-నేషనల్ కెమికల్ లాబరేటరీ (ఎన్.సి.ఎల్.).

భారదేశ వ్యాప్తంగా భారీగా ఉత్పత్తి చేసే తయారీదారులకు ఉచితంగా హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ సిద్ధం.

Posted On: 09 APR 2020 10:46AM by PIB Hyderabad

సి.ఎస్.ఐ.ఆర్. లో భాగమైన ప్రయోగశాల, సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.సి.ఎల్. పూణే, తన వెంచర్ సెంటర్ ద్వారా ఆవిష్కరణ మరియు వ్యవస్ధాపకతను పోషించడంలో గత దశాబ్ద కాలంగా ముందు వరుసలో ఉంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కూడా ఈ కేంద్రానికి చెందిన ఆవిష్కరణలు సహాయపడుతున్నాయి. 

 

వాటిలో కరోనా వ్యాప్తి ని అరికట్టడానికి ఉపయోగపడే రెండు ఇటీవలి ఆవిష్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

 

 

1)      డిజిటల్ ఐ.ఆర్థెర్మో మీటర్ : 

 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ముఖ్యంగా ఉపయోగపడే ఒక పరికరం "డిజిటల్ ఐ.ఆర్థెర్మో మీటర్" ను

శ్రీ ప్రతీక్ కులకర్ణి నాయకత్వంలో సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.సి.ఎల్. కు చెందిన అంకురసంస్థ బి.ఎం.ఈ.కే. అభివృద్ధి చేసింది.  ఈ పరికరానికి విద్యుత్ ను అందించడానికి మొబైల్ ఫోను లేదా పవర్ బ్యాంకు ను ఉపయోగించవచ్చు.  ఐ.ఆర్థెర్మో మీటర్ ను దేశవ్యాప్తంగా  భారీగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ తో కూడిన పూర్తి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ థర్మోమీటర్లను ఉత్పత్తి దారులు భారీ ఎత్తున తయారుచేసి, స్థానికంగా ఉన్న డిమాండ్ ను చేరుకోడానికి ఈ కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది. బి.ఈ.ఎల్. (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పూణేభాగస్వామ్యంతో ఇప్పుడు వీటిని భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు.  ప్రస్తుతం ప్రాధమికంగా పంపిణీ చేసి, పరీక్ష చేయడానికి వంద ప్రొటోటైప్ యూనిట్లు బెంగుళూరు లోని టి.యు.వి. రెయిన్ ల్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద సిద్ధంగా ఉన్నాయి

 

  

2)      ఆక్సిజన్ ఎన్రిచ్ మెంట్ యూనిట్ (ఓ.ఈ.యు.) :

 

కోవిడ్-19 రోగులకు ఊపిరి తిత్తులు సరిగా పనిచేయకపోవడం వలన, వారికి అవసరమైన ఆక్సిజన్ అందించడం చాలా ముఖ్యం.  గాలిలో ఉన్న ఆక్సీజన్ సాంద్రతను 21-22 శాతం నుండి 38-40 శాతానికి పేర్చడానికి ఆక్సిజన్ ఎన్రిచ్ మెంట్ యూనిట్ (ఓ.ఈ.యు.) లను సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.సి.ఎల్. మరియు జెనరిక్ మెంబ్రేన్స్ అంకురసంస్థ అభివృద్ధి చేసింది. ఎన్ .సి.ఎల్. లోని పాలిమర్ సైన్స్ & ఇంజనీరింగ్ డివిజన్ అధిపతి డాక్టర్ ఉల్హాస్ ఖరుల్ ఈ అంకురసంస్థను స్థాపించారు.   ఇళ్లలోనూ, ఆసుపత్రుల్లోనూ గాలిలోని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను రోగులకు అందించడానికి వీలుగా ఓ.ఈ.యు. లలో  గాలిని వడబోసే ఫైబర్ మెంబ్రేన్ బండిల్స్ ఉంటాయి.  పూణే లో సిద్ధంగా ఉన్న ప్రోటో టైపు యూనిట్లను పరీక్ష / ధ్రువీకరణ కోసం బెంగుళూరు లోని టి.యు.వి. రెయిన్ ల్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు పంపుతున్నారు.  పూణే లోని ఎన్.సి.ఎల్. ప్రస్తుతం సుమారు 10 ఓ.ఈ.యూ. యంత్రాలను తయారుచేస్తుందిపరీక్షల అనంతరం, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతారు. 

 

 

 

పూణే లోని పోలీసు డిప్యూటీ కమిషనర్ కు ఐదు ఇన్ఫ్రారెడ్ నాన్-కాంటాక్ట్ థెర్మోమీటర్లను అందజేశారు. 

 

 

జెనరిక్-ఎన్.సి.ఎల్. ఆక్సిజన్ ఎన్రిచ్ మెంట్ యూనిట్ యంత్రాన్ని పరీక్షార్థం పూణే సమీపంలోని ఒక మెడికల్ సెంటర్ లో ఒక రోగి శ్వాస తీసుకునే మాస్క్ కు అమర్చారు. 

 

 

*****



(Release ID: 1612475) Visitor Counter : 173