మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నిర్వహణకు ‘ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్’ పోర్టల్ ప్రారంభం
- మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే విషయమై సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యం
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందిన ‘దీక్ష’ వేదికపై సైట్‌లో ప్రత్యేక పోర్టల్
Posted On:
09 APR 2020 12:24PM by PIB Hyderabad
భారత్‌లో కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను వైద్యులతో సహా పలువురు ఫ్రంట్‌లైన్ పారామెడికల్ సిబ్బంది వీరోచితంగా తన విధులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి తదుపరి దశలకు వృద్ధి చెంది వివిధ ప్రాంతాలో కోవిడ్-19 వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో రోగులకు సేవలను అందించేందుకు గాను మరింత మంది వైద్యులతో పాటు ఫ్రంట్‌లైన్ సిబ్బంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కట్టడికి ముందుండి వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ప్రభుత్వం కోవిడ్-19 నిర్వహణకు ‘ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్’(ఐగాట్) పోర్టల్‌ను ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు (హెచ్ఆర్‌డీ) చెందిన ‘దీక్ష’ వేదికపై ఈ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే విషయమై ఫ్రంట్‌లైన్ సిబ్బంది సామర్థ్యం పెంపొందించే లక్ష్యంగా దీనిని తీర్చిదిద్దారు. వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, పారిశుద్ధ్య కార్మికులు, సాకేంతిక సిబ్బంది, ఏఎన్ఎంలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పౌర రక్షణ అధికారులు, వివిధ పోలీసు సంస్థలు, ఎన్‌సీసీ సభ్యులు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకెఎస్) కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) కార్యకర్తలు, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఉద్యోగులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకర్తలతో పాటు ఇతర వాలంటీర్లకు ఉపయుక్తంగా ఉండేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు. కోవిడ్-19 మహమ్మారి కట్టడికి గాను అవసరమైన శ్రామిక శక్తికి తగిన నైపుణ్యతను అందించే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను https://igot.gov.in/igot/ అనే వెబ్‌లింక్ ద్వారా ఆసక్తి కలిగిన వారు పొందవచ్చు. ఎక్కువ మందికి సౌలభ్యంగా ఉండేలా ఈ శిక్షణా మాడ్యూల్‌ను ఫ్లెక్సిటైమ్, సైట్ బేసిస్‌పై అందించనున్నారు.
(Release ID: 1612474)
Visitor Counter : 327
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam