సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నేపథ్యంలో ఢిల్లీ లోని పేద కుటుంబాలకు పంపిణీ కోసం కేంద్రీయ భండార్ నిత్యావసర వస్తువులతో తయారుచేసిన 2,220 కిట్లను డాక్టర్ జితేంద్ర సింగ్ అందజేశారు.

Posted On: 08 APR 2020 3:43PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం, గౌరవనీయులు భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు మరియు డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.  సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డి.ఓ.పి.టి.) కింద పనిచేసే కేంద్రీయ భండార్, పేద కుటుంబాల కోసం " నిత్యావసర వస్తువుల కిట్" లను అందించాలనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది

 

 

కోవిడ్-19 నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు పంపిణీ కోసం, నిత్యావసర వస్తువులతో కూడిన 2,200 కిట్స్ తో కూడిన ఒక కన్ సైన్మెంట్ ను ఈశాన్యప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్.), ఎమ్.ఓ.ఎస్. పి.ఎం.ఓ.; సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అను ఇంధనం మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు సంబంధిత  అధికారులకు అందజేశారు.    తొమ్మిది వస్తువులతో కూడిన ఈ కిట్ ఒక నిరుపేద కుటుంబానికి కొన్ని రోజుల అవసరాన్ని తీరుస్తుంది. 

 

 

 

వీటిలో 1,700 కిట్లు సెంట్రల్ ఢిల్లీ జిల్లా సివిల్ లైన్స్ ఎస్.డి.ఎం. కు డాక్టర్ సింగ్ అందజేశారు. కాగా, మిగిలిన 500 కిట్లను డి.ఎం. (సెంట్రల్) కు అందజేస్తారు. 

 

 

పేదకుటుంబాలకు పంపిణీ కోసం కేంద్రీయ భండార్ మొత్తం 2,200 కిట్లు తయారుచేసింది.  

 

•      ఒక్కొక్క నిత్యావసర వస్తువుల కిట్ లో దిగువ పేర్కొన్న ఆహార పదార్ధాలు ఉన్నాయి 

 

 1.     బియ్యం                  -   3 కేజీలు.  

 2.     గోధుమ పిండి          -   3  కేజీలు.  

 3.     పప్పు                       -   2  కేజీలు.  

 4.    వంట నూనె              -   1 లీటరు.  

 5.     అటుకులు                 -    500 గ్రాములు.  

 6.   ఉప్పు                        -    1 కేజీ.  

 7.   స్నానాల సబ్బు         -    ఒకటి.  

 8.   బట్టలు ఉతికే సబ్బు -     ఒకటి.  

 9.   బిస్కట్లు                    -    3 ప్యాకెట్లు

 

 

<><><><><> 


(Release ID: 1612272) Visitor Counter : 214