శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పరీక్ష నిర్ధారణ కోసం "ర్యాపిడ్ డయాగ్నొస్టిక్ కిట్ " ను అభివృద్ధి చేసిన పూణే కి చెందిన అంకుర సంస్థ.
భవిష్యత్తులో గంటకు వంద నమూనాలు పరీక్షించగల సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశం.
" వేగం, వ్యయం, ఖచ్చితత్వం, ఏసమయంలోనైనా ఉపయోగించడానికి అందుబాటులో ఉండడం - కోవిడ్-19 పరీక్షలు చేపట్టడానికి ప్రధాన సవాళ్లు" అని డి.ఎస్.టి. కార్యదర్శి. ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు.
కోవిడ్-19 కోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం : "కోవ్-ఈ-సెన్స్"
రెండు ఉత్పత్తులు --- ఒకటి : సవరించిన పొలిమేరాస్ చైన్ రియాక్షన్ (పి.సి.ఆర్.) ఆధారిత గుర్తింపు పరికరం; రెండవది : వేగవంతమైన స్క్రీనింగ్ కోసం పోర్ట్రబుల్ చిప్ ఆధారిత మాడ్యూల్.
నిరంతర పర్యవేక్షణ ద్వారా భవిష్యత్తులో వ్యాధి తిరిగి రాకుండా కూడా పోర్టబుల్ ర్యాపిడ్ దియాగ్నోస్టిక్స్ పరికరం నిరోధించే అవకాశం ఉంది.
Posted On:
08 APR 2020 11:31AM by PIB Hyderabad
శాస్త్ర సాంకేతిక శాఖ (డి.ఎస్.టి.) ఆర్ధిక సహాయంతో వేగంవంతమైన వ్యాధి నిర్ధారణ కోసం వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న ఫాస్ట్ సెన్స్ డయాగ్నోస్టిక్స్ అనే అంకుర సంస్థ 2018 లో ప్రారంభమైంది. ఈ సంస్థ ఇప్పుడు కోవిడ్-19 నిర్ధారణ కోసం రెండు మాడ్యూల్స్ ను అభివృద్ధి చేస్తోంది.
"వేగం, వ్యయం, ఖచ్చితత్వం, ఏసమయంలోనైనా ఉపయోగించడానికి అందుబాటులో ఉండడం - కోవిడ్-19 పరీక్షలు చేపట్టడానికి ప్రధాన సవాళ్లు. ఈ అవసరాలను తీర్చే విధంగా అనేక అంకుర సంస్థలు పలు సృజనాత్మక, వినూత్న మార్గాలను అభివృద్ధి చేశాయి. వీటిలో సాంకేతికంగా అనువుగా ఉన్న వాటిని వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడానికి డి.ఎస్.టి. మద్దతు నిస్తోంది." అని డి.ఎస్.టి. కార్యదర్శి. ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు.
క్యాన్సర్లు, కాలేయ వ్యాధులు, నవజాత శిశువుకు సోకే వైరస్ వంటి సంక్లిష్ట వ్యాధులను ముందుగా పరీక్షించి, గురించడం కోసం ప్రస్తుతం వారు వినియోగిస్తున్న అంతర్జాతీయ విధానం "ఓమ్ని-సెన్స్" విధానంలోనే ఈ సంస్థ ఇప్పుడు కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా "కోవ్-ఈ-సెన్స్" పరిజ్ఞానాన్ని ప్రతిపాదించింది. స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షతో పాటు వేగవంతంగా సంరక్షణ విధానాన్ని, సులువైన అమలు విధానాన్ని కూడా సూచించగల అవకాశాలున్న "కోవ్-ఈ-సెన్స్" కోసం ఒక పేటెంట్ దాఖలు చేయడం జరిగింది.
ఈ సంస్థ ప్రస్తుతం రెండు ఉత్పత్తులను ప్రారంభించాలని భావిస్తోంది --- మొదటిది, సవరించిన పొలిమేరాస్ చైన్ రియాక్షన్ (పి.సి.ఆర్.) ఆధారిత గుర్తింపు పరికరం. ఇప్పటికే అమలులో ఉన్న పద్దతులతో పోలిస్తే, ఈ విధానంలో నిర్ధారణ, విశ్లేషణలకు తక్కువ సమయం పడుతుంది. అంటే గంటలో సుమారు 50 నమూనాలను పరీక్షించవచ్చు. రెండవది : వేగవంతమైన స్క్రీనింగ్ కోసం పోర్ట్రబుల్ చిప్ ఆధారిత మాడ్యూల్. ఈ పరికరం ద్వారా, ఆన్-చిప్ సెన్సింగ్ పరిజ్ఞానంతో ఒక్కొక్క నమూనాకు 15 నిముషాల కంటే తక్కువ సమయంలో అప్పటికప్పుడే ఫలితాలను పొందవచ్చు. భవిష్యత్తులో గంటకు వంద నమూనాలు పరీక్షించగల సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది.
ఎక్కువగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల అవసరం లేకుండా అక్కడిక్కడే వేగంగా ధృవీకరణ చేయడానికి ఫాస్ట్ సెన్స్ డయాగ్నోస్టిక్స్ రూపొందించే "పాయింట్ అఫ్ కేర్ డిటెక్షన్" పరికరం ఉపయోగపడుతుంది. కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటాన్ని ఇది వేగవంతం చేస్తుంది.
విమానాశ్రయాల వంటి జనాభా సాంద్రత ఎక్కువగా ఉందీ ప్రాంతాల్లో ఈ రెండు ప్రతిపాదిత పరికరాలనూ సులువుగా వినియోగించవచ్చు. ఆరోగ్యవంతులైన వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఆసుపత్రుల్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు. పరీక్షా ఫలితాలను ఒక గంట లోపు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో ఈ పరికరాలను తయారుచేయడానికి కంపెనీ ప్రస్తుతం కృషి కొనసాగిస్తోంది.
జాతీయ వైరాలజీ సంస్థ తో అనుబంధం కోసం ప్రస్తుతం ఈ బృందం కృషి చేస్తోంది. ఈ పరికరాలకు అధికారిక ఆమోదం పొందడం కోసం ఎదురుచూస్తోంది. ఈ పరికరాలను పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసి, మార్కెట్ చేయడానికి వీలుగా సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
Figure-1: Schematic of CovE-Sens functioning
ఈ విషయంలో వైరాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయో-ఇన్ స్ట్రుమెంటేషన్ శాస్త్రాలలో నిపుణులతో కూడిన బృందం పనిచేస్తోంది. 8 నుండి 10 వారాలలో ఈ బృందం ఒక నమూనాను విడుదల చేసే అవకాశం ఉంది. అభివృద్ధి కోసం ఉత్పత్తిని పెంచడానికి ఈ కంపెనీ కి కొన్ని అంతర్గత సౌకర్యాలు ఉన్నాయి.
ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఉపయోగపడ్డంతో పాటు, భవిష్యత్తులో ఈ వ్యాధి తిరగబెట్టకుండా కూడా ఈ "పోర్టబుల్ రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్" ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో, ఎవరైనా సులువుగా ఉపయోగించడానికి అనువుగా ఉండడంతో ఈ విధానం గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, పట్టణ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై అధిక భారాన్ని నివారిస్తుంది.
------------------------------------------------------------
మరింత సమాచారం కోసం సంప్రదించండి :
డాక్టర్ ప్రీతి నిగమ్ జోషి,
వ్యవస్థాపక డైరెక్టర్ ,
ఫాస్ట్ సెన్స్ దియాగ్నోస్టిక్స్,
ఈ-మెయిల్ : preetijoshi@fastsensediagnostics.com ,
మొబైల్ : 8975993781
*****
(Release ID: 1612237)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada