శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కరోనా వైరస్ జన్యు శ్రేణిపై భారతీయ పరిశోధకుల పరిశోధనలు ప్రారంభం

Posted On: 08 APR 2020 11:23AM by PIB Hyderabad

నొవెల్ కరోనా వైరస్ ఒక కొత్త వైరస్పరిశోధకులు దానిలోని అన్ని విభిన్న అంశాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కింద పనిచేసే హైదరాబాద్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి)న్యూ ఢిల్లీ-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) నొవెల్ కరోనా వైరస్ జన్యు శ్రేణిపై కలిసి పనిచేయడం ప్రారంభించాయి.

ఇది వైరస్ పరిణామక్రమాన్నిఅలాగే ఇది ఎంత చలనశీలంగాఎంత వేగంగా అనుకరిస్తుందో అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. ఇది ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందోదాని భవిష్యత్తు అంశాలు ఏమిటో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం మాకు సహాయపడుతుంది” అని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రాడిఎస్టిలోని ఇండియా సైన్స్ వైర్ సీనియర్ సైంటిస్ట్ జ్యోతి శర్మతో మాట్లాడుతూ అన్నారు. 

‘హోల్-జీనోమ్ సీక్వెన్సింగ్’ అనేది ఒక నిర్దిష్ట జీవి జన్యువు పూర్తి డిఎన్ఏ క్రమాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పద్ధతి. పాజిటివ్ ఉన్న రోగుల నమూనాలను పొందడంఈ నమూనాలను సీక్వెన్సింగ్ కేంద్రానికి పంపడం తాజా కరోనా వైరస్ సీక్వెన్సింగ్ చేసే విధానంలో ముఖ్యమైన ప్రక్రియ. జన్యు శ్రేణి అధ్యయనంలో అత్యంత ఎక్కువ నమూనాలు అవసరం అవుతాయి. "ఎక్కువ డేటా లేకుండా ఒక ముగింపు రావడం సరైన విధానం కాదు. సీక్వెన్సింగ్లు వీలైనన్ని సమీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మన వద్ద కొన్ని వందల సీక్వెన్సింగ్లు ఉంటేఅప్పుడు ఈ వైరస్ కు సంబంధించిన  అనేక జీవ సంబంధ కోణాల నుండి వివిధ పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు అని డాక్టర్ మిశ్రా అన్నారు.

పైన పేర్కొన్న ఒక్కొక్క సంస్థ నుండి లేదా 4గురు శాస్త్రజ్ఞులు జన్యు శ్రేణిపై నిరంతరం పని చేస్తున్నారు. రాబోయే 3-4 వారాలలో పరిశోధకులు కనీసం 200-300 ఐసోలేట్లను పొందే అవకాశం ఉంది. ఈ సమాచారం ఈ వైరస్ ప్రవర్తన గురించి మరికొంత నిర్ధారణకు సహాయపడుతుంది. ఇందు కోసం వివిధ ప్రాంతాలకు చెందిన ఐసొలేట్ చేసిన వైరస్ నమూనాలను ఇవ్వవలసిందిగా పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీని కోరారు. దీని ద్వారా మొత్తం దేశంలో ఈ వైరస్ కి సంబంధించిన విశాలమైన స్వభావం స్పష్టమవుతుంది. అలాగే పరిశోధన సంస్థలు కూడా వైరస్ పుట్టు పూర్వోత్తరాలను కనుగొనడానికి వీలవుతుంది.

దీని ఆధారంగా వైరస్ ఎక్కడ నుండి వచ్చిందిఏ సంతతి/జాతితో ఎక్కువ సారూప్యతవైవిధ్యమైన ఉత్పరివర్తనలుఏ జాతి బలహీనంగా ఉందిఏ జాతి బలంగా ఉందో అధ్యయనం చేయవచ్చు అని డాక్టర్ మిశ్రా చెప్పారు. ఇక వీటితో పాటు సంస్థ పరీక్ష సామర్త్యాన్ని కూడా పెంచుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు పరీక్షలు చేయించుకుంటున్నారు.  ఇది పాజిటివ్ కేసుల సంఖ్యను గుర్తించివాటిని ఐసొలేషన్ లేదా క్వారంటైన్ కి పంపించడానికి సహాయపడుతుంది. 

****



(Release ID: 1612226) Visitor Counter : 205